NLG: పేదింటి బిడ్డ పెళ్లికి సాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం, మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు చంద్రయ్య అంధుడు మరియు పేదరికంలో ఉన్నాడు. ఆయన చిన్న కూతురు వివాహానికి ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రూ.10,000 ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ సందర్బంగా ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ పేదలకు సహాయాన్ని అందిస్తుందని, ఆకలితో ఉన్న వారికి అండగా ఉంటుందని, ఎవరికి సహాయం కావాలన్నా తమ ఫౌండేషన్ ను సంప్రదించాలని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: లెంకలపల్లి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

నల్లగొండ జిల్లా: మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర ను దేవాలయం నుండి ప్రారంభించి గ్రామంలో ఊరేగింపు గా బయలుదేరి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

13-14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ:13,14 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ.. రేపు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

కెసిఆర్ నల్లగొండ జిల్లాను నాశనం చేశారని,కేసీఆర్ వల్లనే జిల్లాకి కరువు వచ్చిందని,నీటి జలాలు పంపకంలో జగన్,కేసీఆర్ లాలూచీ పడ్డారని మండి పడ్డారు.భారాస ఒక్క సీట్ కూడా గెలవదని జోష్యం చెప్పారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి

బిజెపి నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

నల్లగొండలో ఏర్పాటుచేసిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బిజెపి గెలిస్తే నల్లగొండలో ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

TG: నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: CS శాంతి కుమారి

HYD: వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు.

సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సిజిఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. CGMలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు.

అదే విధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.

సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

SB NEWS TELANGANA

NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన సిపిఎం మండల కార్యదర్శి

మర్రిగూడ మండల కేంద్రంలో, సిపిఎం అభ్యర్థి ఎం.డి జహంగీర్ గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, మంగళవారం సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రచారం నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాద రాజకీయ నాయకులను, దేశ విచ్ఛిన్నకర శక్తులను, రాజకీయ వ్యాపారస్తులను ఓడించాలని, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని యాదయ్య కోరారు. నక్క సిరియాల, పల్లెటి లోకేష్, దుబ్బ ఎల్లెష్ తదితరులు ఉన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: నామినేషన్ వేసిన బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి

నల్లగొండ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన నామినేషన్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కుమార్, కటికం సత్తయ్య గౌడ్, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలిరండి: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రేపటి నామినేషన్ కార్యక్రమానికి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. భువనగిరి కోట మీద ఎగిరేది బిజెపి జెండానే అని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్. జయశంకర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా నుండి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

మే' డే ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ

138వ 'మే' డే ను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారము నల్లగొండ లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం లో మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సయీద్ , సుమతమ్మ, దోటీ వెంకన్న, కొశాదికారి వెంకన్న జిల్లా నాయకులు జానీ, శంకర్,గుండె రవి, వెంకట్ రాములు, కోట్ల శోభ, లెనిన్, మల్లయ్య , నీల వెంకటయ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు.

వివరాలు ఇలా.. మునగాల మండలం, ముకుందపురం వద్ద ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసు కెల్లడం తో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

SB NEWS TELANGANA

SB NEWS SRPT