NLG: ముమ్మరంగా కొనసాగుతున్న చత్రపతి శివాజీ (CSL) ఫుట్బాల్ లీగ్స్.. ముఖ్య అతిథిగా పాల్గొన్న PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారుల లో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 11 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరీ మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి రెండు జట్లు సమ స్కోర్టు తో నిలిచి మ్యాచ్ డ్రా గా ముగియడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. 

సుంకరి బిక్షం గౌడ్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడా ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడల్లో రాణించాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో రాయించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం సాధన చేయాలని అన్నారు.

నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు ను ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం క్రీడాకారులకు

 శ్రీసత్యం వర్మీ బయో ఆర్గానిక్స్ వారు అందజేసిన బిస్కెట్ ప్యాకెట్లు-సాఫ్ట్ డ్రింక్ లు పంపిణీ చేశారు. ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, వెంకటసాయి, యశ్వంత్, శివదాసు తదితరులు పాల్గొన్నారు.

TG: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

ఈ రోజు మేడ్చల్ జిల్లా,కీసర మండలం, చీర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు పడి, కరువు అంతమై, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాలలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

నామపురం గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

మర్రిగూడ మండలం, నామపురం గ్రామంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ, ఇంటి ఇంటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నామాపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 

NLG: రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బిఆర్ఎస్ ను పూర్తిగా బొంద పెట్టేంత వరకు నిద్రపోనని అన్నారు.

శనివారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మండల కేంద్రంలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సభ వేదిక నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని బిడ్డే లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి తీహార్ జైల్లో ఉందని, ఫోన్ టాపింగ్ అంశంపై మరో కేసు నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని జనాల్లో తిరుగుతున్నాడో చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

బూర నర్సయ్య గౌడు పాత బిఆర్ఎస్ పార్టీ బుద్ధులు కొత్త బిజెపి పార్టీలో చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డాక్టర్ జేఏసీ తరఫున బూర నర్సయ్య గౌడ్ ను తీసుకురాకపోతే నేడు ఆయన ఎవరికి తెలుసు అని ప్రశ్నించారు.

కేసీఆర్ కు గతంలో అత్యంత సన్నితుడైన బుర్ర నర్సయ్య గౌడ్ భువనగిరికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ వచ్చిందని, 5 ఏళ్లు ఎంపీగా ఉండి ఎయిమ్స్ ను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. బిజెపి నాటినుండి నేటి వరకు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. త్వరలోనే బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడతారని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడే పార్టీ అన్నారు.

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మెజార్టీ ఎంత వస్తుందనే దానిమీదనే ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఇవ్వడంలో మునుగోడు నియోజక వర్గం పోటీ పడనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి, చర్లగూడెం, రిజర్వాయర్ పూర్తిచేసి మండల రైతన్నల పొలాల్లోకి కృష్ణా జలాలను అందిస్తామని తెలిపారు. రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ప్రాజెక్టుల పేరుతో కమిషనర్లను దండుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధు యాస్కిగౌడ్, పున్న కైలాష్, నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, చిలుకూరి బిక్షం, బట్టు జగన్ గిరి, అల్లంపల్లి ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఉచిత వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 

NLG: జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, యువత స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదార్ పల్లి గ్రామంలో ఉచిత వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని గుర్రంపోడు ఎస్ఐ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మారుమూల ప్రాంతమైన తానేదార్ పల్లి గ్రామంలో ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఉదయం సాయంత్రం శిక్షణ శిబిరంలో పాల్గొనాలని తద్వారా శారీరకదారుఢ్యం మంచి ఆరోగ్యం, పెంపొందుతున్నదని తెలిపారు. క్యాంపు నిర్వహకుడు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొల్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..1 నెల రోజులపాటు తమ గ్రామ పంచాయతీలో నిర్వహించే ఫుట్బాల్ శిక్షణ శిబిరానికి సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు వెలుగులోకి రావడానికి క్రీడాకారులకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, UPS చైర్మన్ మడ్డి యాదయ్య, ఖమ్మంపాటి నరసింహ, కుంభం కొండల్, గిరి శ్రీను, ఖమ్మంపాటి గణేష్, గార్లపాటి మల్లికార్జున్, మరిమహేష్, గిరిఅజయ్ కుమ్మరి ఆంజనేయులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నల్లగొండ పట్టణం 5 వ వార్డులో బిజెపి ఇంటింటికి ప్రచారం

నల్లగొండ: బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిపించాలని బిజెపి నాయకులు గడ్డం మహేష్ ఆధ్వర్యంలో 5వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేశారు.ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ సారి అధికారంలోకి రావడానికి ఈవీఎం యందు 4 వ నెంబర్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

భూత్ అధ్యక్షులు కార్యకర్తలు వేణు, హేమంత్,దేవ,నిఖిల్,మధు,రాజు, లక్ష్మణ్,శ్రీను,ధన్రాజ్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్,జగాల్ రెడ్డి శ్రీశైలం,జింకల వెంకన్న,కస్తాల వెంకన్న,చింటూ,చరణ్, రామకృష్ణ,చందు,బ్రహ్మచారి,బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే సందర్భంగా శుక్రవారం ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్, జగాల్ రెడ్డి శ్రీశైలం, జింకల వెంకన్న, కస్తాల వెంకన్న, చింటూ, చరణ్, రామకృష్ణ, చందు, బ్రహ్మచారి, బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

TG: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది.

వాస్తవానికి నేటితో ఈ గడువు ముగియగా.. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాళాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కూడా టీఎస్‌బీఐఈ ఖాతాకు అదే తేదీలోగా ఫీజులు చెల్లించాలని సూచించింది.

తెలంగాణలో మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం గం. 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం గం. 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

NLG: ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు

నల్గొండ: పట్టణ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి లతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .

SB NEWS NLG