పథకాల అమలు కోసం "ఫ్యాన్" గుర్తుకే ఓటు.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
పథకాల అమలు కోసం "ఫ్యాన్" గుర్తుకే ఓటు.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ టీడీపీ హయాంలో కరువు కాటకాలే
కుల, మత, రాజకీయాలకతీతంగా పేదలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాల అమలు అవుతాయని శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరు, పొడరాళ్ళ, వడియంపేట, బి.కొత్తపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా "కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన చేపట్టారు.
గ్రామాల్లో మహిళలు హారతులు పడుతూ, డప్పులతో డాన్సులు వేస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఓటర్లని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఓటు వేస్తే మన పిల్లలకు అందుతున్న ప్రతి లబ్ధి నిలిచిపోతుందన్నారు. బాబుకు ఓటు వేస్తే అన్నీ ముగింపులు, కత్తిరింపులేనని హెచ్చరించారు. ఓటు వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మలకు మేలు చేసే రాజ్యం కొనసాగుతుందన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న సీఎం జగనన్నకు మద్దతుగా నిలుస్తూ.. చంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలన్నారు.
నియోజకవర్గంలో ఐదేళ్లలో కనిపించని టిడిపి వాళ్ళు ఎన్నికల సమయానికి ఓటు అడగడానికి వస్తున్నారని వారికి ఓటు రూపంలో గుణపాఠం చెప్పాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎంపీ శంకర్ నారాయణ ను ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 26 2024, 08:37