Mane Praveen

May 01 2024, 07:17

NLG: పోలింగ్ సిబ్బంది కి శిక్షణ తరగతులు

నల్గొండ పార్లమెంటు ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ, ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుండి 4 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. 

పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

 ఈ ఉత్తర్వులను మే ఒకటి నాటికి సంబంధిత అధికారులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

రెండో విడత శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రెండు విడతల శిక్షణ కార్యక్రమాలు వారికి విధులు కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. 

Mane Praveen

Apr 30 2024, 16:19

బిజెపితోనే అభివృద్ధి సాధ్యం: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

దేశం మరింత అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమవుతుందని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ, గుండాల మండలం, వంగాల గ్రామం 272 వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి మాట్లాడుతూ... వారసత్వ రాజకీయాలు అవినీతి పాల్పడే పార్టీలు ప్రజల అభివృద్ధి చేయలేవని, ప్రజలకు తెలియజేప్పుతూ మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు.మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు.

మరోసారి బిజెపిని గెలిపించి అభివృద్ధిని చేసే అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు సింగారం, గంగాపురం రమేష్, ఇమ్మడి నాగరాజు, ఆవుల సాయితేజ , కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 30 2024, 15:55

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో ఈ రోడ్ షో కార్యక్రమానికి జనం వచ్చారు. అశేష జనం ను చూసిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రావడం ఖాయం అని అన్నారు.

ఈ రోడ్ షో కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పున్నా కైలాస్ నేత, నియోజకవర్గం కోఆర్డినేటర్ బొజ్జ సంధ్యా రెడ్డి, సిపిఐ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 30 2024, 11:33

NLG: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి సహకారంతో మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన, మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి విజేతగా నాంపల్లి టీం, 2వ విజేతగా పసునూరు టీం, 3వ విజేతగా మెల్లవాయి టీం గెలుపొందారు. 

గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతిగా రూ.20,116, ద్వితీయ బహుమతిగా రూ.15,166, తృతీయ బహుమతిగా రూ.7,166 లు మరియు షీల్డ్ లను ప్రధానోత్సవం చేశారు. 

ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ... యువత క్రీడారంగంలో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి ,మండల నాయకులు గెల్వాల్ రెడ్డి, క్రీడాకారులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 29 2024, 22:02

NLG: హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరం

నల్లగొండ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మేకల అవుట్డోర్ స్టేడియంలో ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొండ విజయకుమార్ విచ్చేసి క్రీడాకారులకు హాకీ స్టిక్స్, బాల్స్, క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా హాకీ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుందని, తద్వారా 18 మంది జాతీయస్థాయి క్రీడాకారులు తయారయ్యారని కితాబు ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కూతురు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

నల్లగొండ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం మాట్లాడుతూ.. జిల్లాకు 2 ఖేలో ఇండియా హాకీ సెంటర్లు కేటాయించడం అనేది జిల్లా అదృష్టమన్నారు.

నల్లగొండ హాకీ అసోసియేషన్ చైర్మన్ కూతురు లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసచారి, ఫరూక్, యావర్, అజిత్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 29 2024, 20:31

కాంగ్రెస్ పార్టీ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ,తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన అమిత్ రెడ్డి ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 29 2024, 20:15

NLG: నాంపల్లి మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

నాంపల్లి: మండలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. 

మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ మరియు నాంపల్లి మండల ఇన్చార్జ్ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలను నాంపల్లి మండలం నుంచి మంచి మెజార్టీ సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, కుంభం కృష్ణారెడ్డి, మండల వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న రజిని, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము బిక్షం, ఎస్కే గఫర్, నాంపల్లి మండల టౌన్ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య గౌడ్, సుంకిశాల మాజీ సర్పంచ్ కలకొండ దుర్గయ్య, గాదేపాక రాజు, పూల యాదగిరి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ కాంశెట్టి యాదయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని గ్రామాల సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 28 2024, 13:25

TG: ఏప్రిల్ 30న పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు. 

తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమైంది.రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాశాఖ దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో ఎగ్జామ్స్ నిర్వహించింది.

అక్కడక్కడా కొన్ని మాల్‌ ప్రాక్టీసింగ్ సంఘటనలు చవిచూసినటప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా సజావుగా పరీక్షలను నిర్వహించారు. పదో తరగతి ఫలితాలు విడుదలైన మరుక్షణం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 28 2024, 11:35

NLG: మర్రిగూడ మండలంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నాయకులు.

పార్లమెంటు ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి , నిర్వీర్యం చేసే పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుపాలడుగు నాగార్జున అన్నారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెట్టిందని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని ఆరోపించారు. తీవ్రమైన నిర్లక్ష్యం వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ ఆధానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు. 

ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ రెండు లక్షలు చేయాలని ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి జహంగీర్ అని అన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య,బుర్రి పెంటయ్య, లక్షమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 27 2024, 20:02

మేడే ను జయప్రదం చేయండి: పల్లా దేవేందర్ రెడ్డి

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. 138వ మేడే దినోత్సవం సందర్బంగా ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యలయం లో గోడ పత్రికలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలిపారు.

1886 వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటంలో, కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జండాలను సృష్టించుకున్నారని, కేవలం ఎర్రజెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటీయూసీ ద్వారానే ఎర్రజెండా వచ్చిందన్నారు.

104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకులు, కమ్యూనిస్టు నేత సింగారవేలిశెట్టి ఆర్ 1923వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఎగరవేశారన్నారు.

తాడిత పీడత అనగారిన వర్గాల శ్రేయసు కై పోరాడేది కేవలం ఎర్రజెండా నేనన్నారు. కార్మికుల సంక్షేమం కొరకు జరిగే పోరాటానికి ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఆంక్షలు పెట్టకూడదని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. మే డే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకై పోరాడరని ఆయన ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, లెనిన్, గుండె రవి, జానీ, యూసఫ్, మదార్ దస్తగిరి, బుర్రి రాములు, యాదయ్య, నాగరాజు, కొండ రాములు, రాజు, తదితరులు పాల్గొన్నారు.