నిజంనిప్పులాంటిది

May 27 2024, 13:32

Breaking ; పోలింగ్ బూత్‌ వద్ద డబ్బుల పంపిణీ.. !

తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ప్రధాన నగరాల్లో ఒకటికి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు పోటీచేస్తుండంతో ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ డబ్బులు పంచుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు హన్మకొండలోని ఓ పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి పోలింగ్ బూత్ సమీపంలోని బీఆర్‌ఎస్ కార్యకర్తలను పంపించివేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంచారనే వార్తలు వచ్చాయి. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపే లక్షంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బులు పంపిణీకి తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ బూత్ వద్ద ఓటరు స్లిప్పుల పంపిణీ పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపిస్తున్నారు .

నిజంనిప్పులాంటిది

May 27 2024, 12:31

లింగ నిర్ధారణకు చేయిస్తే కఠిన చర్యలు

వరంగల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డా వెంకటరమణ డిఎంహెచ్వో అధ్యక్షతన పిసిపిఎన్డిటి జిల్లా అడ్వైజరీ కమిటీ మీటింగ్

నిర్వహించారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

డా వెంకటరమణ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కేంద్రాలను తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని స్కానింగ్ మిషన్ సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ లో పొందుపరచుకోవాలని తెలిపినారు.

గర్భిణీ స్త్రీలకు చేసే గర్భస్థ పరీక్షలు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నదా ఏమైనా అంగవైకల్యంగా ఉన్నదా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు.

కానీ కొందరు లింగ నిర్ధారణ చేస్తున్నారని దాని ద్వారా సమాజానికి విఘాతం కలుగుతుందని తెలిపినారు.ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఈ గర్భస్థ లింగ నిర్ధారణ చేసి ఆడ, మగ అని తెలిపిన అనవసరమైన అబార్షన్లు చేసిన వారిపైన చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

నిజంనిప్పులాంటిది

May 27 2024, 08:26

Remal Cyclone : 120కి.మీ వేగంతో గాలులు, వాన..బెంగాల్ లో మొదలైన రెమాల్ బీభత్సం

Remal Cyclone : బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో తుపాను ‘రెమల్‌’ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తర బంగాళాఖాతంలో సముద్రంలో దీని గరిష్ట వేగం గంటకు 135 కి.మీ. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని

బీర్భూమ్, నదియా, బంకురా, తూర్పు బుర్ద్వాన్, తూర్పు మేదినీపూర్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, బిధాన్‌నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఎక్కడో బలమైన గాలి వీస్తోంది.

రెమాల్ తుపాను ప్రభావంతో దక్షిణ బెంగాల్‌లో గాలి వేగం 100-120 కి.మీ దాటుతుందని అలీపూర్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అధికారులతో ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన పని చేయాలని కేంద్ర ఏజెన్సీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు..

మరో 6 గంటల పాటు కోస్తా తీరంలో ఉద్వేగం కొనసాగనుంది. తీరంలో గంటకు 100-120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దక్షిణ 24 పరగణాలు, తూర్పు మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బీర్భూమ్, మాల్దా, ముర్షిదాబాద్‌లలో కూడా మేఘావృతమై ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ మేఘాలు నెమ్మదిగా కదులుతాయి మరియు రాత్రంతా విధ్వంసం కొనసాగుతుంది. రెమాల్ సన్నాహాలకు సంబంధించి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. రెమాల్ తుపాను దృష్ట్యా ఏర్పాట్లను సమీక్షించామని చెప్పారు..

నిజంనిప్పులాంటిది

May 27 2024, 08:24

వైకాపా కార్యకర్తల అరాచకం జనసేన నేత కారుకు నిప్పు

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్‌ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్‌ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.

''ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత నా కారును వైకాపా గూండాలు తగులబెట్టారు. జనసేన తరఫున ప్రచారం చేస్తే నాపై వారికెందుకు అంత పగ? జగన్‌ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? పవన్‌కల్యాణ్‌ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు.

గతంలోనూ అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేశారు. మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని కేసు పెట్టాం. ఒక్క రోజులో వారంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారు..

కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. వైకాపా వాళ్లను తిట్టలేదు.. వాళ్లతో గొడవకి వెళ్లలేదు. పవన్‌కల్యాణ్‌పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేస్తారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నాను'' అని కర్రి మహేశ్‌ అన్నారు..

నిజంనిప్పులాంటిది

May 26 2024, 19:31

విష్ణుపురం దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.

విష్ణుపురం దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు. 

ఆ రూట్‌లో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం. 

మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపివేత. 

పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపివేత.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

May 26 2024, 19:29

వ్యవస్థలో మార్పు తీసుకరావడానికి ప్రధాన పాత్రదారులు పట్టభద్రులు

•పాలకూరి రవి,నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి

  వ్యవస్థలో మార్పు తీసుకరావడానికి పట్టభద్రులు ప్రధాన పాత్రదారులు కావాలని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీయొక్క సమస్యలపై అవగాహన కలిగి యుండి నిరంతరం పోరాడే అభ్యర్థికి మీ మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటు వేసి ప్రజలందరికీ మీరు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను అని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ తెలిపారు.

సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యులైన కొంత మంది ఓటర్లు,అలాగే ఓటు విలువ తెలియని వాళ్ళు ఆయా ఎన్నికల సమయంలో డబ్బులకు లేదా ఇతర ప్రలోభాలకు లొంగి తమ ఓటును అసమర్థులకు వేస్తున్న విషయం మన అందరం గమనిస్తూనే ఉన్నాము.

అలాంటి వాళ్ళలో చైతన్యం రావాలి అంటే చదువుకొని విజ్ఞానవంతులైన మీరు మీ యొక్క ఓటును నిష్పక్షపాతంగా వేసి మీ విజ్ఞతను నిరూపించుకోవాలని కోరారు.

కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు అధికార,ధన బలంతో గెలుపు తమదే అని విర్రవీగుతున్న వారికి మీ ఓటుతో దిమ్మ తిరిగేలా సమాధానం ఇవ్వాలని మీ అందరినీ మరొక్కసారి కోరుతున్నాను అని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి అన్నారు.

నిజంనిప్పులాంటిది

May 26 2024, 11:14

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం..

జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది..

తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది.. 

నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రమానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు..

ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు..

నిజంనిప్పులాంటిది

May 26 2024, 07:43

పట్టభద్రుల ఓటు ఎవరికో ?

మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉప ఎన్నిక. 

దీంతో సోమవారం పోలింగ్‌ జరగనున్న వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున ఏనుగుల రాకే్‌షరెడ్డి బరిలోకి దిగారు. 

2007 నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలవగా, ఐదోసారి కూడా మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే గులాబీ కోటకు ఎలాగైనా చెక్‌ పెట్టి తమ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, ఫోన్‌కాల్‌ పలకరింపులు, వాకర్స్‌తో మాటామంతీ లాంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించారు.

నిజంనిప్పులాంటిది

May 26 2024, 07:39

Breaking : కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత !

- స్పందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

- పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

కరీంనగర్‌లో పరిస్థితి అదుపుతప్పింది. నిన్న (26-5-2024) హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయం నుంచి, గాంధీ రోడ్డు లోని హనుమాన్ ఆలయం వరకు.. ఈ శోభయాత్ర జరపాలని ప్రారంభించారు.

హనుమాన్ మాల వేసిన వారు ర్యాలీ చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళన చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కరీంనగర్ వైపు చూసే పరిస్థితి. అక్కడ జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. హనుమాన్ శోభాయాత్రలో తోపులాటతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు.

నిజంనిప్పులాంటిది

May 25 2024, 12:00

Blast in Factory:ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

Blast in Factory : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది..

ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు..

ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..