కొత్త చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి
- నూతన చట్టాల అవగాహన పై సిబ్బందికి విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.
- ఎస్పీ రాహుల్ హెగ్డే సమావేశం
కొత్త చట్టాల అవగాహన కార్యక్రమానికి హాజరైన అదనపు ప్రజా న్యాయవాది ఉపేందర్ నూతన చట్టాల గురించి వివిధ సెక్షన్ల ల గురించి అవగాహన కల్పించారు. మారిన సెక్షన్స్ మరియు చాప్టర్లను ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరిస్తూ.. గత సెక్షన్లతో పోల్చినప్పుడే తొందరగా అవగతం అవుతాయని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ 2024 సం. జూలై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జూలై 1వ తేది నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడతలవారీగా శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు.
కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023. వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని, కొత్త చట్టాలపై అవగాహణ రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాద్యం అవుతుందని అన్నారు.
కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరం అని, అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పుల గురించి వివరించారు.
అనంతరం అదనపు ఎస్పీ. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన చేయడం జరుగుతుందని నూతన చట్టాల నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి, సి ఐ లు శ్రీను, రాము, సురేందర్ రెడ్డి, చరమంద రాజు, రజిత రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రఘువీర్ రెడ్డి, స్టేషన్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
Jun 04 2024, 11:41