చౌటుప్పల్ లో సమాచార హక్కు చట్టం - 2005 అవగాహన సదస్సులో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ....

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమాచార హక్కు చట్టం సంబంధించిన అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.సమాచార హక్కు చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినది.ఈ చట్టాన్ని కాపాడాలని మార్గదర్శకం తో ప్రభుత్వం నడవాలని మీరందరూ ఒక సమిష్టిగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు.గత పది సంవత్సరాలుగా భారతదేశంలో గానీ మన రాష్ట్రంలో చీకటి జీవోలను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన జీవోలు ప్రజలకు తెలవకుండా అధికారాన్ని చలాయించి లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై మోపారు.. సమాజం కోసం మంచి చేయాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆర్టిఐ సభ్యులకు ధన్యవాదాలు. స్వచ్ఛందంగా ప్రజలకు మంచి జరగాలని మార్గదర్శకంగా ప్రభుత్వాలు పనిచేయాలని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి విధంగా ఉండకుండా ప్రజలు అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి అని తెలిపారు.ప్రతి జీవోను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వాస్తవాలను తెలిసే విధంగా ఉండాలి అని,గతంలో కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని  ప్రవేశపెట్టిందని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచారం చైర్మన్ డా.వర్రె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న "కమలం "నాగారం లో ఇంటింటికి,విస్తృత ప్రచారం

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నాగారం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ద్వారా పాట్లమెంట్ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ క్షేత్ర స్థాయిలో అందుతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,మాజీ మండల అద్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్,జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్ ,మహిళా మౌర్చ కార్యదర్శి మందుల లక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శులు మారోజూ అనిల్ కుమార్, లోడే లింగ స్వామి,మండల ఉపాధ్యక్షులు గంగదారి దయాకర్,మండల కోశాధికారి అప్పి శెట్టి సంతోష్,మండల కార్యదర్శి మందుల నాగరాజు , ఓబీసీ మోర్చ మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేష్, BJYM మండల అద్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,పోలు నాగయ్య,డాక్టర్ లక్ష్మణ్, బూత్ అద్యక్షులు కట్ట బిక్షం, పుండరీకం ,బర్ల మల్లేశం మండలూజు శ్రీనివాస్ చారి బర్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మోడీ, అమిత్ షా తాటాకు చప్పుల్లకు రేవంత్ రెడ్డి భయపడడు: అతహర్


ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఢిల్లీ కు రావాలని నోటీసులు ఇవ్వడం పై కాంగ్రెస్ నాయకులు అతహర్ మండిపడ్డారు. ఈ సందర్బంగా అతహర్ మీడియా తో మాట్లాడుతూ మొన్నటి వరకు అమిత్ షా, మోడీ లు ఈడి, సిబిఐ లతో ముఖ్యమంత్రులను బయపెట్టాలని చూశారని నేడు ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు పంపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నోటీసులు ఇస్తే ఇక్కడ భయపడే వారు ఎవ్వరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆటలు ఇక కేవలం నెల రోజులు మాత్రమేనని జూన్ 4 వ తేది రోజు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ లో బిఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రం లో బీజేపీ కి పట్టడం ఖాయం అని అన్నారు. సెమిఫైనల్ లో కెసిఆర్ ను ఓడించి గద్దె దించింది కాంగ్రెస్ పార్టీ అని ఫైనల్ లో మోడీ ని కూడా గద్దె దించేది కూడా కాంగ్రెస్ పార్టీ నే అని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమికి ఎదురు గాలి వీస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పడం తో మోడీ, అమిత్ షా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ గెలవడం ఖాయం అని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి వరికుప్పల కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి: తెలంగాణ మైనార్టీ సంఘం సభ్యులు ఖాజా రఫీ హుద్దిన్


భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అవినీతిని అంతా అంతం చేయాలంటే భువనగిరి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వరికుప్పల కృష్ణ ను పడవ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ మైనారిటీ సంఘం సభ్యులు ఖాజా రఫి హుద్దీన్ అన్నారు. బుధవారం రోజున హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరికుప్పల కృష్ణ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని బూర్జువా పార్టీలు ప్రజలకు డబ్బు మద్యం మభ్యపెట్టి మోసం చేస్తున్నాయన్నారు. ప్రజల మనసు మీదికి వచ్చిందంటే ఎలాంటి నాయకుడినైనా ఓడించే సత్తా ఉందని గుర్తుచేశారు. పార్లమెంటు అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని గుర్తించి ఓటు వేయాలన్నారు. గతంలో ఎంపీగా వ్యవహరించిన ఏ నాయకుడు పార్లమెంటును ఉదరించింది లేదని ఎద్దేవ చేశారు. తనను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించినట్లయితే పార్లమెంటుకు పూర్తిస్థాయిలో అభివృద్ధికి పాటుపడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని శబదం చేశారు. తమ దగ్గర డబ్బు లేకపోయినా అభివృద్ధి సహాయం చేసే మనసు నిండుగా ఉందన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన సమయంలో తమను ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరాత్రి కొమురమల్లు తదితరులు పాల్గొన్నారు.

నాటి అమరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై పోరాడుదాం :సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ


  నాటి అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఐక్యంగా కార్మికులు, కర్షకులు , ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, కృష్ణాపురం, పెంచికల్ పహాడ్, హన్మాపురం, వడపర్తి, నందనం, నమాతుపల్లి గ్రామాలలో మేడే సందర్భంగా ఆయా గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేసినారు.ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ అనేకమంది కార్మికులు కర్షకులు సమస్త ప్రజలు తమ హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం, శ్రమకు తగ్గ వేతనం కోసం సమరశీల పోరాటాలు నడిపి తమ ప్రాణాలర్పించి తమ హక్కులను సాధించుకున్న రోజే మేడే అని ఈ మేడే స్ఫూర్తితో భారత దేశంలో పరిపాలన చేస్తున్న మతోన్మాద బీజేపీ ఆనాటి కార్మిక హక్కులను చట్టాలను కాలరాయాలను చూస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నా. బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని వర్గాల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడ్డి దారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ వారికి ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. మరోపక్క ప్రజల పైన అనేక భారాలు మోపుతూ కులం పేరుతో మతం పేరుతో విభజన చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఇలాంటి దుర్మార్గము బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధమై ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి వామపక్షాలను, ప్రజాతంత్ర వాదుల గెలిపించాలని, భువనగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, అన్నంపట్ల కృష్ణ, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరి ఎల్లయ్య, పాండాల మైసయ్య,మోటే ఎల్లయ్య , ఎల్లంల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ఆయా గ్రామాలకు సంబంధించిన శాఖా కార్యదర్శులు పార్టీ సభ్యులు కూకుట్ల కృష్ణ, ఉడత విష్ణు, మధ్యపురం బాల్ నరసింహ, ఉడత వెంకటేష్, మచ్చ భాస్కర్, ఎంఏ. రహిమాన్, ముదిగొండ కృష్ణ, కాసారం మల్లయ్య, సుబ్బురు పోశయ్య తదితరులు పాల్గొన్నారు.

         

అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి: బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బెందర్


బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బేందర్ భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్మికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ ను ఈదేశంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని,సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్,చిట్యాల ఐలమ్మ,దొడ్డి కొమరయ్య,బెల్లి లలిత స్ఫూర్తితో రాజకీయల్లోకి వచ్చానని,నిరుద్యోగ సమస్యలు,కాలుష్యం కోరల్లో నియోజకవర్గం కొట్టుమీట్టుడుతుందని,అన్ని రంగాల్లో వెనకబాటుకు గత పాలకులు కారణం అయ్యారని,కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని మార్చి,మనువాదాన్ని అమలు చేస్తారని ప్రజలు ఆలోచించాలని కోరారు,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీల పేరుతో అమలు చేయడంలో విఫలం అయ్యారని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారాలని డిమాండ్ చేశారు,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అత్యుత్తమ పాలనను అందించారని,తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కనకుంట్ల పాండు, జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్,జిల్లా కోశాధికారి కొరబోయిన పాండు,ఆలేరు నియోజకవర్గం ఇంచార్జి గంధమల్ల లింగస్వామి,భువనగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బర్రె నగేష్,జిల్లా మహిళా నాయకురాలు బాకారం లావణ్య,సోషల్ మీడియా కన్వీనర్ చుక్క సుమన్, పోచంపల్లి మండల అధ్యక్షులు మీసాల సైదులు,తదితరులు పాల్గొన్నారు.

అరూరు గ్రామంలో ఇంటింటికి బిజెపి ప్రచారం


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కోరిన అతహర్


మే 27వ తేది న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలలో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న కు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రయివేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగణబోయిన మల్లేశం ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యావేత్త మహమ్మద్ అతహర్. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం లో ప్రజలను, విద్యావంతులను, విద్యార్థులను చైతన్య పరిచిన యువ నాయకుడు తీన్మార్ మల్లన్న అని అలాంటి వారిని చట్ట సభల్లోకి పంపవలసిన భాద్యత మనందరి పై ఉందని అన్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా కు చెందిన వాడు కావడం భువనగిరి లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాల లో చదువుకోవడం వలన ఇక్కడి ప్రజలతో మంచి సంభంధాలు ఉన్నాయని అన్నారు. ప్రతీ ఒక్క పట్టభద్రుడు తమ విధిగా తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

పది ఫలితాలలో పవిత్రాత్మ విద్యార్థుల ప్రభంజనం, 10 GPA సాధించిన పొట్టి పల్లి గీతిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పొట్టిపల్లి గీతిక పదికి పది పాయింట్లు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం నిలిచి పాఠశాల ఘనతను చాటి చూపించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ జయంతి మాట్లాడుతూ కష్టపడి చదివితే వారికి ఫలితం ఎక్కడ పోదని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేస్తూ పాఠశాల కీర్తిని చాటినందులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, గీతిక తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పాండు, బాల శౌరి ,వెంకటేశం, మిల్క్ రాజ్, ఉమాదేవి, పద్మ ,సుందరి, కల్పన తదితరులు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన పోరాడే సిపిఎం ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు


అవినీతికర బిజెపిని అవకాశవాద కాంగ్రెస్, బిఆర్ఎస్ ఓడించి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం గెలిపించండి

    - సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు*

     అవినీతిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న బిజెపిని, అవకాశవాద కాంగ్రెస్, బిఆర్ఎస్ లను ఓడించి ప్రజల పక్షాన పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జాహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ అవినీతిపై పోరాటం చేస్తానన్న మోడీ ఇప్పుడు దేశంలో అత్యంత అవినీతి పార్టీగా బిజెపిని మార్చాడని విమర్శించారు. పైలెట్ జెట్ విమానాల కొనుగోలు, మైనింగ్ లీజు, ఎలెక్టోరల్ బాండ్స్ పేరుతో వేలకోట్ల దందా నడిపి కోట్లాది రూపాయలు కూడేసుకుని అవినీతినే బిజెపి చట్టబద్ధత చేసి లక్షల కోట్ల రూపాయలలో అవినీతికి పాల్పడిందని విమర్శించారు. మరోపక్క కార్పొరేట్ శక్తులకు, అవినీతిపరులకు మొత్తం ప్రభుత్వ రంగాన్ని దారా దత్తం చేశారని ఆవేదన వెలుబు ఇచ్చారు. దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల పైన మహిళల పైన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ, నిత్యవసర ధరలు పెంచడం లాంటివి బిజెపి పాలనలో పెరిగిపోయాయి అని అన్నా. మరో మారు దేశంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వత్వం పెరుగుతుందని, రాజ్యాంగం, రిజర్వేషన్లు లేకుండా చేస్తారని అందుకే ఓటుతో బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హక్కులను అమలు చేయాలని, సాగు తాగునీరు అందించాలని, విద్యా, వైద్యము అందరికి అందాలని పోరాడుతున్న సిపిఎం సిపిఎం తరఫున పోటీ చేస్తున్న ఎండి. జహంగీర్ గారిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి గెలిపించాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ పాల్గొని మాట్లాడగా ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరి ఎల్లయ్య, ఎల్లముల వెంకటేష్, పాండాల మైసయ్య, కొండాపురం యాదగిరి, జిట్టా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.