రోటరీ పురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీ పురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిక..
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిక..
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగలనుంది, ఆ పార్టీకి స్వస్తి పలికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సంక్షేమ పాలన సాధనే లక్ష్యంగా, టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు సమక్షంలో వారు చేరారు.
నార్పల మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రాగే పుల్లయ్య, రాగే సాలన్న, రాగే రాముడు, రాగే జయన్న, 4 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరాయి. వారికి కండువా వేసి సాదరంగా ఆయన ఆహ్వానించారు. శింగనమల మండలం పెద్ద జలాలపురం గ్రామానికి చెందిన మంచాల శివ, ఎం. ఆదెన్న, ఆంజనేయులు, 3 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి ఆధ్వర్యంలో శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు సమక్షంలో చేరాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పాలన, శింగనమల నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి వైఎస్సార్సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జగనన్న పాలన స్వర్ణయుగం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగనన్న రుణం తీర్చుకుందాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ..
జగనన్న పాలన స్వర్ణయుగం.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. జగనన్న రుణం తీర్చుకుందాం.. వైఎస్సార్ సీపీ వస్తేనే పథకాలు ఇంటికి వస్తాయి
◆ ఎన్నికలప్పుడు మాత్రమే ఆర్భాటం చేసే టిడిపిని నమ్మొద్దు ■ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో స్వర్ణ యుగ పాలన జరిగిందని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రుణం తీర్చుకుందాం అని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు పేర్కొన్నారు.
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో డా.బి ఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ఆర్టీసీ రీజనల్ చైర్ పర్సన్ మాల్యవంతం మంజుల, పార్టీ శ్రేణులతో కలసి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు. ముందుగా డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి సంక్షేమాన్ని వివరించారు. ఈ నెల 13 తేదీన జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీయం మెషినల్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కల్లూరు మండల కేంద్రంలో నీలం సంజీవరెడ్డి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. సాధారణంగా రాజుల కాలంలో రాజులు ప్రజలను పాలించే పాలనను స్వర్ణ యుగం అంటారని, కానీ వైస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన పాలన కూడా స్వర్ణ యుగ పాలన అని అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గ్రామాల్లో సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి పేదప్రజలకు అండగా నిలిచారన్నారు. పేద ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందారంటే ఆ ఘనత వైస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగలంటే మరోసారి వైస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో గార్లదిన్నె మండలంలోని మిడ్ పెన్నార్ డ్యామ్ గేట్లకు రబ్బరు మరమ్మతులు చేసిన పాపాన పోలేదన్నారు. కానీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గెలిచిన తర్వాత మరమ్మతులు చేసి రైతులకు తాగు, సాగు నీరు అందించారన్నారు. సాధారణ కార్యకర్త అయిన తనకు జగనన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఎంతో సంతోషమని సీఎంకు రుణపడి ఉంటానని, నా రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ఎమ్మెల్యే పద్మమ్మకు, ఆలూరు సాంబ శివారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లోకి టీడీపీ, బీజేపీ, జనసేన తోడేళ్ళు గుంపు వస్తున్నాయని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్దారంపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం..
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి *ఉమ్మడి MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి, ఉమ్మడి MLA అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారికి ఓటు వేసి వేపించి గెలిపించాలి* అని కోరిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,ఎంపీటీసీ భర్త సాకే నాగేంద్ర జిల్లా తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, నాగేంద్ర, కాటమయ్య, నారాయణస్వామి,ఆదినారాయణ,మారుతీ, చిన్నరాజు, లింగమయ్య,చిన్న మద్దిలేటి,నరసింహులు,కిష్టయ్య, సాకే మహేష్, పెద్దమద్దిలేటి,మాజీ డీలర్ కొండన్న, ,రమేష్, హరి,తదితరులు పాల్గొన్నారు.
బుక్కరాయసముద్రంలో ఆలం నరసా నాయుడు మొండిమడుగు కేశవరెడ్డి కే రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించిన ద్విసభ్య కమిటీ సభ్యులు అలంనరసానాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు కె.రామలింగారెడ్డి గారు పర్వతనేని శ్రీదర్ బాబు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిలుగా పోటీ చేస్తున్న బండారు శ్రావణీ శ్రీ అంభికా లక్ష్మి నారాయణ గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..
ప్రచార హోరు...'ఫ్యాన్ జోరు' వీరాకు అడుగడుగునా జన నీరాజనం.. 'ఫ్యాన్ ' గుర్తుకు ఓటు వేసి గెలిపించండి..
సైకిల్ కి ఓటు వేస్తే వందేళ్లు వెనక్కి వెళ్లినట్లే సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం పెద్ద మట్లగొంది, గోవిందరాయునిపేట గ్రామాలలో మరియు మండల కేంద్రంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు. ఆయనకు ప్రజలు, అభిమానులు, అడుగడునా పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. ఇంటింటికి వెళ్లి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వారికి గుర్తు చేస్తూ.. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శింగనమల మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి ఎం శంకర్ నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రీజనల్ కోఆర్డినేటర్ రాగే పరశురాం, గిరిజన ప్రజా సమైక్య జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ , పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పాల్గొన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ..ఒక సామాన్యుడిని పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన తనను ఇలా మీ ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను, దీనికి కారణం అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చిన దళితుల దేవుడు డా.బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. నన్ను తమ్ముడిలా ప్రోత్సహిస్తున్న మన ఎమ్మెల్యే పద్మమ్మ, ఆలూరు సాంబశివారెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గానికి అనేకమంది ఎమ్మెల్యేలు పాలన చేశారు. 50 ఏళ్ల చరిత్రను తిరగరాస్తు శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఏకైక ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి చరిత్రలో నిలిచారన్నారు. ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన కొనసాగించారన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను ఎన్నికల వేళ మరోసారి మోసం చేయటానికి వస్తున్నారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈనెల 13 తేదీన ఈవీఎం మెషినల్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు కూటముల పేరుతో ప్రజలని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈనెల 13న ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి అయిన తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు తమ అభ్యర్థులను గెలిపించాలంటూ విస్తృత ఎన్నికల ప్రచారం చేపట్టారు
శింగనమల నియోజవర్గం బుక్కరాయసముద్రం మండలం L.B కాలని రేగడీ కొత్తూరు నీలంపల్లి చెన్నంపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ(NDA కూటమి) అసెంబ్లీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలుగుదేశం పార్టీ (NDA కూటమి ) అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి మద్దతుగా ద్విసభ్య కమిటి సభ్యలు ఆలం నరసానాయుడు ముంటీమడుగు కేశవరెడ్డి రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు మండల కన్వీనర్ అశోక్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను గడపగడప తిరుగుతూ వివరించడం జరిగింది.పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని కోరారు.
పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి అసెంబ్లీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి,వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
అత్యధిక మెజారిటీతో వీరాను గెలిపించండి.. కార్యకర్తల సమావేశంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి..
అత్యధిక మెజారిటీతో వీరాను గెలిపించండి.. కార్యకర్తల సమావేశంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కలసి కట్టుగా పని చేద్దాం.. జగనన్నను ముఖ్యమంత్రి గా చేసుకుందాం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.. జగనన్న గెలుపు ప్రజల కోసమే.. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులే.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీవెనలతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు కోసం కలిసికట్టుగా పని చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని తన నివాసంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పనిచేసి రానున్న ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగనన్న గెలుపు ప్రజల కోసమేనని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు. యల్లనూరు మండల కేంద్రంలోను, మరియు తిమ్మంపల్లి, కొడవాండ్లపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారంతో పాటు, మండల కేంద్రంలో రోడ్డు షో పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి శింగనమల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కష్టపడి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును, ముఖ్యమంత్రిగా వైస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొనే బాధ్యత మన అందరిదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరాంజనేయులు ద్వారా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. మనమందరం జగనన్న కోసం కష్టపడి ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి గిఫ్ట్ గా ఇద్దామని కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.
పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే ప్రక్కన పెట్టి వైఎస్సార్సీపీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
జనం జగనన్న వైపే.. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేద్దాం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
జనం జగనన్న వైపే.. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేద్దాం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపడం ఖాయం ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ప్రజలంతా అధికశాతం జగనన్న వైపే ఉన్నారని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. పుట్లూరు మండల కేంద్రంలో, మరియు కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, నాగిరెడ్డిపల్లి, నాయకునిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని, మరియు రోడ్డు షో ను వీరాంజనేయులు చేపట్టారు. పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి జగనన్న చేసిన మేలుని వివరించారు. ఈవీఎం మెషిన్ లో 3 వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..గత రెండు నెలల నుంచి ఏ పల్లెకు పోయినా తనను సోదరుడిలా భావించి ఆశీర్వదిస్తున్న శింగనమల నియోజకవర్గ ప్రజలకు శిరసు వంచి రెండు చేతులు జోడించి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఏ ఇతర సర్టిఫికెట్లు కావాలన్నా ఆఫీసర్ల ముందర చేతులు కట్టుకుని నిలబడి వాళ్ల దయా దక్షిణ్యాల మీద మనం ఆధారపడేవాళ్ళం. జగనన్న ప్రభుత్వం వచ్చాక మనకు అతి దగ్గరలో ఉన్న సచివాలయాల్లోనే అన్ని సేవలు అందుతూ ఉన్నాయన్నారు.
రెండేళ్లు కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మాత్రం ఎక్కడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి ఇంటికి అందించారన్నారు. టిడిపి ఒంటరిగా పోటీ చేసి గెలవలేననే భయంతో జనసేన ని కలుపుకొందని, అయినా ధైర్యం చాలక ఢిల్లీ దర్బార్ ముందు సాగిలపడి బిజెపితో కూడా జతకట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 2024 లో టిడిపిని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. మరోసారి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
May 16 2024, 06:47