నల్గొండ : నల్గొండ పార్లమెంట్ 13వ రౌండ్ ఫలితాలు
: నల్గొండ పార్లమెంట్ 13వ రౌండ్ ఫలితాలు.
2,23,038 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.
కాంగ్రెస్ - 3,26,535
బీజేపీ... 1,03,497
బీఆర్ఎస్... 90,500
AP కౌంటింగ్ అప్డేట్.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ లో ఆధిక్యం 4300తో
ఉండిలో రఘురామ ఆధిక్యం
మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ
అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం
బొబ్బిలిలో బేబి నాయన ఆధిక్యం
తాడికొండలో తెనాలి శ్రవణ ఆధిక్యం
ముమ్మడివరలో టీడీపీ ఆధిక్యం
టెక్కలి టీడీపీ ఆధిక్యం
ఆముదాలవలస టీడీపీ ఆధిక్యం
జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
రాజమండ్రి రూరల్ లో 5 వేలు దాటిన బుచ్చయ్య లీడ్
తిరువూరులో కొలికపూడి ఆధిక్యం
మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యం
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యం
పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యం
రాజమండ్రిలో 1800 ఓట్లతో పురంధరేశ్వరి లీడ్
నగిరిలో మంత్రి రోజా వెనుకంజ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి 2300 ఓట్లతో ఆధిక్యం...
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు
ఖమ్మం లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి ముందంజ
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కావ్య ముందంజ
నల్గొండ లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ ముందంజ
జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ముందంజ
భువనగిరి లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ
పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ముందంజ
మహబూబాబాద్ - కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ముందంజ
మల్కాజిగిరి లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజ
కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజ
మహబూబ్నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముందంజ
నిజామాబాద్ - బీజేపీ అభ్యర్థి ముందంజ
సికింద్రాబాద్ - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందంజ
హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి ముందంజ
చేవెళ్లలో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందంజ
మచిలీపట్నం స్క్రోలింగ్ *మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని
మచిలీపట్నం స్క్రోలింగ్ *మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ*
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 91 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం...
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 91 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం...
ఇప్పటికే ఒక్కస్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు...
కాంగ్రెస్ 33 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యం...
Streetbuzz News
SB News
Realtime News Platform
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ముందుకు దూసుకుపోతుంది..
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ముందుకు దూసుకుపోతుంది..
అమరావతి
తెలుగుదేశం 107
జనసేన. 20
వైసీపీ. 27 స్థానాల్లో ముందంజ..
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ..!
•నేడే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు
- 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఈ సారి 400 సీట్లు సాధించాలన్న మోదీ లక్ష్యానికి దగ్గరగా ఎన్డీయే కూటమి సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దని ఇండియా కూటమి చెబుతోంది.
అంచనాకు మించిన ఫలితాలతో అధికారాన్ని దక్కించుకోబోతున్నట్టు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేక జనాల తీర్పు మరోలా ఉంటుందా?.. అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు కోకిల డిజిటల్ మీడియా అందిస్తోంది.
మరికాసేపట్లో దేశవ్యాప్తంగా మొత్తం 452 లోక్‌సభ స్థానాలకు మొదలు కానున్న కౌంటింగ్.
నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపును మొదలెట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి.
కంట్రోల్ యూనిట్ల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్ సీల్ చెదిరిపోకుండా చూసుకోవాలి.
అనంతరం మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోల్చుకోవాలి.
కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది.
కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించాం.
ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం.
సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి..
బైండోవర్ చేశాం. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాం.
డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాం-ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా
తడిసిన ధాన్యం పై రాష్ట్ర సర్కార్ సైలెంట్ ?
- అకాల వర్షాలకు తడిసిన ధాన్యం
- అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం
- తడిసిన ధాన్యంతో అన్నదాతల అగులు బుగులు
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు.
మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే.. ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం !
ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులవుతున్నా.. కాంట పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలు ఉందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా రైతుల నష్టాన్ని మరింత పెంచాయి. అధికారులంతా పోలింగ్‌లో నిమగ్నంకావడంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
2వేల కోట్ల బకాయిలు ఎప్పుడో ?
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం… రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ. 5700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 3700 కోట్ల వరకు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రైతులకు రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన వారం పది రోజులకు కూడా డబ్బులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Jun 04 2024, 12:59