కాంబోడియాలో చిక్కుకున్న యువతను రాష్ట్రానికి తీసుకురావాలి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు..

రాష్ట్రానికి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేశాయని ధ్వజమెత్తారు.

ఈ వ్యవహారం ఎన్‌ఐఏ విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు..

Chhattisgarh Encounter:ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ భారీగా ప్రాణ నష్టం..

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter) జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి..

ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ), నక్సలైట్ల (Naxalites) మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు సమావేశం అవుతున్నారని వివరాలు అందడంతో.. అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఈ కాల్పులు చోటు చేసుకుంది. ఇందులో భారీగా ప్రాణనష్టం జరిగిందని సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌ని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు.

కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఉద్దేశంతో.. డీఆర్‌జీతో కలిసి పారామిలటరీ బలగాలు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో తరచుగా ఎన్‌కౌంటర్స్ సంభవిస్తున్నాయి. గత శనివారమే (మే 26) రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగ్గా.. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా బెల్‌పొచ్చా, జిన్‌టాంగ్, ఉసకవాయ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఉదయం 6 గంటల సమయంలో వారిని గమనించిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దాదాపు రెండు గంటలపాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది..

అంతకుముందు మే 26వ తేదీన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఆ ఎదురుకాల్పులు జరగ్గా.. మొత్తం ఏడుగురు నక్సలైట్ల మృతిచెందారు. మరో 12 మంది నక్సలైట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అధికారులు భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టులు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. కొన్ని రహదారుల్లో భారీ వృక్షాలను నరికి అడ్డంగా పడేశారు. నాలుగు విద్యుత్తు స్తంభాలను సైతం ధ్వంసం చేయడం జరిగింది..

Phone Tapping Case: సంచలనం ఫోన్ ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి.

ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు..

బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు.

బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు..

TS: త్వరలో తెలంగాణ సిఎస్ మార్పు!!

త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది.

పీఎఫ్ఎస్ గా కొనసాగడానికి రామకృష్ణారావు విముఖత చూపించినట్టు సమాచారం. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో సమర్ధుడైన అధికారి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. అటు పోలీస్ శాఖలో సైతం సీనియర్ ఐపీఎస్ లపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. 

ప్రభుత్వంలోకి మళ్ళీ వికాస్ రాజ్ వచ్చే చాన్సుంది. సచివాలయంలో కీలక బాధ్యతలు ఇస్తారని సమాచారం. దీనిపై కసరత్తు కొనసాగిస్తోంది రేవంత్ సర్కార్.

త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది.

MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం విచారణ చేపట్టనున్నారు.

ఈకేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు..

కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు నిన్న వాదనలు వినిపించారు. ఈడి, సీబీఐ ఇవాళ వాదనలు వినిపించనున్నారు.

న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తానన్నారు. నిన్న కవిత భర్త అనిల్ విచారణకు హాజరయ్యారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.

మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారన్నారు. బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని జడ్జి ప్రశ్నించారు..

Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్..

అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. 

ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు.

గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.

మే 28న ఎన్టీఆర్ 101 జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం నాయకులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు..

ఫస్ట్ వీక్ లో నామినేటెడ్ పండుగ..

- కార్పొరేషన్ చైర్మన్ల నియామకం 

లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన సర్కారు.. కోడ్ ముగియగానే మరో 17 మంది పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది.

ఫస్ట్, సెకండ్ లిస్టు కలిపి 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లో సీఎం లక్కీ నంబరు '9' వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వీరంతా ఒకేసారి పదవీ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో అందరికీ జీవోలు అందనున్నాయి. ఈ మేరకు రెండో లిస్టులో చేర్చబోయే పేర్లపై పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. క్యాస్ట్ ఈక్వెషన్స్, పార్టీలో శ్రమించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఫస్ట్ లిస్టులోనూ గాంధీభవన్ కేంద్రంగా పని చేసిన వివిధ పార్టీ విభాగాల చైర్మన్లే, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకూ నియమించారు. కొందరు జిల్లా స్థాయిలో పని చేసిన కీలక నేతలకు కూడా ఫస్ట్ జాబితాలో అవకాశం లభించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తూ, క్యాస్ట్ ఈక్వెషన్స్ కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు ఓ నేత తెలిపారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎక్కువ మందికి రెండో జాబితాలో చోటు లభించే ఛాన్స్ ఉన్నదని ఆయన వివరించారు. ఇక ఫస్ట్ లిస్టులో లేని పార్టీ అనుబంధ సంఘాలకు, సెకండ్ లిస్టులో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. పైగా కార్పొరేషన్లలో అత్యధికంగా యువ నాయకులకే ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 టికెట్ రానోళ్లకే! 

నామినేటెడ్ పదవుల్లో ఈ సారి జిల్లా అధ్యక్షులకూ అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్ లో జరుగుతున్నది. కొంత మంది కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారని, వాళ్లకు రెండో జాబితాలో అవకాశం ఉండొచ్చనే చర్చ ఉన్నది. దీంతో పాటు అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరికి రెండో జాబితాలో చోటు దక్కనున్నది. అయితే అసెంబ్లీ టిక్కెట్లు పొంది ఓడిపోయినోళ్లను చైర్మన్లుగా ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓడిపోయిన నేతలు కూడా తమకు ఈ దఫా అవకాశమివ్వాలని సీఎం ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. కానీ పార్టీ విధి, విధానాలను బ్రేక్ చేసే పరిస్థితి లేదని సీఎం తేల్చిచెప్పినట్లు సమాచారం.

 స్థానిక సంస్థల కోసం కూడా! 

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్, మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు గెలవాలనిగా లక్ష్యం పెట్టుకున్నది. దీంతో అన్ని జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నది. గత రెండు రోజుల నుంచి మంత్రులు, డీసీసీలు ఆయా జిల్లాల్లో కీలక నేతల వివరాలను గాంధీభవన్ కు పంపిస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి వర్క్ చేసినోళ్లకు, వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రేసులో ఉన్న నేతల వివరాలను కూడా టీపీసీసీ స్టేట్ కమిటీకి పంపించారు. 17 స్థానాల కోసం దాదాపు వందకు పైనే పేర్లు వచ్చినట్లు తెలిసింది. సీఎం, కేబినెట్ మంత్రులు సమన్వయంతో ఈ నెలాఖరు వరకు పేర్లను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత కోడ్ ముగియగానే ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు.

Breaking ; పోలింగ్ బూత్‌ వద్ద డబ్బుల పంపిణీ.. !

తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ప్రధాన నగరాల్లో ఒకటికి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు పోటీచేస్తుండంతో ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ డబ్బులు పంచుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు హన్మకొండలోని ఓ పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి పోలింగ్ బూత్ సమీపంలోని బీఆర్‌ఎస్ కార్యకర్తలను పంపించివేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంచారనే వార్తలు వచ్చాయి. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపే లక్షంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీకి తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ బూత్ వద్ద ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు .

లింగ నిర్ధారణకు చేయిస్తే కఠిన చర్యలు

వరంగల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డా వెంకటరమణ డిఎంహెచ్వో అధ్యక్షతన పిసిపిఎన్డిటి జిల్లా అడ్వైజరీ కమిటీ మీటింగ్

నిర్వహించారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

డా వెంకటరమణ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కేంద్రాలను తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని స్కానింగ్ మిషన్ సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ లో పొందుపరచుకోవాలని తెలిపినారు.

గర్భిణీ స్త్రీలకు చేసే గర్భస్థ పరీక్షలు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నదా ఏమైనా అంగవైకల్యంగా ఉన్నదా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు.

కానీ కొందరు లింగ నిర్ధారణ చేస్తున్నారని దాని ద్వారా సమాజానికి విఘాతం కలుగుతుందని తెలిపినారు.ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఈ గర్భస్థ లింగ నిర్ధారణ చేసి ఆడ, మగ అని తెలిపిన అనవసరమైన అబార్షన్లు చేసిన వారిపైన చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Remal Cyclone : 120కి.మీ వేగంతో గాలులు, వాన..బెంగాల్ లో మొదలైన రెమాల్ బీభత్సం

Remal Cyclone : బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో తుపాను ‘రెమల్‌’ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలో దీని గరిష్ట వేగం గంటకు 135 కి.మీ. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని

బీర్భూమ్, నదియా, బంకురా, తూర్పు బుర్ద్వాన్, తూర్పు మేదినీపూర్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, బిధాన్‌నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఎక్కడో బలమైన గాలి వీస్తోంది.

రెమాల్ తుపాను ప్రభావంతో దక్షిణ బెంగాల్‌లో గాలి వేగం 100-120 కి.మీ దాటుతుందని అలీపూర్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అధికారులతో ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన పని చేయాలని కేంద్ర ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు..

మరో 6 గంటల పాటు కోస్తా తీరంలో ఉద్వేగం కొనసాగనుంది. తీరంలో గంటకు 100-120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దక్షిణ 24 పరగణాలు, తూర్పు మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బీర్భూమ్, మాల్దా, ముర్షిదాబాద్‌లలో కూడా మేఘావృతమై ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ మేఘాలు నెమ్మదిగా కదులుతాయి మరియు రాత్రంతా విధ్వంసం కొనసాగుతుంది. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. రెమాల్ తుపాను దృష్ట్యా ఏర్పాట్లను సమీక్షించామని చెప్పారు..