నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 13:52

Breaking : కాళేశ్వరం ప్రాజెక్టు పై తనిఖీలు !

- మేడిగడ్డ , అన్నారం సుందిళ్ల బ్యారేజ్ లపై ప్రత్యేక అధ్యయనం

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ కు 50కు పైగా ఫిర్యాదులు

- నేడు రాష్ట్రానికి జస్టిస్ పీయూష్ ఘోష్

- 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల పరిశీలన

- రేపు కడెం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మంత్రి ఉత్తమ్‌ పర్యటన

- మేడిగడ్డలో నేడు 16, 17 గేట్లు ఎత్తేందుకు కసరత్తు

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈనెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది. పనులు ఎంత వరకూ చేపట్టారన్న విషయాన్ని తెలుసుకోవడానికి పీసీ ఘోష్‌ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

మరోవైపు కడెం ప్రాజెక్టుతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిశీలించనున్నారు.కడెం ప్రాజెక్టులో మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లను కేటాయించగా... ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులను మంత్రి ఉత్తమ్‌ పరిశీలించి, తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలనూ పరిశీలించనున్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో 16, 17వ నంబర్‌ గేట్లను బలవంతంగా ఎత్తే ప్రక్రియ గురువారం చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఎన్‌సీ(జనరల్‌) గుమ్మడి అనిల్‌కుమార్‌తో పాటు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఓరుగంటి మోహన్‌కుమార్‌ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు.

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు 54 ఫిర్యాదులు అందాయి. గత మే 31వ తేదీలోగా కమిషన్‌ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్‌ రూపంలో ఫిర్యాదు చేయాలని కమిషన్‌ తరపున నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన ఇచ్చింది. గడువు పూర్తయిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని లెక్క తీయగా... 54 దాకా వచ్చినట్లు తేలింది. కాగా, బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజనీర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు రెండో వారం లేదా మూడో వారంలో కమిషన్‌ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 13:50

Breaking : నీట్ పరీక్ష పేపర్ లీక్ ?

- 60కి పైగా విద్యార్థులకు 720/720 మార్కులు రావడం వివాదాస్పందంగా మారింది

- 70 మందికి 700కు పైగా రూపాయల మార్కులు

- దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విద్యార్థుల ఆందోళన

- పలు సెంటర్లో ఇదంతా జరిగిందని తెలిసిన పట్టించుకోని వైనం 

- వెంటనే దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్

నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అకా NEET, మన దేశ భవిష్యత్తు వైద్యులను ఎంచుకునే ప్రవేశ పరీక్ష. ఇది అమలు చేయబడినప్పుడు చాలా మంది అర్హులైన అభ్యర్థుల మెరిట్ ఆధారిత ఎంపికకు దారితీస్తుందని భావించారు మరియు ఇది 12వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేసే పాత విధానానికి వ్యతిరేకంగా మార్కెట్ చేయబడింది.

NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) NEET నిర్వహణ బాధ్యతను స్వీకరించినప్పటి నుండి, ఇది చాలా సినిమాల కంటే కామెడీగా మారింది, విషాదకరమైనది.

నిన్న, లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాత, NTA NEET 2024 స్కోర్ కార్డ్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇది పరీక్ష, వ్యవస్థ, విద్యార్థులు మరియు భారతీయ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును ఎంత అపహాస్యం చేసింది! 720 మార్కుల పరీక్షలో 67 మంది విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు. అంటే మీరు పూర్తి మార్కులు సాధించినా, మీరు దేశంలోని అత్యుత్తమ వైద్య కళాశాలలో అంటే AIIMS, న్యూఢిల్లీలో ప్రవేశం పొందలేరు ఎందుకంటే ఓపెన్ కేటగిరీకి కేవలం 50 సీట్లు మాత్రమే ఉన్నాయి.

కామెడీ ఇప్పుడు ప్రారంభమవుతుంది, AIIMS నుండి అంగీకార పత్రాన్ని ఎవరు స్వీకరిస్తారు మరియు ఎవరు మిస్ అవుతారో నిర్ణయించడానికి, NTA టై బ్రేకింగ్ ప్రమాణాలను అనుసరిస్తుంది. కానీ, వారిలో ప్రతి ఒక్కరు పూర్తి మార్కులను పొందినందున, మార్క్ ప్రమాణాలు చిత్రంలో లేవు.

పరీక్ష సమయంలో పేపర్ లీక్‌ల గురించి మీకు తెలిసినప్పుడు ఇది మరింత విషాదకరంగా మారుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేపర్ లీక్ అయినప్పటికీ అది రద్దు కాలేదు. ఇప్పుడు, అదే సెంటర్ నుండి ఏడుగురు అభ్యర్థులు 720 స్కోర్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఎంత యాదృచ్చికం? కొన్నేళ్ల క్రితం 720ని కలలో కూడా అందుకోలేనంతగా ఇప్పుడు ఇండియన్ మూవీ అవార్డ్ అనుకుని అవార్డ్ ఇస్తున్నారు.

ప్రతి సంవత్సరం కటాఫ్‌లు పెరుగుతుండటంతో పరీక్షలో అడిగే ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉందని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బదులుగా అది దిగజారింది.

విద్యార్థులు 719 మరియు 718 మార్కులు పొందినట్లు నివేదికలు ఉన్నాయి, ఇది సాధారణ పరిస్థితులలో అసాధ్యం ఎందుకంటే 720 తర్వాత సాధ్యమయ్యే ఏకైక స్కోరు 716 (ఒకవేళ 179 ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చి ఒకదానిని ప్రయత్నించకపోతే).

తమ ప్రశ్నలను ప్రయత్నించడానికి తక్కువ సమయం దొరికిన విద్యార్థులకు కోర్టు నిర్దేశించిన విధంగా బోనస్ పాయింట్లను ప్రదానం చేసినట్లు NTA ఒక ప్రకటనను విడుదల చేయడానికి విస్తృత నిరసన దారితీసింది.

ఇదంతా పెద్ద స్కామ్ లాగా ఉంది. పేపర్ లీక్‌ల నుంచి ప్రశ్నపత్రం నాణ్యత, ఇప్పుడు ఫలితాలు. ట్రెండ్ కొనసాగితే, విద్యార్థులు అసలు జ్ఞానం కంటే రొట్ లెర్నింగ్‌పై ఎక్కువ దృష్టి సారించే విద్య యొక్క ఈ అపహాస్యం కొనసాగించడం కంటే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలని ఆందోళన చేస్తున్నారు .

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 12:48

పవన్ కళ్యాణ్ - "కాంగ్రెస్ నాకు ప్రధాని పదవిని ఆఫర్ చేసినా, నేను వారితో చేతులు కలపను"

100% స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ పవన్ కళ్యాణ్ JSP

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది.

"మోదీ జీ కోసం మేము అతిపెద్ద ఆఫర్‌ను కూడా తిరస్కరించగలము"

ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు తెలిపారు

నిజంనిప్పులాంటిది

Jun 06 2024, 07:43

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ గా ప్రంజల్ పాటిల్

దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్ గా ప్రంజల్ పాటిల్ ఎంపిక అయ్యారు..కేరళలోని తిరువనంతపురం సబ్కలెక్టర్ గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్గా అక్టోబర్ 14న ఆమె బాధ్యతలు స్వీకరించారు.

మహారాష్ట్రలోని ఉల్హాసనగర్ కు చెందిన ప్రంజల్ ఆరేళ్ల వయసు లోనే చూపును కోల్పోయారు. ముంబైలోని కమలామెహతా దాదర్ అంధుల పాఠశాలలో చదువుకున్నారు.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీపట్టా పొందారు.తర్వాత ఢిల్లీ జేఎన్ఎయు నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పీజీ పూర్తి చేశారు.

2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఎఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ప్రంజల్ అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు.

పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు.

ఐఏఎస్ గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 13:01

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 13:00

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 12:56

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 12:55

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 09:34

నేడు మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవనున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి, పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు

నిజంనిప్పులాంటిది

Jun 05 2024, 07:33

నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు...!

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రం లో బుధవారం ప్రారంభం కానుంది. బ్యాలెట్‌ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలిం గ్‌ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాములో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. బ్యాలెట్‌ అన్నింటిని బండిల్స్‌గా కట్టి అనంతరం లెక్కిస్తారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడుతారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

మొదట తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కింపు చేస్తారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ అసిస్టెంట్లు 37 మంది ఏఆర్‌వోలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేయనున్నారు.