TG: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.
వాస్తవానికి నేటితో ఈ గడువు ముగియగా.. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాళాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా టీఎస్‌బీఐఈ ఖాతాకు అదే తేదీలోగా ఫీజులు చెల్లించాలని సూచించింది.
తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం గం. 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం గం. 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.



చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. 138 వ మేడే దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు.
NLG: కార్మికులు తమ రక్తం దారపోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని, కార్మికులకు అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడ మండల కేంద్రంలో మే డే సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరించి మాట్లాడారు.



May 03 2024, 20:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k