ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల టిక్కెట్లు..
ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆగస్టు నెల టిక్కెట్లు..
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ..
మధ్యాహ్నం 3గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయ్యనున్న టీటీడీ..
Streetbuzz News
గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం : సీఎం రేవంత్ రెడ్డి
ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''నేను పని చేసేటప్పుడు ధ్యానంగా ఉంటా. సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించాల్సిన బాధ్యత అందరిది. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలి..
సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తాం'' అని తెలిపారు..
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో మేం విడుదల చేయలేదు..
ఎన్నికల కమిషన్ నుంచి వీడియో బయటకు వెళ్లలేదు..
వీడియో ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటున్నాం..
దర్యాప్తులో వీడియో ఎక్కడ నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుంది..
ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనలో విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చాం..
ఇప్పుడు మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. -ఏపీ సీఈవో ఎంకే మీనా.
సింహాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు పలికారు.
సుప్రభాత సేవలు నిర్వహించి, సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీ గంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం, వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.
Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా..
40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు.
బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు..
తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు..
తమిళనాడులో రెడ్ అలర్ట్..
కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు..
నీలగిరి పర్వత శ్రేణుల్లో ఎడతెరిపిలేని వానలు..
ఊటీలో కుండపోత వర్షం, పొంగిపొర్లుతున్న జలపాతాలు.
కేసిఆర్ పార్టీలోకి చేరనున్న విజయశాంతి ?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరా హోరీ పోరు నడిచింది. మూడు పార్టీలు మెజార్టీ సీట్ల గెలుపు పైన ధీమా గా ఉన్నాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేసారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానంగా పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీ సమాధానం అన్నారు.
దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు. కిషన్‌రెడ్డి మాటలతో అది స్పష్టం అవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారి తీసింది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరినప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్నారు విజయశాంతి. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా.. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కాంగ్రెస్‌లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారని చర్చ ఉంది. ఈ సమయంలో విజయశాంతి చేసిన తాజా ట్వీట్‌తో రాములమ్మ అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది.
మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కేటీఆర్
జిల్లాలోఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార నిమిత్తం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తున్న మార్గం వరంగల్ లేబర్ కాలనీ వద్ద
ఒక వ్యక్తి యాక్సిడెంట్ కు గురై కిందపడి ఉన్న విషయం గమనించిన కేటీఆర్ వెంటనే కారు దిగి తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స నిమిత్తం
వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా యాక్సిడెంట్ కు గురై కిందపడి ఉన్న వ్యక్తి స్థానికంగా ఉండే అంజయ్య (55) గా గుర్తించారు.
Streetbuzz News
లైసెన్స్ కోసం RTO లను సందర్శించాల్సిన అవసరం లేదు..!
జూన్ 1, 2024 నుండి, ప్రజలు తమ డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (RTOలు) బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలల్లో తీసుకోవచ్చు.
ఈ ప్రైవేట్ పాఠశాలలు డ్రైవింగ్ లైసెన్స్‌కు అవసరమైన పరీక్షలు మరియు సర్టిఫికేట్‌లను అందించడానికి అనుమతించబడతాయి.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది.
సుమారు 900,000 పాత ప్రభుత్వ వాహనాలను తొలగించడం మరియు కఠినమైన కార్ ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం కొత్త నిబంధనల లక్ష్యం.
అతివేగానికి సంబంధించి జరిమానా ఇప్పటికీ ₹ 1000 మరియు ₹ 2000 మధ్య ఉంది.కానీ మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడితే, వారు ₹ 25,000 పెద్ద జరిమానాను ఎదుర్కొంటారు.అలాగే, వాహన యజమాని రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది మరియు మైనర్ వారికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందలేరు.
అవసరమైన పత్రాలను తగ్గించడం ద్వారా కొత్త లైసెన్స్ పొందడాన్ని మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. అవసరమైన డాక్యుమెంట్‌లు మీరు టూ-వీలర్ లేదా ఫోర్-వీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది,అంటే RTOల వద్ద తక్కువ ఫిజికల్ చెకప్‌లు అవసరం.
భారతదేశ రహదారులను మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేయడానికి,9,000 పాత ప్రభుత్వ వాహనాలను తొలగించి, ఇతర వాహనాలకు ఉద్గార ప్రమాణాలను మెరుగుపరచాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు నియమాలు ఏమిటి?
నిబంధనల ప్రకారం డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కనీసం 1 ఎకరం భూమి ఉండాలి.నాలుగు చక్రాల వాహనాలకు శిక్షణ ఇస్తే వారికి రెండెకరాల భూమి కావాలి.డ్రైవింగ్ పాఠశాలలు సరైన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి.
శిక్షకులు తప్పనిసరిగా హైస్కూల్ డిప్లొమా లేదా తత్సమానం కలిగి ఉండాలి,కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం మరియు బయోమెట్రిక్స్ మరియు IT సిస్టమ్‌లపై పరిజ్ఞానం ఉండాలి.
లైట్ మోటార్ వెహికల్స్ (LMV) కోసం, 8 గంటల థియరీ మరియు 21 గంటల ప్రాక్టికల్‌తో 4 వారాలలో 29 గంటల పాటు శిక్షణను అందించాలి.అయితే, హెవీ మోటార్ వెహికల్స్ (HMV) కోసం,8 గంటల థియరీ మరియు 31 గంటల ప్రాక్టికల్‌తో 6 వారాల పాటు 38 గంటల శిక్షణ అందించాలి.
లైసెన్స్ ఫీజు మరియు ఛార్జీలు కొత్త చట్టాల ప్రకారం,లెర్నర్స్ లైసెన్స్ (ఫారం 3) జారీ చేయడానికి ₹150 ఖర్చు అవుతుంది,లెర్నర్ లైసెన్స్ టెస్ట్ లేదా రిపీట్ టెస్ట్ కోసం అదనంగా ₹50 ఉంటుంది. డ్రైవింగ్ పరీక్ష కోసం లేదా పునరావృత పరీక్ష అవసరమైతే,రుసుము ₹ 300.
అలాగే,డ్రైవింగ్ లైసెన్స్‌ని జారీ చేయడానికి అయ్యే ఖర్చు ₹200, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ పొందడం ₹1,000 వద్ద గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.లైసెన్స్‌కు మరొక వాహన తరగతిని జోడించాల్సి వస్తే,దానికి ₹500 ఛార్జ్ చేయబడుతుంది.
ప్రమాదకర వస్తువుల వాహనాలను నడుపుతున్న వారికి, ఆమోదం లేదా అధికార పునరుద్ధరణకు ₹200 ఖర్చు అవుతుంది. అదేవిధంగా,స్టాండర్డ్ డ్రైవింగ్ లైసెన్స్‌ని రెన్యూవల్ చేసుకోవడం ₹200 అవుతుంది, అయితే ఈ రెన్యూవల్ గ్రేస్ పీరియడ్ తర్వాత జరిగితే, రుసుము అదనంగా ₹300కి అదనంగా సంవత్సరానికి ₹1000 లేదా గ్రేస్ పీరియడ్ ముగిసే సమయానికి దానిలో కొంత భాగం చెల్లించబడుతుంది.
డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్షన్ స్కూల్‌లు శిక్షణ లేకుండా లైసెన్స్‌లను జారీ చేయడం లేదా పునరుద్ధరించడం కోసం భారీ ₹5,000 రుసుమును ఎదుర్కోవలసి ఉంటుంది.మరియు ఈ పాఠశాలల నుండి నకిలీ లైసెన్స్ పొందడానికి అదే రుసుము వర్తిస్తుంది.
రూల్ 29 ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ ఆర్డర్‌లకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ₹500 ఖర్చు అవుతుంది.డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా లేదా ఇతర వివరాలను మార్చుకుంటే ₹200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
May 24 2024, 12:04