నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 17:20

మరి కొద్ది క్షణాల్లో ఈసి మీడియా సమావేశం !

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్(AP Election 2024), ఒడిశా అసెంబ్లీ ఎన్నికల (Odisha Polls 2024) ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఏడు విడతల పోలింగ్ విజయవంతంగా జిరగిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Raajiv Kumar) చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లు అందరికీ ఆయన ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. 

దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లు అందరికీ ఆయన ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. ఇవి చారిత్రాత్మక ఎన్నికలని, రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో 31 కోట్ల మంది మహిళలు ఉన్నారని ప్రశంసించారు.

ప్రపంచ రికార్డు బ్రేక్ !

దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారని, ఏకంగా 64.2 కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. ఓటు వేసినవారి సంఖ్య జీ7 దేశాల్లో 1.5 రెట్లు అధికమని, ఈయూలోని(యూరోపియన్ యూనియన్) 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ఈసారి రీపోలింగ్ చాలా తక్కువ !

గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి రీపోలింగ్ తక్కువగా జరిగిందని ఆయన వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబద్ధతో పనిచేయడంతో తక్కువ రీపోల్స్‌కు దోహదపడ్డాయని ఆయన అభినందించారు. 2019లో ఏకంగా 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని ప్రస్తావించారు. ప్రస్తుత ఎన్నికల్లో 39 రీపోల్స్‌ జరగగా అందులో 2 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈ రీపోలింగ్ జరిగిందని ఆయన వివరించారు.

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 17:18

వైఎస్ జగన్ కు ఘోర పరాభవం..!

కడప అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప. అలాంటి జిల్లాలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని పలు కీలక అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో దూసుకు పోతుంది.

కమలపురం నుంచి బరిలో దిగిన సీఎం వైయస్ జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో సొంత మేనమామను సైతం సీఎం వైయస్ జగన్ గెలుపించుకో లేకపోయారనే ఓ చర్చ సైతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడిగా నడుస్తుంది.

మరోవైపు కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మాధవీ రెడ్డి విజయం సాధించారు. అలాగే ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి, కమలపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఇక రైల్వే కోడూరులో 13 రౌండ్ల కౌంటింగ్ ముగిసినప్పటికి జనసేన అభ్యర్థి అధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇంకోవైపు బద్వేల్, పులివెందుల, రాజంపేట, రాయచోటిలో మాత్రం వైసీపీ అభ్యర్థులు ప్రస్తుతం అధిక్యంలో ఉన్నారు. అయితే మరికొన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలున్నాయనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఏదీ ఏమైనా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి సొంత ఇలాకా కడప జిల్లాలోనే ఆయనకు ఘోర పరాభవం తప్పలేదనే ఓ ప్రచారం అయితే జిల్లాలో కొనసాగుతుంది

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 17:14

Breaking ; సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా !

మరి కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా చేయనున్న జగన్ మోహన్ రెడ్డి

ఏపీ గవర్నర్ నజీర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్న వైసీపీ అధినేత

ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించడంతో మరి కాసేపట్లోనే గవర్నర్ కార్యాలయానికి జగన్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యాహ్నం 1 గంట సమయానికి మొత్తం 156 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి.

గోరంట్ల బుచ్చయ్య గెలుపుతో కూటమికి మొత్తం 157 సీట్లు దక్కే ఛాన్స్

టీడీపీ 129 స్థానాలు, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజ

వైఎస్సార్‌సీపీ 18 స్థానాల్లో ఆధిక్యం

విజయవాడ ఈస్ట్ 12వ రౌండ్ పూర్తి అయ్యేసరికి గద్దె రామ్మోహన్ 24,210 అధిక మెజారిటీతో ముందంజ

పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడికి బంపర్ మెజారిటీ. 69 వేల ఆధిక్యంతో ఘన విజయం

అధికారికంగా ధృవీకరించాల్సిన ఎన్నికల అధికారులు

రాయలసీమలోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రభంజనం

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 157 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ముందంజ

టీడీపీ -129, జనసేన -20, బీజేపీ -7, వైసీపీ 18 చోట్ల ఆధిక్యం

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 17:12

ప్రభంజనం దిశగా టీడీపీ కూటమి..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బంపర్ మెజారిటీ

పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన పవన్ కల్యాణ్.

మంగళగిరిలో చరిత్ర సృష్టించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

టీడీపీ దశాబ్దాలుగా గెలవని పార్టీ జెండాను యువనేత విజయం

ఇక్కడ 15 సార్లు ఎన్నిక జరిగితే 2 సార్లు మాత్రమే గెలిచిన టీడీపీ

అంతకుముందు 1985లో గెలిచిన తెలుగుదేశం పార్టీ

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్

ఏపీలో తిరుగులేని విజయంపై అభినందలు తెలిపిన ప్రధాని

ఏపీలో 161 స్థానాల్లో గెలుపు దిశగా ఎన్డీయే కూటమి

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విజయం

ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో టీడీపీ సంబరాలు..

టీడీపీ కూటమి అధికారం చేపడుతున్న సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో స్వీట్లు పంచిన చింతమనేని ప్రభాకర్

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 14:48

నల్లగొండ లోక్ సభ 23వ రౌండ్ ముగిసే సరికి. (అధికారికంగా).

నల్లగొండ లోక్ సభ 23వ రౌండ్ ముగిసే సరికి. (అధికారికంగా).

కాంగ్రెస్ అధిక్యం : 551168

కాంగ్రెస్ : 770512

బీజేపీ : 219344

బిఆరెస్ : 216050

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 14:03

నల్లగొండ లోక్ సభ 19వ రౌండ్ ముగిసే సరికి. (అధికారికంగా).

నల్లగొండ లోక్ సభ 19వ రౌండ్ ముగిసే సరికి. (అధికారికంగా).

కాంగ్రెస్ అధిక్యం : 493215

కాంగ్రెస్ : 662629

బీజేపీ : 205607

బిఆరెస్ : 194997

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 13:56

నల్లగొండ లోక్ సభ 18వ రౌండ్ ముగిసే సరికి. (అధికారికంగా).

నల్లగొండ లోక్ సభ 18వ రౌండ్ ముగిసే సరికి. (అధికారికంగా).

కాంగ్రెస్ అధిక్యం : 465191

కాంగ్రెస్ : 662629

బీజేపీ : 197438

బిఆరెస్ : 184744

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 12:59

టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల ముందంజ..

AP 175 కి...

టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల ముందంజ..

జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 20 చోట్ల ముందంజ..

బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 చోట్ల ముందంజ..

మొత్తంగా 161 స్థానాల్లో కూటమి ఆధిక్యం... 

 14 చోట్ల వైసీపీ ఆధిక్యం...

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 11:41

నల్గొండ : నల్గొండ పార్లమెంట్ 13వ రౌండ్ ఫలితాలు

: నల్గొండ పార్లమెంట్ 13వ రౌండ్ ఫలితాలు.

2,23,038 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.

కాంగ్రెస్ - 3,26,535

బీజేపీ... 1,03,497

బీఆర్ఎస్... 90,500

నిజంనిప్పులాంటిది

Jun 04 2024, 10:33

AP కౌంటింగ్ అప్డేట్.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ లో ఆధిక్యం 4300తో 

ఉండిలో రఘురామ ఆధిక్యం 

మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ 

అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం 

విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం 

బొబ్బిలిలో బేబి నాయన ఆధిక్యం 

తాడికొండలో తెనాలి శ్రవణ ఆధిక్యం 

ముమ్మడివరలో టీడీపీ ఆధిక్యం 

టెక్కలి టీడీపీ ఆధిక్యం 

ఆముదాలవలస టీడీపీ ఆధిక్యం 

జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం 

రాజమండ్రి రూరల్ లో 5 వేలు దాటిన బుచ్చయ్య లీడ్ 

తిరువూరులో కొలికపూడి ఆధిక్యం 

మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం 

కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యం 

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం 

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యం 

పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం 

తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యం 

రాజమండ్రిలో 1800 ఓట్లతో పురంధరేశ్వరి లీడ్ 

నగిరిలో మంత్రి రోజా వెనుకంజ 

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి 2300 ఓట్లతో ఆధిక్యం...