నల్గొండలో BJP డిపాజిట్ గల్లంతే:* *కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి*

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో BJP డిపాజిట్ గల్లంతవడం ఖాయమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. BRS అనేది అసలు మనుగడలోనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిలతో కలిసి ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. తాను ఎంపీగా గెలిచాక ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకంలో హుజూర్ నగర్ మరింత అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రతీ కార్యకర్త గ్రామ, బూత్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు కుందూరు రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పాదయాత్రతో కిక్కిరిసిన కోదాడ పట్టణ వీధులు కోదాడలో కాంగ్రెస్ పాదయాత్ర విజయవంతం:

▪️ పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు

▪️ జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తిన కోదాడ

▪️ పాదయాత్రలో పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి,  మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు తదితరులు

▪️రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి

▪️ కోదాడ మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తా: రఘువీర్ రెడ్డి

▪️ ఈ పది రోజులు ప్రతి కార్యకర్త సైనికుని వలే పనిచేయాలని పిలుపునిచ్చిన రఘువీర్ రెడ్డి

వేములపల్లి మండలంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన రోడు షో లో పాల్గొన్న మాజీ మంత్రి :

ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు.. పట్టభద్రుల MLC కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌ,, శ్రీ తీన్మార్ మల్లన్న గారు, నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా అనే పేరుని మరోసారి మీరు ఇచ్చే అత్యధిక మెజారిటీతో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని అన్నారు.

మన ప్రజా బంధువు కుందూరు జానా రెడ్డి గారు

గత 40 ఏళ్లుగా మన జిల్లాకి జిల్లాలో ఎంతో అభివృద్ధి చేశారు, మన మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారు, కావున వారి కుమారుడు అయిన కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా, అత్యధిక ఓటింగ్ పోల్ అయ్యేలా అందరూ కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు.

అలాగే గత 9 సంవత్సరాలుగా BRS ప్రభుత్వ అరాచక పాలనపై, ప్రతిక్షణం ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడిన మన తీన్మార్ మల్లన్న గారు పట్టభద్రుల MLC అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్నారు కావున వారిని కూడా అత్యధిక మెజారిటీతో పట్టభద్రులు అందరు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

నిజమైన లౌకికవాదం కాంగ్రెస్ లోనే ఉంది. * రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి*.

కాంగ్రెస్ తోనే ప్రజా పాలన..

రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 సీట్లు బిజెపి ఎత్తుగడ....

కాంగ్రెస్ పాలనపై అబద్ధపు ప్రచారం... 

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య..

కోదాడ : 

నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరి రఘువీర్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెరిక భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి విచ్చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్ తోనే ప్రజా పాలన జరుగుతుందని,  బిజేపి వల్లే మత గర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 సీట్లు బిజెపి ఎత్తుగడ అని, కాంగ్రెస్ పాలనపై అబద్ధపు ప్రచారం చేయటం బీజేపీకి, బిఆర్ ఎస్ కి పనిగా మారిందని ఆరోపించారు. నిజమైన లౌకికవాదం కాంగ్రెస్ లోనే ఉందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేస్తే ఇంకా మిగిలిన రోజుల్లో ఇంకా ఎన్ని చేస్తుందోనని అన్నారు.

10 సంవత్సరాలు ఏం చేసినావ్ అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు తప్ప ఏమీ లేవని అన్నారు. వికలాంగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు. ఏమీ చేయని నువ్వు 10 సంవత్సరాలు పాలించి నీ కూతురు లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది అని, రేపు మాపో నీ కొడుకు ఫోన్ టాపింగ్ కేసులో, డ్రగ్స్ కేసు లో అరెస్టు అవుతాడని గాటుగా కేసీఆర్ ను విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్నది ప్రజా పాలన అని అన్నారు. బిజెపికి అమ్ముడు పోయావని కెసిఆర్ ని ఘాటుగా విమర్శించారు. బిఆర్ఎస్ అంటే బిజెపి...అని బిజెపి అంటే బీఆర్ఎస్ అని రెండు ఒకటే అన్నారు. బిజెపి వాళ్లు అభివృద్ధి పేరుతో కాకుండా మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తుంది అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ముందుగా మొదటిసారిగా పట్టణానికి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య రావడంతో పెరిక సంఘం నాయకులు ఘన స్వాగతం పలికినారు.తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావును పేరిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో  పెరిక సంఘం నాయకులు, PCC మెంబర్ దొంగరి వేంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ , పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి కోట మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షుడు బ చ్చు అశోక్, మాజీ ఎంపీపీ నాగేంద్ర బాబు,పాయిలీ కోటేశ్వరరావు, రామి నేని శ్రీనివాసరావు,వార్డు కౌన్సిలర్ తిప్పిరి శెట్టి సుశీల& రాజు, అమీనాబాద్ తాజా మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు,మహిళా అధ్యక్షరాలు గుండు అనురాధ, రామినేని శ్రీనివాసరావు, బుడిగం నరేష్ తో పాటు కోదాడ నియోజాక వర్గం లోని వివిధ గ్రామాల ముఖ్య కుల నాయకులు దాదాపు 300 మంది పాల్గొన్నారు.

*CPM* బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డిగారి గెలుపుని కాంక్షిస్తూ ముఖ్య కార్యకర్తల సమావేశం:

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని SP కన్వెన్షన్ నందు నిర్వహించిన ఇండియా కూటమిలో భాగంగా  పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు.. వారు మాట్లాడుతూ CPM, కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మన ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారి తనయులు అయినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని నల్గొండ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు.

ఇలాగే కలసి కట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పనిచేస్తూ అందరం కలిసి మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం ఖాయం ....పున్న కైలాస్ నేత పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాసనేత పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని, నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని, బిజెపి పార్టీ అడ్రస్ గల్లంతని కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీతో కుంభకై కేసీఆర్ కూతురైన కల్వకుంట్ల కవిత కోసం ఐదారు స్థానాల్లో డమ్మి అభ్యర్థులను నిలిపి బిజెపికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్గారంటలను అమలు చేస్తున్న విధానాలకు ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తెలిపారు. జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లమద ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బిఎల్ఆర్, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారి సారథంలో మిర్యాలగూడలో అత్యధిక మెజార్టీ ఖాయమని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా న్యాయం జరుగుతుందని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీనవర్గాల కోసం పెద్దపీట వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు ,ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జ్ నర్సింగ్ వెంకటేశ్వర్లు ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పార్లమెంట్ ఇన్చార్జి మెరుగు శ్రీనివాస్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బక్క రెడ్డి ,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఖా,న్ ఐ ఎన్ టి సి పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, సీనియర్ నాయకులు జిల్లా వెంకటేశ్వర్ల, పొలగాని వెంకటేష్ గౌడ్, పరంగి పుల్లయ్య పోలిశెట్టి అజయ్, తదితరులు పాల్గొన్నారు*

మాడుగులపల్లి లో *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి * ఆధ్వర్యంలో నిర్వహించిన రోడు షో లో పాల్గొన్న నల్గొండ పార్ల

ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం గారు.. నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు*..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా అనే పేరుని మరోసారి మీరు ఇచ్చే అత్యధిక మెజారిటీతో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని అన్నారు.. ఎంతటి ఎండలో కూడా వేలాదిగ కదలి వచ్చి మాకు ఘనస్వాగతం పలికినందుకు ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా, అత్యధిక ఓటింగ్ పోల్ అయ్యేలా అందరూ కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

అడవిదేవులపల్లి మండలంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి :

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం గెలుపు కోసం చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారు..

మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -

BLR గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా బంధువు కుందూరు జానారెడ్డి గారు గత నలభై ఏళ్లుగా ఈ రాష్టానికి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసారు.. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసారు.. వారి తనయులు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి మనం బహుమతి గా ఇవ్వాలని కోరారు... మన నల్గొండ పార్లమెంట్ స్థానంలో మనం గెలిపించే మెజారిటీతో డిల్లి అధిష్టానం మన నల్గొండ వైపు చూసేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.లుపు కోసం చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారు.. మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా బంధువు కుందూరు జానారెడ్డి గారు గత నలభై ఏళ్లుగా ఈ రాష్టానికి మన జిల్లాకి ఎన్నో సేవలు చేసారు.. ఎంతోమంది రాజకీయ నాయకులను తయారు చేసారు.. వారి తనయులు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి మనం బహుమతి గా ఇవ్వాలని కోరారు...

మన నల్గొండ పార్లమెంట్ స్థానంలో మనం గెలిపించే మెజారిటీతో డిల్లి అధిష్టానం మన నల్గొండ వైపు చూసేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

కాంగ్రేస్‌ పార్టీలో చేరాలని ఊవ్విళూరుతున్న వారికి.. - ఉచిత వేసవి శిక్షణ శిభిరం..


కాంగ్రేస్‌ పార్టీ మహాసముద్రం లాంటిది..

మీరు పార్టీ కండువా కప్పుకున్న వేంటనే..

నిఖార్సైన కార్యకర్తలు మీ ముఖం పై గాండ్రీంచి ఉమ్మిమేయగలరు..(తుడుచుకుంటే సరి)

కుర్చీలు,బల్లాలు అందుబాటులో లేకుంటే మీ వీపులపై దరువేయించుకోవాల్సి ఉంటుంది..

(DJఅలవాటుంటే ఓకే)

ఒక్కొసారి కండువా కప్పిన వారిని కుడా ముష్టియుద్ద బరిలోకి లాగగలరు..

(చూస్తు ఊరుకుంటే సరి)

నిఖార్సైన గల్లీ కార్యకర్తలు సైతం..పార్టీ అగ్రనాయకుల చెంపలు చెళ్ళుమనిపించిన సందర్భాలు కోకోల్లలు.

రెండు సంవత్సరాల వరకు ఏలాంటి పదవులు ఆశించకుండా ఉండాలి.(ఆశిస్తే..DJ రిపిట్స్‌)

*రాబోతున్న మున్సిపల్,గ్రామపంచాయితీ,ఎన్నికల్లో పోటి చేయ్యం అని బహిరంగంగా ప్రకటించాలి.

(ఎన్నికల టైం వరకు చాలా జరుగుతాయ్‌,తర్వాత చూసుకోవచ్చు.,అది వేరే విషయం)

మిర్యాలగూడ సినియర్‌ పాత్రికేయ మిత్రుల ముచ్చట్ల హాస్య సారాంశం..

నాగార్జునసాగర్ నియోజక వర్గం లో* *విజయ సంకల్ప* *యాత్ర -2 కి ఘన స్వాగతం* పలికిన పెరిక కులస్తులు :

MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....

ఈ రోజు నాగార్జున సాగర్ నియోజక వర్గం లొకి రాగానే పెరిక కులస్తులు నిడమానూరు మండలం లో ఘన స్వాగతం పలికి, కాంగ్రెస్ పార్టీ కి ముక్త కంఠంతో మద్దతు తెలిపారు... అనంతరం ఇండ్ల కోటయ్య గుడెం పెరిక కులస్తుల తో సమావేశం నిర్వహించారు.....

ఈ సందర్భంగా వీరయ్య గారు మాట్లడుతూ పెరిక కులస్తుల దశాబ్దాల కలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేరికలకి అత్మ బందువు అయిందని అన్నారు .

 నల్లగొండ పార్లమెంట్ లో ఉన్న పెరిక కులస్తులు దాదాపు 80 వేల ఓట్లు కాంగ్రెస్ కీ మద్దతు తెలిపి కుందూరు రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి అన్నారు.

  ఈ కార్యక్రమం లో పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అద్యక్షుడు కోట మల్లికార్జున్ రావ్ గారు, మాజీ ఎంపీపీ, పెరిక కుల సంఘం రాష్ట్ర నాయకులు అంకతి వెంకట్ రమణ, నిడమానూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & పెరిక కుల సంఘం నియోజక వర్గ ఇంఛార్జి అంకతి సత్యం, కుల పెద్దలు అంకతి కృష్ణయ్య, పోకల కృష్ణయ్య, కుల సంఘం మండల అద్యక్షులు ఇండ్ల సత్యం, నాగేశ్వర్ రావు, ఆంకతి వేంకటేశ్వర్లు, బాల్తూసైదయ్య, ఇండ్ల వెంకటయ్య, జానకి రాములు, రాము తో పాటు పెద్ద ఎత్తున కుల కుటుంబీకులు పాల్గొన్నారు.