జగనన్న పాలన స్వర్ణయుగం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగనన్న రుణం తీర్చుకుందాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ..
జగనన్న పాలన స్వర్ణయుగం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగనన్న రుణం తీర్చుకుందాం.. వైఎస్సార్ సీపీ వస్తేనే పథకాలు ఇంటికి వస్తాయి
◆ ఎన్నికలప్పుడు మాత్రమే ఆర్భాటం చేసే టిడిపిని నమ్మొద్దు ■ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో స్వర్ణ యుగ పాలన జరిగిందని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందాం అని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు పేర్కొన్నారు.
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో డా.బి ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ఆర్టీసీ రీజనల్ చైర్ పర్సన్ మాల్యవంతం మంజుల, పార్టీ శ్రేణులతో కలసి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు. ముందుగా డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి సంక్షేమాన్ని వివరించారు. ఈ నెల 13 తేదీన జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీయం మెషినల్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కల్లూరు మండల కేంద్రంలో నీలం సంజీవరెడ్డి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. సాధారణంగా రాజుల కాలంలో రాజులు ప్రజలను పాలించే పాలనను స్వర్ణ యుగం అంటారని, కానీ వైస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన పాలన కూడా స్వర్ణ యుగ పాలన అని అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పేదప్రజలకు అండగా నిలిచారన్నారు. పేద ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందారంటే ఆ ఘనత వైస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగలంటే మరోసారి వైస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో గార్లదిన్నె మండలంలోని మిడ్ పెన్నార్ డ్యామ్ గేట్లకు రబ్బరు మరమ్మతులు చేసిన పాపాన పోలేదన్నారు. కానీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గెలిచిన తర్వాత మరమ్మతులు చేసి రైతులకు తాగు, సాగు నీరు అందించారన్నారు. సాధారణ కార్యకర్త అయిన తనకు జగనన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఎంతో సంతోషమని సీఎంకు రుణపడి ఉంటానని, నా రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ఎమ్మెల్యే పద్మమ్మకు, ఆలూరు సాంబ శివారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లోకి టీడీపీ, బీజేపీ, జనసేన తోడేళ్ళు గుంపు వస్తున్నాయని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
May 16 2024, 07:05