అరూరు గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో శుక్రవారం రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా భద్రతపై ప్రజలకు భరోసా కల్పించడం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు.
చిట్యాల లో మీడియా సమావేశంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ BSP అభ్యర్థి ఐతరాజు అబ్బెందర్

చిట్యాల పట్టణంలో పత్రిక ప్రతినిధుల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంటు బిఎస్పి అభ్యర్థి ఐతరాజు. అబ్బెందర్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీలో మూడవ పార్టీ అయినా పేద ఇంటి బిడ్డను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి డబ్బు మూటలతో వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ఇప్పటివరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అలాగే మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గతంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా భువనగిరికి ఉన్న ఒక్క అభివృద్ధి పని చేయలేదని అన్నారు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని బీసీ ను ఓటు వేయాలని అడగడానికి మీ ముందుకు వస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంటుకు చేసింది ఏమీ లేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రాంత సమస్యలపై ఎలాంటి అవగాహన లేదు కానీ గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి భువనగిరి పార్లమెంటుకు నియోజకవర్గానికి అభివృద్ధి పని చేయలేదని అన్నారు. కేవలం కేసీఆర్ వి మాటలు మాత్రమే పనులు మాత్రం నీటి మీది గాలి బుడగలు అని అన్నారు. ఇక్కడి ప్రాంతం పై పూర్తి అవగాహన నాకుంది చిట్యాల మండలంలో అనేక కాలుష్య కర్మాగారాలు ఏర్పాటుచేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా గురిచేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి చేయలేదు కచ్చితంగా వీటిపై పోరాటం చేస్తాము పార్లమెంటులో వాని వినిపిస్తామని అన్నారు భువనగిరి పార్లమెంట్ గడ్డ బిఎస్పి అడ్డాగా మారుతుందని అన్నారు ప్రజల్లో ఎటు చూసినా తీవ్ర అసంతృప్తికి లోనై ఉన్నారు ఏ నాయకునికి ఓటు వేసిన ఏం ఉపయోగం లేదు ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని మేము ఎక్కడ వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కచ్చితంగా భువనగిరి పార్లమెంటు నుండి లక్ష మెజారిటీతో గెలుస్తున్నామని తెలిపారు. అనంతరము బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని బడుగు బలహీన వర్గాల బిడ్డ ఐత రాజు అబేందర్ అని గెలిపిస్తే పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడతాడు పార్లమెంటులో మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వాని వినిపిస్తాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎర్పుల రాజా రావు,నియోజకవర్గ ఇంచార్జి మర్రి శోభ, నియోజకవర్గ అధ్యక్షులు గుని రాజు, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎ డ్ల విజయ్, నియోజకవర్గ కోశాధికారి మునుగోటి సత్తయ్య, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మునిసిపల్ అధ్యక్షులు అవిరెండి ప్రశాంత్, గ్యార మారయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


అవినీతి ఊబిలో బిజెపి : ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


అవినీతి ఊబిలో బిజెపి - ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి..* అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపిని ఓడించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఏఐటియూసి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముద్రించిన 'అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపి కేంద్ర ప్రభుత్వం' వైఫల్యాలకు సంబంధించిన బుక్లెట్లను కుంభం అనిల్ కుమార్ రెడ్డి సిపిఐ ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ 10 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా దళితులపైన, ఆదివాసీల పైన, మహిళల పైన, మైనారిటీ లపైన దాడులు, హింస పెరిగిపోయాయని, లౌకిక,ప్రజాస్వామిక వాదులపై, ఆలోచనా పరులపై పాశవిక నిర్బంధాన్ని బీజేపీ అమలు చేస్తున్నారని,రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం చట్టసభలను నామమాత్రం చేస్తున్నదని, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నదని,ఒక్క మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ ఫాసిజాన్ని దేశం లో అమలు చేస్తున్నదని అన్నారు.కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్మిక కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని, కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసారని, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా తయారు చేసారని,4 లేబర్ కొడులను రద్దు చేయాలని, కార్మిక, కర్షక హక్కుల కోసం ఇండియా కూటమి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధికా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు ఎలగందు అంజయ్య, సిపిఐ మండల కార్యదర్శి పోలెపాక యాదయ్య, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, నాయకులు సల్వద్రి రవీందర్,సుద్దాల సాయి కుమార్, చొప్పరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకమైన ఎన్నికల నిరంలో భాగంగా జిల్లాలో వైన్ షాపులు బంద్: జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ హనుమంతు కే జెండగే


ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 13 వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పురస్కరించుకొని 11 వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి 13 వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు, అలాగే జూన్ 4 వ తేదీన కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయబడతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు* *అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను బంద్ చేయడం జరుగుతుందని, దీనిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 1951 ప్రజా ప్రాతినిథ్యం చట్టం 135 సి సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

చామలను గెలిపించాలని ఆయన సతీమణి డింపుల్ రెడ్డితో కలిసి ప్రచార నిర్వహించిన ఏఐటీయూసీ, కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి డింపుల్ రెడ్డి ఏఐటీయూసీ నాయకులను మరియు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. గురువారం రోజున భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చమల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ అయన సతీమణి చామల డింపుల్ రెడ్డి పలు కార్మికుల అడ్డాల వద్ద ఏఐటీయూసీ మరియు కాంగ్రెస్ నాయకులు కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా *భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ* కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కార్మికులను, కర్షకులను, రైతులను మరియు యువతను ఇలా అన్ని వర్గాల ప్రజలని మోసం చేసిందని, ముఖ్యంగా రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని, దానితోపాటు 44 కార్మిక చట్టాలను రద్దు చేసే 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చిందని వారు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు, అవినీతిపరులకు మొత్తం ప్రభుత్వ రంగాన్ని దారా దత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల పైన మహిళల పైన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ, నిత్యవసర ధరలు పెంచడం లాంటివి బిజెపి పాలనలో పెరిగిపోయాయి అని వారు అన్నారు. మరో మారు దేశంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వత్వం పెరుగుతుందని, రాజ్యాంగం, రిజర్వేషన్లు లేకుండా చేస్తారని, బీజేపీ ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలు తిరగబడి ఓటు అనే ఆయుధంతో బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసినటువంటి కర్తవ్యం మన అందరిపై ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్,ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గనబోయిన వెంకటేష్, సామల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగారం శంకర్, బురాన్, సమీర్, శివ, రామకృష్ణ, చాంద్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థులకు అరటి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన భాజపా సీనియర్ నాయకులు ,న్యాయవాది దంతూరి సత్తయ్య గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో వారం రోజున హైస్కూల్ స్టార్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగు వేసవి కాల శిక్షణ తరగతులు జరుగుతున్న సందర్భంగా గురువారం ఉదయం హైస్కూల్ మైదానంలో ప్రతిరోజు ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అరటి పండ్లు బిస్కెట్లు అందజేయడం జరుగుతుంది గురువారం రోజున దాత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది దంతూరి సత్తయ్య గౌడ్ వేసవి కాల శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అరటి పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్లకు టీవీలను ఎక్కువ వాడరాదు. ఈ వేసవికాలంలో ఇంటి వద్ద ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ స్టార్ వాకర్స్ సభ్యులు పోలెపాక బిక్షపతి, వంగరి రమేష్, మైసొల్ల శ్రీకాంత్, ఎడవెల్లి అనిల్, నీరుడు భాను, పల్లెర్ల నరేష్ పండు, డాక్టర్ దయ్యాల వెంకటేశం, బాలగోని మధు బాలరాజు వాకర్ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బూర నర్సయ్య గౌడ్ కి బీసీ సంఘం మద్దతు, అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. పల్లగొర్ల మోదీ రాందేవ్


భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కి బీసీ సంఘాలు మద్దతు తెలిపారు భువనగిరిలో svహోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ కు పూర్తిమద్దతు ప్రకటించారు వారు మాట్లాడుతూ 2024 లోక్సభ నియోజకవర్గ భువనగిరి పార్లమెంట్ పరిధిలో 60 శాతం పైబడి ఉన్న బీసీలు అన్ని కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం పని చేయాలన్నారు ఒట్టు అనే ఆయుధంతో బీసీల సత్తా నిరూపించుకునే సమయం వచ్చిందన్నారు గతంలో MPగా పని చేసినా అనుభవం పార్లమెంట్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు బడ్జెట్లో బీసీల వాటా కోసం కొట్లాడే నాయకుడు అన్నారు భువనగిరిలో బూర దేశంలో బీసీ ప్రధానమంత్రిని చేసుకుందామన్నారు రాష్ట్రంలోనూ ఏకైక ఏమ్స్ బోనగిరికి తీసుకువచ్చి పేదలకు వైద్యాన్ని అందించిన వ్యక్తి విద్యార్థుల కోసం కేంద్రీయ విద్యాలయం పాస్పోర్ట్ సేవాకేంద్రం జాతీయ రహదారులు చేనేత పరిశ్రమలు ఫార్మా కంపెనీలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ అధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు *ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్వి శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన శంకర్, కొత్తపెళ్లి బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టెం మధు, సంతోష్ కుమార్, నూచి మహేష్,కొడారి వెంకటేష్,పబ్బల ఎలేషా, పూస సాయిరాం, రాపోలు వినయ్, సంజయ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించండి; సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య

35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలిపించండి... సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పోరాడుతున్న ప్రజా నాయకుడు సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఓటర్లను కోరారు గురువారం మండల పరిధిలోని చిత్తపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు వెతుక్కోకుండా వచ్చిన ఉద్యోగాలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి,యువజన సమస్యలతో పాటు ప్రజా సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్న పేదలబిడ్డ జహంగీర్ ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని ప్రజలందరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పేదల అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు ఈ చట్టం వల్ల పనులు లేని అనేక పేద కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని పేదల నోటికాడి ముద్దను లేకుండా చేయాలని కుట్ట చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఉపాధి హామీ చట్టరక్షణకై పోరాడే ఏకైక సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జహంగీర్ ఈ ప్రాంత అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నడిపారని మూసి జల కాలుష్య నివారణకై మూసీ ప్రాంతంలో గోదావరి జలాల సాధనకై స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూమి లేని పేదలకు భూమి పంచాలని,ఇండ్లు,ఇండ్ల స్థలాల సాధన డిమాండ్ తో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు అందుకే ప్రజల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపిస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారని ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం మండల నాయకులు ఏటెల్లి నర్సింహ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాచమల్ల అంజయ్య,లింగమ్మ, రేణుక,భూపతి పద్మ,వల్లమల్ల పావని తదితరులు పాల్గొన్నారు.


ఉపాధి హామీ చట్టం తెచ్చి , చట్ట పరిరక్షణకై పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ ని గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ

వలసలను ఆపాలని, గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని చూపాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిన సిపిఎం ను, నేడు చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రము పైన ఓట్లు వేసి గెలిపించాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని నమాత్ పల్లి, బండసోమవారం, ముస్త్యాలపల్లి, వీరవెల్లి గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల వద్ద, అమాలి కార్మికుల దగ్గర సిపిఎం అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజల పైన బారాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పదం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం, రాజ్యాంగం లోని ముఖ్యమైన విషయాలను తొలగించడం, ప్రజలకు ఉన్న చట్టాలను తొలగించడం లాంటివి తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని , సమాచార హక్కు చట్టాన్ని, మూడు హక్కుల చట్టాన్ని భూ సేకరణ చట్టాన్ని , కార్మికుల చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా నూతన చట్టాలను తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుందని అన్నారు. మరో భారత దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగం అనేది ఉండదని, భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కొనసాగే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు. సనాతన పద్ధతులను తెచ్చి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని పూర్వపు ఆచారాలను కులాన్ని మతాన్ని మళ్లీ ముందుకు తెచ్చి దేశ సమైక్యత సమగ్రత దెబ్బతీయాలని చూస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. అవకాశవాద కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమి లేదని ప్రజలను మభ్యపెట్టడం మోసగించడం లాంటివి తప్ప ప్రజల హక్కుల కోసం ఏనాడు పోరాటం చేయలేదని ఇలాంటి పార్టీలకు అవకాశం ఇవ్వద్దని నిరంతరం ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం పోరాడుతున్న సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను దేశ ఐక్యత విషయాలను పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం ఉంటుందని అలాంటి అవకాశాన్ని ప్రజలందరూ జహంగీర్ ని గెలిపించి కల్పించాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్ ,జిట్టా అంజిరెడ్డి,సిలివేరు ఎల్లయ్య ముస్త్యాలపల్లి శాఖ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, యాదగిరి, మండల నాయకులు వడ్డెబోయిన వెంకటేష్,యాదమ్మ , బుచ్చమ్మ, సుగుణమ్మ ,అండమ్మ, చంద్రమ్మ, మనమ్మ తదితరులు పాల్గొన్నారు.

గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో అపశృతి, కాలు విరిగిన చిన్నారి, ఓ మీడియా ప్రతినిధి కంటికి గాయాలు


యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోడ్డు షోలో అపశృతి చోటుచేసుకుంది . ఈ రోడ్ షో లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కార్యకర్తలు బాణసంచా కాల్చగా భయంతో జనాలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ చిన్నారికి కాలువగా ఓ మీడియా ప్రతినిధికి కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి.