సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజాబలమే అండ.. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు
◆ బ్రహ్మరథం పట్టిన ప్రజలు
ప్రతి కుటుంబానికి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించి, అధికారంలోకి తీసుకురావాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, చెన్నంపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో, శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.
ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న జనం మెచ్చిన నాయకుడని, మళ్లీ ఆశీర్వదించి, గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. టిడిపి నాయకుల మాయమాటలు విని మోసపోవద్దని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవమంటూ రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు దాదాగిరి చేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు నామరూపాల్లేకుండా పోతాయని, పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని వివరించారు. అదే జగనన్న అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు పార్టీలకతీతంగా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తు చేశారు. జగనన్న చెప్పాడు అంటే చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అదే చంద్రబాబు నాయుడు చేయాడు అనే విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసున్నారు.
జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేస్తారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 29 2024, 07:02