NLG: ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు
నల్గొండ: పట్టణ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి లతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .
SB NEWS NLG




చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. 138 వ మేడే దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు.
NLG: కార్మికులు తమ రక్తం దారపోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని, కార్మికులకు అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడ మండల కేంద్రంలో మే డే సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరించి మాట్లాడారు.





May 03 2024, 08:20
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.2k