ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఐటీడీపీ మండల అధ్యక్షుడు హేమంత్ యాదవ్ వినతి..
ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఐటీడీపీ మండల అధ్యక్షుడు హేమంత్ యాదవ్ వినతి..

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని భావించి పేదవాడికి పట్టడన్నం పెట్టడమే లక్ష్యంగా పాలన సాగించి, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత నేత ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఐ టీడీపీ మండల కన్వీనర్ హేమంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఒక సంచలనం అన్నారు. నిరంతరం పేదలు, బలహీన వర్గాలు, మహిళల గురించి ఆలోచించిన మానవతావాది ఎన్టీఆర్ అన్నారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతం ఎంతో ఘన కీర్తి కలవాడ! అనే పాట ఎప్పుడు, ఎక్కడ వినిపించినా తెలుగువాడికి వెంటనే గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆ పాట రాసింది ఆయన కాకపోయినా తెలుగువారికి అంటే ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాళ్ల కోసం ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి కోటి 20 లక్షల పేద కుటుంబాల ఆకలి తీర్చారు రాష్ట్రంలో పేద ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు, పెద్దలకు జనతా వస్త్రాలు పంపిణీ చేశారు. పేదలకు తొలిసారిగా వృద్ధాప్య పెన్షన్లు నెలకు 30 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. దేశంలోనే తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా కృష్ణ పెన్నా నదులను అనుసంధానం చేశారు, పేద విద్యార్థులకు గురుకుల ఆశ్రమ పాఠశాల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు విజయవాడలో ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు దేశంలో తొలి మహిళ విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చేందుకు కృషి చేశారు రాష్ట్రంలో 330 తాలూకాలను 1104 మండలాలుగా చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తారాస్థాయికి ఎదిగిన నిత్య కృషివలుడు, పల్లె ప్రజల మదిలో గూడు కట్టుకున్న తారక రాముడు, నటసార్వభౌముడు. నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రపంచానికి తిరుగులేని రారాజు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి యావత్ భారతావానికి ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకుడు. అందరితోనూ అన్నా అని పిలిపించుకున్న ఆయన పేదల పెన్నిధిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అతి స్వల్ప కాలంలో 23 జిల్లాలను ఒక ప్రభంజనంలా చుట్టేసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కే సాధ్యమైంది. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సును త్రికరణశుద్ధిగా కోరుకుని పరిపాలనకు సరికొత్త భాష్యం చెప్పారు. ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వాత ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పురోగమిస్తోంది 2024 ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుంది సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలుగు వెలుగును నలుగు దిశల వ్యాపింప చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించాలని హేమంత్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: ఆలూరు సాంబ శివారెడ్డి..
కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: ఆలూరు సాంబ శివారెడ్డి.. శింగనమల మండలం ఉల్లికంటిపల్లి గ్రామంలో అప్పుల బాధ తాళలేక వైస్సార్సీపీ కార్యకర్త బి. బాలకృష్ణ(41) అనే వ్యక్తి విష గుళికలు మింగటంతో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి.. విషయం తెలుసుకున్న ఆలూరు సాంబ శివారెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతిదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు ఫ్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన కాటప్పగారి రామలింగారెడ్డి, పరపతినేని శ్రీధర్ బాబు..
తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి101వ జయంతి సందర్భంగా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారు, మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కార్య‌క‌ర్త‌ల కోసం10 కోట్లు.. కార్య‌క‌ర్త‌ల సంక్షేమం.. నారాయ‌ణ ల‌క్ష్యం..
కార్య‌క‌ర్త‌ల కోసం...10 కోట్లు..... కార్య‌క‌ర్త‌ల సంక్షేమం.. నారాయ‌ణ ల‌క్ష్యం. కార్య‌క‌ర్త‌ల క‌ష్టం... త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది.. టీడీపీ బ‌లం కార్య‌క‌ర్త‌లే... ప్ర‌తీ కార్య‌క‌ర్త వారి కుటుంబం బాగుండాలి ఏటా త‌న కుటుంబ సంపాద‌న‌లో కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి రూ. 10 కోట్లు డిపాజిట్‌.
అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ, చైతన్య స్కూల్స్ పైన చర్యలు తీసుకోని సీజ్ చేయాలి..
అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ, చైతన్య స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి.. ఒక రూమ్ను అద్దెకు తీసుకొని పుస్తకాలను డంపు చేసుకొని అమ్ముతున్న నారాయణ, చైతన్య విద్యాసంస్థలు నారాయణ, చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుక్స్ ను డంప్ చేసిన రూమ్ వద్ద ఆందోళన* *అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అద్దె రూమ్ లో డంపు చేసిన రూమ్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య కుల్లాయిస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను నారాయణ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతూ అనంతపురం నగరంలో సైపుల్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వెనుక భాగాన ఒక ఒక రూమ్ను అద్దెకు తీసుకొని దాంట్లో నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన పుస్తకాలను నిలువ ఉంచి కొంతమంది పేరెంట్స్ తో విద్యాసంస్థలలో డబ్బులు కట్టించుకొని పదిమంది అయిన తరువాత ఈ రూమ్ దగ్గరకు వచ్చి పుస్తకాలు తీసుకొని పై తల్లితండ్రులకు అందజేస్తున్నారు.. విద్యను దోపిడీ లాగా దొంగతనం లాగా తయారు చేస్తున్న నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఒలంపియాడు ఈటెక్నో సీబీఎస్సీ అంటూ ఒక పేర్లు ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుకు 6000 నుంచి 15 వేల రూపాయల వరకు పుస్తకాలను విక్రయిస్తున్నారు.. ఎన్నికల సమయంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ ఆ పనిలో నిమగ్నమావడంతో నారాయణ విద్యాసంస్థలు ఆడిందే ఆట పాడిందే పాట అన్న పద్ధతుల్లో ఎన్నికలు నారాయణ విద్యాసంస్థలకు ఒక వరంలాగా తయారైన అన్నారు. నారాయణ విద్యాసంస్థల పైన జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని పేర్కొన్నారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్ ఉమా మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నగర నాయకులు హర్ష రారాజు పవన్ తదితరులు పాల్గొన్నారు*
నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందజేస్తాం.. వ్యవసాయశాఖ ఏ డి శ్రీ రవి..
నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందజేస్తాం......వ్యవసాయశాఖ ఏ డి శ్రీ రవి. మండలములోని వేరుశనగ సాగు చేసే ప్రతి రైతుకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలను సరఫరా చేస్తామని వ్యవ సాయశాఖ అనంతపురం ఏ డి ఏ శ్రీ రవి తెలియజేసారు. మండలములో పంపిణీ ని పరిశీలించడానికి వచ్చిన ఆయన రైతులతో నాణ్యత గురించి మాట్లాడగ రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు. మండలములో ఇప్పటివరకు 2235 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 1875 మంది రైతులు డబ్బులు చెల్లించారని 1385 మంది రైతులు 1224.2 క్వింటాళ్ళు వేరుశనగ తీసుకెళ్లారని తెలియజేసారు. అనంతరం రైతులకు విత్తనమును పంపిణీ చేసారు.
మూలగుట్ట అక్కమ్మ గారి స్వామి పరుష కార్యక్రమంకు ₹5000/- రూ.లు విరాళం ఇచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
మూలగుట్ట అక్కమ్మ గారి స్వామి పరుష కార్యక్రమంకు ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలకేంద్రంలోనీ మూలగుట్ట అక్కమ్మ గారి స్వామి పరుష కార్యక్రమంకు ఆలయ కమిటీ సభ్యులకు ₹5000/- రూపాయలు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు*. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర, జిల్లా తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య,నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి కాటమయ్య, పూజారి రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద యువతి పెళ్లికి ఆర్థిక సాయం అందించిన.. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
నిరుపేద యువతి పెళ్లికి రూ.5000 రూ.లు అందించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి* శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం గ్రామపంచాయతీ లోని ఎల్బీ కాలనీవాసులు దూదేకుల షేక్షావలి కూతురు పెళ్లి కి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.5000 లు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు . బుక్కరాయసముద్రం మండలంలో అనేక పేద కుటుంబాలు ఆనందంగా పెళ్లి కార్యక్రమాలు చేసేందుకు ఆర్థిక సాయం అందించి, భరోసా ఇస్తున్న టిడిపి నాయకులు రామలింగారెడ్డి గారికి జిల్లా టిడిపి మైనార్టీ నాయకులు పి. తూముచెర్ల బాబా ఫక్రుద్దీన్ వలి, మండల టీడీపీ నాయకులు టోపీ భాష లు ధన్యవాదాలు తెలిపారు.
ప్రమాదంలో కాలు విరిగి బెంగళూరులో చికిత్స పొందుతున్న టిడిపి ఎన్నికల ఏజెంట్ మనోజ్ ను పరామర్శించిన ఆలం నరసా నాయుడు..
మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో తెలుగుదేశం పార్టీ తరుపున ఏజెంట్ గా విధులు నిర్వహించిన మనోజ్ (జగన్) కి ప్రమాదవ శాత్తు బైక్ యాక్సిడెంట్ లో కాలు త్రీవంగా గాయపడి విరగడం జరిగింది.మెరుగైన చికిత్స కోసం బెంగళూరు హాస్పిటల్ కి తరిలించడo జరిగింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు బెంగళూరు లో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి వ్యక్తి గతంగా నా వంతు సహాయంగా ఆర్థిక పరంగా అన్ని విధాలగా ఆదుకుంటామని మరియు తెలుగుదేశం పార్టీ తరుపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో మనోజ్ సోదరుడు కర్ణాకర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపి సానుభూతి పరులపై కొడవళ్ళు,కట్టెల తో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు..
అనంతపురం శింగనమల మండలంలోని శ్రీపూరం గ్రామంలో టీడీపి సానుభూతి పరులపై కొడవళ్ళు,కట్టెల తో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు బోయ కొండన్న,బోయ పెద్దన్న,మహిళల పై విచక్షణ రహితంగా దాడి తీవ్ర గాయాలు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు గతంలో చిన్నపాటి గొడవలు మనసులో పెట్టుకొని కట్టెలు, కొడవళ్ళు తో దాడులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు