NLG: పోలింగ్ సిబ్బంది కి శిక్షణ తరగతులు
నల్గొండ పార్లమెంటు ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుండి 4 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.
పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ ఉత్తర్వులను మే ఒకటి నాటికి సంబంధిత అధికారులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
రెండో విడత శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రెండు విడతల శిక్షణ కార్యక్రమాలు వారికి విధులు కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.









May 01 2024, 18:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.8k