నారా చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ గారిని కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే

అమరావతి ఉండవల్లి నివాసంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెల్పిన శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు బండారు కిన్నెర శ్రీ* గారు 2024 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి ఉండవల్లిలోని నివాసం నందు కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి* శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు..
2024 సార్వత్రిక ఎన్నికలు ఫలితాల్లో శింగనమల నియోజకవర్గం NDA కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ MLA గారు,MP గా అంబికా లక్ష్మినారాయణ గారి విజయానికి కృషి చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి* శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాజీఎంపీటీసీ చెదళ్ళ నారాయణ స్వామి, సోము శేఖర్, ప్రకాష్, సురేష్,కుళ్లాయప్ప, వెంకట నాయుడు, శ్రీనివాస్, రాజు, మరియు బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గము : బుక్కరాయసముద్రం పంచాయతీలోని ఎల్.బి. కాలనీ నివాసి శ్రీమతి కౌసర్ గారి ఆడబిడ్డ వివాహానికి ₹5000/- రూపాయలు మరియు జన చైతన్య నగర్ నివాసి శ్రీమతి సలీమా ల ఆడబిడ్డ వివాహానీకు ₹5000/- రూపాయలు ఆర్థిక సాయంను అందించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ముస్లిం మైనార్టీల ఆడబిడ్డల పెండ్లిండ్ల కు సహాయం చేయడము చాలా సంతోషాన్నిస్తుందని తెలిపారు. చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆడబిడ్డల వివాహాల కోసం రూ.1 లక్ష రూపాయల పథకం అందిస్తారని పేర్కొన్నారు. *ఆడ బిడ్డల వివాహాలకు సహాయం చేసిన కాటప్పగారి రామలింగారెడ్డి గారికి మైనార్టీ మహిళలు ధన్యవాదాలు తెలిపారు*. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు జుగును, టిడిపి నాయకులు పూల శంషాద్, దూదేకుల రసూల్ బీ, చాపల మహబూబ్ బీ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శ్రావణి కి అభినందనలు తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాసుల చంద్రమోహన్..
ఎమ్మెల్యే శ్రావణి కి అభినందనలు తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాసుల చంద్రమోహన్ సింగనమల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తిరిగి ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు కావడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శి జిల్లా అఖిల భారత కాపు సమైక్య కార్యదర్శి మాసుల చంద్రమోహన్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు గోగుల నాగభూషణ పెద్ద నాగమణి కార్యకర్తలు నాయకులు అభినందనలు తెలిపినారు తెలుగుదేశం పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రజలు నిరూపించినారు అని తెలియజేసినారు
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి అభినందనలు తెలియజేసిన బుక్కరాయసముద్రం మండల ఎంపీపీ దాసరి సునీత దంపతులు మరియు సింగనమల పట్నం నగేష్
సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గా అధిక గెలుపొందిన శ్రీ బండారు శ్రావణి గారికి బుక్కరాయసముద్రం మండల ఎంపీపీ సునీత గారు చిన్న జలాలపురం పట్నం నగేష్ గారు బుల్లె నారాయణస్వామి గారు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తోటి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి తాత బండారు నారాయణస్వామి సమాధి వద్ద చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించిన బండారు శ్రావణి శ్రీ

సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలొ తమ స్వగ్రామం సిద్దరాంపురంలో పర్యటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి గ్రామంలో గ్రామస్తులతో బంధువులతో ఆత్మీయంగా మాట్లాడారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఆమె ఈ పర్యటన చేశారు. అనంతరం తన తాత బండారు నారాయణస్వామి సమాధి వద్ద నివాళులర్పించారు.

ద్విసభ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా అభినందనలు తెలిపిన నియోజవర్గ ప్రజలు నాయకులు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ అధిక మెజార్టీతో గెలిచిన శుభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మరియు ప్రజలు ద్విసభ్య కమిటీ సభ్యులు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు గారికి మరియు ముంటిమడి కేశవరెడ్డి గారికి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చముల అందజేస్తూ అభినందనలు తెలియజేశారు
40 సంవత్సరలా తరువాత కోడుమూరు నియోజకవర్గం లో టీడీపీ పార్టీ ఘన విజయం.. కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు కాటప్ప గారి రామలింగారెడ్డి
40 సంవత్సరలా తరువాత కోడుమూరు నియోజకవర్గం లో టీడీపీ పార్టీ MLA గా గెలిచినా బొగ్గుల దస్తగిరి గారు.టీడీపీ పార్టీ గెలుపు కోసం అసమ్మతిగా ఉన్న టీడీపీ నేతలను బుజ్జగించి, అందరినీ సమన్వయ పరచడం లో ముఖ్యంభూమిక పోసించిన కోడుమూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. గెలుపు కృషి చేసిన రామలింగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి గారు
కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్..
అనంతపురం 06.05.2024 కౌంటింగ్ కి సర్వం సిద్ధం.. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి ఐ.ఏ.ఎస్ కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్* *అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో మంగళవారం ఉదయం సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి ఐ.ఏ.ఎస్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్..
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఐటీడీపీ మండల అధ్యక్షుడు హేమంత్ యాదవ్ వినతి..
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఐటీడీపీ మండల అధ్యక్షుడు హేమంత్ యాదవ్ వినతి..

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని భావించి పేదవాడికి పట్టడన్నం పెట్టడమే లక్ష్యంగా పాలన సాగించి, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత నేత ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఐ టీడీపీ మండల కన్వీనర్ హేమంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఒక సంచలనం అన్నారు. నిరంతరం పేదలు, బలహీన వర్గాలు, మహిళల గురించి ఆలోచించిన మానవతావాది ఎన్టీఆర్ అన్నారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతం ఎంతో ఘన కీర్తి కలవాడ! అనే పాట ఎప్పుడు, ఎక్కడ వినిపించినా తెలుగువాడికి వెంటనే గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆ పాట రాసింది ఆయన కాకపోయినా తెలుగువారికి అంటే ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాళ్ల కోసం ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి కోటి 20 లక్షల పేద కుటుంబాల ఆకలి తీర్చారు రాష్ట్రంలో పేద ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు, పెద్దలకు జనతా వస్త్రాలు పంపిణీ చేశారు. పేదలకు తొలిసారిగా వృద్ధాప్య పెన్షన్లు నెలకు 30 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. దేశంలోనే తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా కృష్ణ పెన్నా నదులను అనుసంధానం చేశారు, పేద విద్యార్థులకు గురుకుల ఆశ్రమ పాఠశాల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు విజయవాడలో ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు దేశంలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చేందుకు కృషి చేశారు రాష్ట్రంలో 330 తాలూకాలను 1104 మండలాలుగా చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తారాస్థాయికి ఎదిగిన నిత్య కృషివలుడు, పల్లె ప్రజల మదిలో గూడు కట్టుకున్న తారక రాముడు, నటసార్వభౌముడు. నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రపంచానికి తిరుగులేని రారాజు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి యావత్ భారతావానికి ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకుడు. అందరితోనూ అన్నా అని పిలిపించుకున్న ఆయన పేదల పెన్నిధిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అతి స్వల్ప కాలంలో 23 జిల్లాలను ఒక ప్రభంజనంలా చుట్టేసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కే సాధ్యమైంది. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సును త్రికరణశుద్ధిగా కోరుకుని పరిపాలనకు సరికొత్త భాష్యం చెప్పారు. ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పురోగమిస్తోంది 2024 ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుంది సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగు వెలుగును నలుగు దిశల వ్యాపింప చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించాలని హేమంత్ యాదవ్ అభిప్రాయపడ్డారు.