నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న సింగనమల మండల తెలుగుదేశం నాయకులు..
నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న సింగనమల మండల తెలుగుదేశం నాయకులు.
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు ఆధ్వర్యంలో గన్నవరం సమీపాన కీసరపల్లి గ్రామంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాసుల చంద్రమోహన్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డే నాగభూషణ్ జిల్లా బీసీ సెల్ కార్యనిర్వ కార్యదర్శి కొయ్యగూర పెద్దన్న ఎల్లనూరు మండల పార్టీ కన్వీనర్ దొడ్లో రామాంజనేయులు చెన్నయ్య ప్రతాప్ నెట్టికంటి జయరాం వేణు* తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ యువతకి ఉపాధి హామీ కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని మంచి పరిపాలన ధ్యేయంగా ముందుకు వెళ్తామని రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీ గారికి చేయడమైనది
బుక్కరాయసముద్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణస్వీకారం ఎల్ఈడి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

శ్రీ నారా చంద్రబాబు గారి ప్రమాణస్వీకారం సందర్భంగా బుక్కరాయసముద్రం మండలంలో సచివాలయం దగ్గర ఎల్ఈడి స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంపీపీ సునీత టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పసుపుల హనుమంత్ రెడ్డి. పొడ్రాళ్ళ రవీంద్ర బుల్లె నారాయణస్వామి తదితర ముఖ్య నాయకులు అధికారులు మరియు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు హాజరు కావడం విశేషం..

మంత్రి పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
రాష్ట్ర మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్బంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారిని విజయవాడ లో కలసి శుభకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు,రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ గారు*,రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కూచి హరి గారు మరియు నాయకులు
నార్పల మండల కేంద్రంలో అదుపు తప్పిన ట్రాక్టర్ ముగ్గురికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల క్రీడా మైదానం నందు ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం జరగడం వల్ల ముగ్గురికి తీవ్ర గాయాలు... వెంటనే ప్రమాదం జరిగిన చోటికి పోలీస్ లు చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడం జరిగింది..
నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతపురం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం అర్బన్ నియోజవర్గం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా.. ఈ సందర్భంగా నిహా అయేషా మాట్లాడుతూ:రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు సైకో జగన్ పాలనకు చమర గీతం పాడి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కుంటు పడిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా అనంతపురం నియోజవర్గం అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురాన్ని సుందరవణంగా తీర్చి దిద్దుతారని తెలియజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంతటి ఘన విజయానికి సహకారం అందించిన అర్బన్ నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
కామాఖ్య దేవాలయంలో మొక్కు తీర్చుకున్న హేమంత్ యాదవ్...
కామాఖ్య దేవాలయంలో మొక్కు తీర్చుకున్న హేమంత్ యాదవ్

2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి శ్రీ గారు విజయం అయిన సందర్భంగా అస్సాం రాష్ట్రంలో గల కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోవడం జరిగింది.
పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశంపార్టీ నాయకుడు తిరుపాలు ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
పోలీసుల దాడిలో గాయపడిన తెలుగుదేశంపార్టీ నాయకుడు తిరుపాలు ను పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు.. నిన్న సాయంత్రం పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం నాయకుడు తిరుపాలును అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... పోలీసులు ఇప్పటికైనా మారాలని ఇంకా వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం నాయకులు పై దాడులు చేస్తే సహించేది లేదని వారు తెలియజేశారు గాయపడిన తిరుపాల్ ను ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది
ఖైదీ.. మృతి..
అనంతపురం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలో శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) S/o రంగయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందిన ఖైదీ అక్కడిక్కడే మృతి..
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు..
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు...

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో నివాసంఉంటున్న సుగాలి జ్యోతిబాయ్ కూతురు వాణి భాయ్ వివాహంకు ₹10000 ఆర్థిక సహాయం చేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి *మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు* మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో.... బీసీ సెల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య. ఐ టి డి పి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు అనీఫ్. ఆవుల సుధాకర్. బోయ లింగరాజు గ్రామ నాయన . గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ గారిని కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే

అమరావతి ఉండవల్లి నివాసంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెల్పిన శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు బండారు కిన్నెర శ్రీ* గారు 2024 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి ఉండవల్లిలోని నివాసం నందు కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.