నిజందాగదుక్షణంఆగదు

Jun 08 2024, 20:33

టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు..ఎవరికి ఆ పదవులు అంటే...

టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు. కేంద్రమంత్రులుగా రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్లు ఖరారు. రామ్మోహన్‌నాయుడికి కేబినెట్‌ హోదా. పెమ్మసానికి కేంద్ర సహాయమంత్రి పదవి ఖరారైందంటున్న ఢిల్లీ వర్గాలు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 08 2024, 10:21

రామోజీరావు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కేసీఆర్, జగన్..

హైదరాబాద్‌: రామోజీ రావు మరణం పట్ల సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను స్మరించుకున్న కేసీఆర్‌.. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్‌

రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను-వైఎస్ జగన్‌

నిజందాగదుక్షణంఆగదు

Jun 07 2024, 21:57

ఫిక్సెడ్ డిపాజిట్ (FD) ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై రూ.3 కోట్ల వరకు రిటైల్‌ డిపాజిట్టే

ఫిక్సెడ్ డిపాజిట్ (FD) ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై రూ.3 కోట్ల వరకు రిటైల్‌ డిపాజిట్టే

Fixed Deposit | ముంబయి: బల్క్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Bulk Fixed Deposit) నిర్వచనాన్ని సవరించాలని ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)’ ప్రతిపాదించింది. రూ.3 కోట్లు ఆపై చేసే మొత్తాన్ని ఈ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు త్వరలోనే జారీ చేస్తామని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం రూ.రెండు కోట్లు ఆపైన చేసే మొత్తాన్ని బల్క్‌ డిపాజిట్‌గా (Bulk Fixed Deposit) పరిగణిస్తున్నారు.

ఇకపై రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను (Fixed Deposit) సైతం రిటైల్‌ ఎఫ్‌డీగానే లెక్కలోకి తీసుకుంటారు. సాధారణంగా బ్యాంకులు రిటైల్‌తో పోలిస్తే బల్క్‌ ఎఫ్‌డీలపై తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. తాజా నిర్ణయం ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి శుభవార్తనే చెప్పాలి. గతంతో పోలిస్తే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించనుంది. కొన్ని బ్యాంకులు కాల వ్యవధిని బట్టి బల్క్‌ డిపాజిట్లపై కూడా ఆకర్షణీయమైన వడ్డీరేటును అందిస్తున్నాయి. కొత్త మార్పు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు వర్తించనున్నాయి. మరోవైపు ‘రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల (RRB)’ విషయంలో రిటైల్‌ డిపాజిట్ల పరిమితి రూ.కోటికి పెంచారు. ఆర్‌ఆర్‌బీల్లో రూ.1 కోటి, ఆపై మొత్తాన్ని బల్క్‌ ఎఫ్‌డీ పరిగణిస్తారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 07 2024, 19:24

బోధనాసుపత్రుల్లో రోగులకు ‘ఆభా’ తప్పనిసరి: ఎన్‌ఎంసీ

బోధనాసుపత్రుల్లో రోగులకు ‘ఆభా’ తప్పనిసరి: ఎన్‌ఎంసీ

హైదరాబాద్‌: దేశంలోని అన్ని వైద్య కళాశాలల(బోధనాసుపత్రులు)కు వచ్చే రోగుల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య ఖాతా(ఆభా) గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఆదేశించింది. ఎవరికైనా ఈ గుర్తింపు సంఖ్య లేకుంటే ఆధార్‌తో వెంటనే ఇవ్వొచ్చని స్పష్టంచేసింది. 2025-26 నుంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపు, కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, కళాశాలల రెన్యువల్‌ వంటి అంశాలన్నీ ఆసుపత్రికొచ్చే రోగుల సంఖ్యతో ముడిపడి ఉంటాయంది. అదే సమయంలో ఆభా గుర్తింపు లేదనే కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యాన్ని తిరస్కరించకూడదని తెలిపింది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 16:53

రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు... దేశంలోనే తొలిసారి.. వేదికగా తెలంగాణ..

రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

దేశంలోనే తొలిసారి.. వేదికగా తెలంగాణ

రెండు రోజుల పాటు నిర్వహణ

హాజరుకానున్న 30 దేశాల ప్రతినిధులు

హైదరాబాద్‌: అంతర్జాతీయ సరకుల (కమాడిటీస్‌) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024) జరగనుంది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధన సంస్థ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతిదారుల సమాఖ్య, ఫిక్కి తదితర సంస్థల ప్రతినిధులతో పాటు దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతిదారులు, భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శరైతులు ఇందులో పాల్గొననున్నారు. గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను దీనికి వేదికగా ఎంచుకున్నారు. ప్రపంచంలో బియ్యం వినియోగం ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో వరిపంట ప్రాధాన్యం పెంచడంతో పాటు విస్తీర్ణాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆహారభద్రత, సాగుకు సాంకేతిక సాయం, బియ్యం మార్కెటింగ్‌ను విశ్వవ్యాప్తం చేయడం, ఎగుమతుల పెంపు లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వరిసాగులో ఎరువుల వాడకం తగ్గింపు, వాతావరణ పరిస్థితులను అధిగమించేలా సాగు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను సదస్సులో చర్చించనున్నారు.

*తెలంగాణకు ఎంతో ఉపయోగం

ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తుండగా.. ఇందుకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణం. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. వరి సాగులో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్‌ వైపు చూస్తున్నాయి. ఈ సదస్సు ద్వారా ఎగుమతి, దిగుమతిదారులకు ఒక వేదిక కల్పించే వీలుంటుంది. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే మన దేశం, ముఖ్యంగా తెలంగాణ రైతులకు సరైన ధరతో పాటు పెద్దమొత్తంలో ఉన్న మార్కెట్‌ నిల్వల సమస్యను పరిష్కరించుకోవచ్చు.వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 16:36

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌....

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌. ..

చంద్రబాబుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌. రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును కోరిన రేవంత్‌ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరిన రేవంత్‌.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 11:36

తెలంగాణలో 3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!

3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!

ప్రైవేటు వైద్య కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద వచ్చే చాన్స్‌

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త కాలేజీలు అందుబాటులోకి రానుండటం వల్లే..

విభజన చట్టంలో పేర్కొన్న 15% ఉమ్మడి కోటా గడువు ముగియడమూ కారణమే..

వారం రోజుల్లో వెలువడనున్న నీట్‌ రాష్ట్ర ర్యాంకులు

నీట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశముంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్‌ సీట్లు వచ్చాయన్న విషయమై విద్యార్థులు ఆరా తీస్తున్నారు

లక్షల్లో ర్యాంకు వచ్చినా..

 

గతేడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్‌ కోటా కింద నీట్‌ జాతీయ స్థాయిలో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్‌లోని సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీలో బీసీ సీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంక్‌కు సీటు వచ్చింది. అలాగే 2.62 లక్షల ర్యాంకు పొందిన బీసీ సీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్ధికి సిద్దిపేటలోని సురభి మెడికల్‌ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డిలోని టీఆర్‌ఆర్‌ కాలేజీలో బీసీ సీ కేటగరీకే చెందిన విద్యార్థికి 2.58 లక్షల ర్యాంక్‌ వచ్చినా కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు లభించింది.

ఈ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇక ఓపెన్‌ కేటగిరీ లోకల్‌ కోటాలో వరంగల్‌లోని ఫాదర్‌ కొలంబో మెడికల్‌ కాలేజీలో 1.60 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు లభించింది. ఓపెన్‌ కేటగిరీలోని అన్‌ రిజర్వ్‌డ్‌ కోటాలో సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో 58,727 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు లభించింది.

పెరిగిన సీట్లతో ఈసారి విస్త్రుత అవకాశాలు...

రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెరిగాయి. 2023-24 వైద్య విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 56 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా 29 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద కేటాయిస్తారు.

మరోవైపు ఈ ఏడాది కూడా మెడికల్‌ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2024-25 విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్‌ కాలేజీలు రానున్నాయి. వాటికి సంబంధించి ఇంకా నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈసారి ఆరు కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని.. ఈ లెక్కన కనీసం 300 సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే ఆ మేరకు ఎంబీబీఎస్‌లో విద్యార్థుల చేరికలకు అవకాశాలు పెరగనున్నాయి.

15 శాతం ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో..

తెలంగాణలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు 15 శాతం కోటా కింద పదేళ్లపాటు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని నిబంధన గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ నిబంధన వల్ల 2014 నుంచి 2022 వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 15 శాతం సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి కోటా కింద వర్తింపజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్‌ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను రద్దు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనే ఉమ్మడి కోటాను అమలు చేసింది. ఆయా కాలేజీల్లో 1,950 కన్వీనర్‌ కోటా సీట్లలో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే అందులో 200కుపైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో ఇకపై ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇలా కూడా అదనంగా సీట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి 3 లక్షల ర్యాంక్‌ పొందిన విద్యార్ధికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు లభిస్తుందని కాళోజీ నారాయణరావు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గతేడాది ఉస్మానియా, గాం«దీ, కాకతీయల్లో ఏ ర్యాంక్‌కు సీట్లు వచ్చాయంటే?

ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ఓపెన్‌ కేటగిరీలోని లోకల్‌ కింద 19,239 ర్యాంకుకు, అన్‌ రిజర్వుడ్‌లో 7,943 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారికి 30,522 ర్యాంకు వరకు కూడా సీటు లభించింది. ఎస్సీ విద్యార్థులకు లోకల్‌ కేటగిరీలో 89,253 ర్యాంకు సాధించినా సీటు వచ్చింది. అన్‌రిజర్వ్‌డ్‌లో 48,358 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీ లోకల్‌ కేటగిరీలో 90,658 ర్యాంకర్‌కు, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 73,500 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు వచ్చింది. బీసీ ఏలో లోకల్‌ కేటగిరీ కింద 79,611 ర్యాంకు, అన్‌రిజర్వ్‌డ్‌లో 42,349 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చాయి. బీసీ బీలో లోకల్‌కు 30,944... అన్‌ రిజర్వుడుకు 12,788 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ సీలో లోకల్‌కు 69,344... అన్‌ రిజర్వ్‌డ్‌లో 21,822 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ డీలో లోకల్‌కు 30,465... అన్‌ రిజర్వ్‌డ్‌లో 20,069 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ-ఈలో లోకల్‌కు 34,482... అన్‌ రిజర్వ్‌డ్‌లో 20,497 ర్యాంకర్లకు సీట్లు లభించాయి.

గాంధీ మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌ కోటాలో లోకల్‌ కేటగిరీ కింద 8,164 ర్యాంకుకు, అన్‌ రిజర్వ్‌డ్‌లో 3,225 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారికి 26,245 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కోటాలో లోకల్‌ కేటగిరీ కింద 80,215 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది. అన్‌ రిజర్వ్‌డ్‌లో 39,519 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీలో లోకల్‌కు 78,656... అన్‌ రిజర్వ్‌డ్‌కు 47,860 ర్యాంకుకు సీటు వచ్చింది. బీసీ-ఏ లోకల్‌ కేటగిరీలో 36,691 ర్యాంకుకు సీటురాగా బీసీ-బీలో లోకల్‌ కింద 15,625 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. అలాగే బీసీ-సీలో లోకల్‌కు 55,674 ర్యాంకుకు సీటు లభించింది. బీసీ-డీలో లోకల్‌కు 14,598 ర్యాంకుకు... అన్‌ రిజర్వ్‌డ్‌లో 8,257 ర్యాంకుకు సీట్లు వచ్చాయి. బీసీ-ఈలో లోకల్‌కు 30,495... అన్‌ రిజర్వ్‌డ్‌లో 5,737 ర్యాంకర్లకు సీట్లు లభించాయి.

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌లోని లోకల్‌ కేటగిరీలో 36,905 ర్యాంకుకు, అన్‌ రిజర్వ్‌డ్‌లో 25,305 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారికి 47,684 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీల్లో లోకల్‌ కేటగిరీలో 1.14 లక్షల ర్యాంకుకు సీటు వచ్చింది. అన్‌ రిజర్వ్‌డ్‌లో 98,658 ర్యాంకుకు సీటు వచ్చింది. ఎస్టీ కోటాలో లోకల్‌ కింద 1.07 లక్షల ర్యాంకు వచ్చిన వారికి... అన్‌ రిజర్వ్‌డ్‌లో 95,831 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ-ఏ లోకల్‌ కేటగిరీలో 1.09 లక్షల ర్యాంకుకు... అన్‌ రిజర్వ్‌డ్‌లో 66,831 ర్యాంకులకు సీట్లు వచ్చాయి. బీసీ-బీలో లోకల్‌కు 43,616... అన్‌ రిజర్వ్‌డ్‌కు 37,381 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ-సీలో లోకల్‌కు 94,902 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ-డీలో లోకల్‌కు 42,838, బీసీ-ఈలో లోకల్‌ కోటా కింద 50,030 ర్యాంక్‌ పొందిన వారికి సీట్లు లభించాయి.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 11:22

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతల సమావేశం..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతల సమావేశం..

హాజరైన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 10:41

తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,320 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,919 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 10:30

ఏపీ:రోజా ఓటమితో నగరికి పట్టిన శని వదిలింది...: నగరి మున్సిపల్ చైర్మన్

తిరుపతి: రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం, రోజాపై నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్ శాంతి విమర్శలు.. రోజా ఓటమితో నగరికి పట్టిన పదేళ్ల పీడ విరగడైంది.. నగరి ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాం, రోజా అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీకి శని పట్టింది రోజాకు టికెట్ ఇవ్వకపోయి ఉంటే వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు-శాంతి