ప్రమాదంలో కాలు విరిగి బెంగళూరులో చికిత్స పొందుతున్న టిడిపి ఎన్నికల ఏజెంట్ మనోజ్ ను పరామర్శించిన ఆలం నరసా నాయుడు..
మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం రంగాపురం గ్రామం లో తెలుగుదేశం పార్టీ తరుపున ఏజెంట్ గా విధులు నిర్వహించిన మనోజ్ (జగన్) కి ప్రమాదవ శాత్తు బైక్ యాక్సిడెంట్ లో కాలు త్రీవంగా గాయపడి విరగడం జరిగింది.మెరుగైన చికిత్స కోసం బెంగళూరు హాస్పిటల్ కి తరిలించడo జరిగింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు బెంగళూరు లో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి వ్యక్తి గతంగా నా వంతు సహాయంగా ఆర్థిక పరంగా అన్ని విధాలగా ఆదుకుంటామని మరియు తెలుగుదేశం పార్టీ తరుపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో మనోజ్ సోదరుడు కర్ణాకర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపి సానుభూతి పరులపై కొడవళ్ళు,కట్టెల తో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు..
అనంతపురం శింగనమల మండలంలోని శ్రీపూరం గ్రామంలో టీడీపి సానుభూతి పరులపై కొడవళ్ళు,కట్టెల తో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు బోయ కొండన్న,బోయ పెద్దన్న,మహిళల పై విచక్షణ రహితంగా దాడి తీవ్ర గాయాలు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు గతంలో చిన్నపాటి గొడవలు మనసులో పెట్టుకొని కట్టెలు, కొడవళ్ళు తో దాడులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కేసుఖండన కార్యక్రమానికి ఆహ్వానించిన బుక్కరాయసముద్రం ఎస్సీ నాయకులు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల ఎస్సీ నాయకులు సింగనమల మండల బండమీదిపల్లి గ్రామానికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కేశఖండన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పలికిన బుక్కరాయసముద్రం ఎస్సీ నాయకులు సాకే కుల్లాయప్ప వార్డు మెంబర్, నాగలింగ, అమర్, చిన్ని కృష్ణ, సల్లా కుల్లాయప్ప
బ్రహ్మంగారి స్వామి ఆరధానకు ₹20,000/- రూ.లు విరాళం అందజేసిన ముంటిమడుగు కేశవరెడ్డి కాటప్ప గారి రామలింగారెడ్డి..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలోని బ్రహ్మంగారి స్వామి ఆరధానకు ₹20,000/- రూపాయలు విరాళం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు, అంజి, రామాంజి, రాజారెడ్డి, అనిల్, పెద్దన్న, మారుతీ, బాబు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కు సెండాఫ్ చెప్పిన ఆలూరు సాంబశివారెడ్డి..
కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం శ్రీ వై యస్‌. జగన్మోహన్ రెడ్డి గారికి గన్నవరం విమానాశ్రయంలో సెండాఫ్ చెప్పిన మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి..
వైఎస్సార్సీపీ కార్యకర్తను పరామర్శించిన.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు..
వైఎస్సార్సీపీ కార్యకర్తను పరామర్శించిన బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన డీలర్ వెంకటేశులు ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఆపరేషన్ చేయించుకుని ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, పార్టీ మండల నాయకులు రమణారెడ్డి, జడ్పీటీసీ నీలం భాస్కర్, ఎంపీటీసీలు, సర్పంచు, పార్టీ నాయకులు, ఆయనను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.
టీడీపీ సీనియర్ కార్యకర్త గడ్డం నారాయణ కుటుంబానికి అండగా ఉంటాం : దండు శ్రీనివాసులు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గడ్డం నారాయణ కుటుంబానికి అండగా ఉంటాం : దండు శ్రీనివాసులు.. శింగనమల : శింగనమల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త *గోరుమానుపల్లి నారాయణ (గడ్డం నారాయణ) గారి తల్లి వెంకట లక్ష్మమ్మ* అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న *తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు* ఆయన స్వగృహానికి విచ్చేసి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో *దాసరి గంగాధర్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, తెలుగు యువత శింగనమల మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, శంకర్ నారాయణ మాసూల్ ప్రకాష్ దండు ప్రకాష్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మసూద్ వలి, రంగస్వామి, ఆర్మీ జిలాన్, నరసింహ,శివ, రాజు, శివశంకర్,ఋషెంద్ర, కాయలసుర్యనారాయణ,లాలు,* తదితరులు పాల్గొన్నారు
మరణించిన రైతు వెంకటరాముడు కుటుంబానికి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి
మరణించిన రైతు వెంకటరాముడు కుటుంబానికి ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యలాకుంటపల్లి గ్రామంలో మరణించిన రైతు G.వెంకటరాముడు గారి పార్థివాదేహంకు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు *₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ కార్యక్రమం ఎర్రిస్వామి, శ్రీనివాసులు , వెంకట నారాయణ, ఏకంబారి రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సింగనమల నియోజకవర్గం వైసీపీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటా... ఆలూరు సాంబశివారెడ్డి
నమస్కారం జగనన్న చెప్పినట్టు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఇది వ్యక్తిగతంగా నాకు గత రెండు ఎన్నికల కంటే చాలా టఫ్. ఎందుకంటే పద్మావతి గారు అభ్యర్థిగా లేకపోవడం వల్ల నాకు కత్తి మీద సాము అయింది. ఫలితం ఏమాత్రం అటూ ఇటూ అయినా చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే గత రెండు ఎన్నికలకు పెట్టినంత శక్తి సామర్ధ్యాలు ఈ ఒక్క సారే పెట్టాల్సి వచ్చింది. ఇక కార్యకర్తలు, నాయకుల విషయానికి వస్తే మీరంతా ఇచ్చిన సహాయ సహకారాలకు రుణపడి ఉంటాను. ఈసారి సామాజిక సమీకరణల నేపథ్యంలో మన సోదరుడు వీరాకు టికెట్ వచ్చింది. అయినప్పటికీ నేను కానీ, పద్మావతి గారు కానీ ఏమాత్రం డీలా పడకుండా జగనన్న మాటే వేదమని పని చేశాము. మనకు టికెట్ లేదు అయినా జగనన్న కోసం కష్టపడి పని చేయాలి, అన్న భావన మాలో ఎలా అయితే ఉందో, కార్యకర్తల నుంచి నాయకుల వరకు అదే స్ఫూర్తి తీసుకోవడం ఒక అద్భుతం. జగనన్న మీద, మా మీద ఉన్న అపారమైన ప్రేమకు ఇది నిదర్శనం. ఒకానొక దశలో నియోజకవర్గంలో అసంతృప్తి వాదుల అలజడి రేగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అది సమసి పోయింది అది వేరే విషయం. వీరాను మార్చాలని ఒకవైపు, మారుస్తున్నారనే పుకార్లు ఒకవైపు‌. మార్చాలని పైవరకు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. మార్చరు అని నాకు పక్కాగా తెలిసినప్పటికీ, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లడం మాకు ఇబ్బందిగానే అనిపించింది. అలాంటి ఇబ్బందికర వాతావరణంలో నాలో ధైర్యం నింపి, ఆత్మవిశ్వాసంతో నన్ను నడిపింది ఇద్దరు. ఒకరు జగన్ సార్ అయితే రెండోది నన్ను నమ్మిన కార్యకర్తలు, నాయకులు. ఇద్దరిలోనూ నాకు ఒకటే విధమైన నమ్మకం కనిపించింది. *"సాంబుడూ, నువ్వు ఏదీ పట్టించుకోవద్దు. పని చెయ్. మనం గెలుస్తాం." అని జగన్ సార్ చెప్పడం. ఇక్కడ క్షేత్రస్థాయిలో నా వెంట ఉండి నన్ను నడిపించారు చాలా మంది. వాళ్లని ఎప్పటికీ మర్చిపోలేను. మీరు నా బలం, నా సైన్యం.* చివరి రెండు నెలలు, ఎండలు మండిపోతుంటే ఇంటింటి ప్రచారం చేసాం. ఏ ఊరికి వెళ్ళినా అపూర్వమైన ఆదరణ. జనమే జనం. ఎండల్ని ఏమాత్రం లెక్కచేయకుండా అలుపెరగకుండా మాతో తిరిగారు మమ్మల్ని నడిపించారు. ఇలా ప్రతి ఒక్క అంశం నాకు గుర్తు వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను కూడా. మన కష్టానికి తగిన ఫలితం రాబోతోంది. మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పేదలకు కచ్చితంగా ఇంకా మంచి జరగబోతోంది. మీరు అందించిన సహకారానికి సేవలకు ప్రతిఫలంగా నా వంతు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. *మరోసారి మీకందరికీ వేలవేల ధన్యవాదాలు*
రోటరీ పురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీ పురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి