Venkatesh1

Apr 06 2024, 06:44

గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్సిపి పాలన.. ఆ.. గ్రామంలో పల్లె నిద్ర చేసిన..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్సిపి పాలన

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పాలన సాగుతోందని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారం అనంతరం సిరివరం గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు.

ఎస్సీ కాలనీలో స్థానికులతో మమేకమౌతూ వారితో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న ,సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పరిపాలనలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ను వాడుకొని ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత కరెంట్ అందిస్తున్నారని, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు.

అనంతరం కాలనీలో బస చేశారు.

Venkatesh1

Apr 06 2024, 06:37

సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల..

సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పాలన ఇలానే కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ సిహెచ్ ప్రమీల అన్నారు.

శింగనమల మండలం లోలూరు, ఆకులేడు, మదిరేపల్లి, నాగులగుడ్డం, తండా, చిన్న జలాలపురం గ్రామాల్లో వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆమె చేపట్టారు.

ఇంటింటికీ తిరుగుతూ సీఎం జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన భర్త వీరాంజనేయులు గెలిపించాలని ప్రజలను విన్నవించుకున్నారు.

ఆమె మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న గత చరిత్రలో ఎన్నడలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. గత టిడిపి పరిపాలనలో ప్రజలకు ఏమి చేయలేక ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అనంతపురం పార్లమెంట్ శంకర్ నారాయణను, అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న వీరాంజనేయులును అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

Venkatesh1

Apr 06 2024, 06:30

దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే.. లోకలైజేషన్ అంటే ఏమిటో తెలుసుకోండి.. అర్థం లేని ఆరోపణలు చేయటం మానుకోండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే.. లోకలైజేషన్ అంటే ఏమిటో తెలుసుకోండి.. అర్థం లేని ఆరోపణలు చేయటం మానుకోండి.

◆ జియోకు....జీవో కు తేడా తెలుసుకోండి

◆ మరోసారి ప్రజలు టిడిపిని ఇంటికి పంపడం గ్యారెంటీ

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి ఎన్నో దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదని వీటికి సహకరించి పట్టుబట్టి రైతన్నల కలను సహకారం చేసిన ఘనత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దక్కుతుందని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం ఇల్లూరు,ముంటిమడుగు, ఎం.కొత్తూరు, ఎం.కొత్తపల్లి, రాందాసుపేట, అంకంపేట, సిరివరం, గుడ్డాలపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, మాజీ ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులతో కలసి ఆయన నిర్వహించారు.

గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్దిని ఆయా కుటుంబాలకు వివరించారు.  జగనన్న ఇంటి దగ్గరికి అన్ని పథకాలు అందిస్తున్నారని ఇలానే ఈ పథకాలు ఇంటి దగ్గరకు రావాలి అంటే మరోసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని మీ ఓటును " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి రైతన్నల కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగనన్నకు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి రైతన్నలు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ అభ్యర్థి అర్థం లేని ఆరోపణలు చేస్తూ జియోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కుల,మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారో లేదో గ్రామాల్లోకి వెళ్లి అనగాలని సూచించారు.

2014 నుంచి 2019 వరకు ప్రజలు టిడిపి పరిపాలన చూసి విసుగు చెంది 2019లో ఇంటికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టిడిపిని ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగనన్నకు దక్కుతుందన్న విషయాన్ని వారికి గుర్తు చేశారు. ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడడం మంచిదన్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న కూర్చోవడం ఖాయమని, శింగనమలలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 05 2024, 07:13

శైలజనాథ్ వస్తేనే నియోజకవర్గ అభివృద్ధి... మండల కన్వీనర్ మాడిశెట్టి సురేష్...

సింగనమల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరొకసారి మా ప్రియతమ నేత డాక్టర్ సాకే శైలజానాథ్ ని ....

 ఎమ్మెల్యే చేసుకుందాం...

 శైలజనాథ్ వస్తేనే నియోజకవర్గ అభివృద్ధి...

 మండల కన్వీనర్ మాడిశెట్టి సురేష్...

 బుక్కరాయసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మాడిశెట్టి సురేష్ మాట్లాడుతూ సింగనమల నియోజవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎన్నో ప్రజా ఉపయోగ కరమైన పనులు చేసి సింగనమల అభివృద్ధి అంటేనే శైలజనాథ్ పేరు గుర్తుచే విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు.

మనకు హెచ్ ఎల్ సి కాలువ ద్వారా పంటకు సాగునీరు సకాలంలో రైతు కు అందింది అంటే అది శైలజానాథ్ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగినప్పుడు మాత్రమే జరిగింది. గత పది సంవత్సరాల నుండి రైతులకు సాగునీరు సకాలంలో అందిన పాపాన పోలేదు అలాగే శైలజనాథ్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప పది సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి కూడా సింగనమల నియోజవర్గ ప్రజలు చూడలేదు కావున

సింగనమల నియోజకవర్గం ప్రజలు అనేక అభివృద్ధి పనులు చేసి సింగనమల నియోజవర్గాన్నే రాష్ట్రానికి ఒక రోల్డ్ మోడల్ గా చేసిన శైలజనాథ కే మరలా మన ఓటు వేసి వేయించి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున సింగనమలనియోజవర్గంలో ఉన్న ప్రతి ఓటరు శైలజనాథ్ కి ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ బుక్కరాయసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మాడిశెట్టి సురేష్ తెలిపారు.

Venkatesh1

Apr 05 2024, 07:07

రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ని కలిసిన అనంతపురం ఉమ్మడి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు ఆలం నరసానాయుడు గారి నివాసం లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.* ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,అంబికా వీక్షిత్ గారు,రామ్మోహన్,ఇల్లూరు రామాంజనేయులు,లక్ష్మి నాయుడు,నాగభూషణ,వెంకట్,బాలకృష్ణ,వెంకటేష్,నాని,చెన్నమయ్య తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 05 2024, 06:59

బండారు శ్రావణి శ్రీ గారి నివాసంలో అనంతపురం పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ

శింగనమల టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి అయిన బండారు శ్రావణి శ్రీ గారి నివాసంలో అనంతపురం పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారిని శ్రావణి శ్రీ గారు వారి కుటుంబ సభ్యులు దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించడం జరిగింది..

Venkatesh1

Apr 05 2024, 06:49

వీరాంజనేయులును గెలిపించండి.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రమీల..

వీరాంజనేయులును గెలిపించండి.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రమీల..

ముఖ్యమంత్రి వైయస్ జగనన్న ఆశీస్సులతో ప్రజల ముందుకు వస్తున్న తన భర్త వీరాంజనేయులును ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ సిహెచ్ ప్రమీల ఓటర్లను అభ్యర్థించారు.

బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి, కొత్త చెదళ్ల, రోటరీపురం గ్రామాలలో వైయస్సార్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు.

ముందుగా నీలాంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజ నిర్వహించారు. 

ఇంటింటా తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, రానున్న ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా మరోసారి జగనన్న చేసుకుంటే సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతాయని, పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆమె అన్నారు.

Venkatesh1

Apr 05 2024, 06:42

అండగా నిలబడదాం.. మెజార్టీతో గెలిపిద్దాం.. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

అండగా నిలబడదాం.. మెజార్టీతో గెలిపిద్దాం.. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

బస్సు యాత్రలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో డ్రైవర్లతో సమావేశమైన జగనన్న మరోసారి వీరాంజనేయులు గురించి ప్రస్తావించారు. ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలన్నదే ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

జగనన్న దీవెనలతో ఎమ్మెల్యే 

అభ్యర్థిగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు కోరారు.

యల్లనూరు మండలం వేములపల్లి, నిట్టూరు, మేడికుర్తి, పెద్ద మల్లేపల్లి, పీఎం.కొండాపురం, తిరుమలాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి ఆయన నిర్వహించారు.

గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో అందిన లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించారు. పేదవాడిగా మీ ముందుకు వస్తున్నా, మీ సేవకుడిగా పని చేస్తాను, రానున్న ఎన్నికలలో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విన్నవించుకున్నారు.

ఎం. వీరాంజనేయులు మాట్లాడుతూ.. సీఎం జగనన్న చేసిన సంక్షేమ పాలన ముందు ఎన్ని పార్టీల కలయికతో చంద్రబాబు నాయుడు కలసి వచ్చినా టీడీపీకి ఓటమి తప్పదన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఒక్కరోజైనా పేదల కోసం ఆలోచన చేయలేదన్నారు. ఆరువందల హామీలిచ్చి వాటిని గాలికొదిలేసారని, మహిళలకు చంద్రబాబు ఎగ్గొట్టిన సున్నా వడ్డీ, రుణమాఫీ వంటి బకాయిలను జగనన్న తీర్చారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జగనన్న సంక్షేమాభివృద్ధి పథంలో నడిపిస్తే టీడీపీ మాత్రం వారి జేబులు నింపుకున్నారన్నారు. గ్రామాల్లో అవ్వాతాతలకు ఇంటి దగ్గరకు పింఛన్లు ఇవ్వకుండా చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటు రూపంలో బుద్ధి చెబుతాం అంటున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగన్ ను చేసుకోవడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 04 2024, 07:58

మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిద్దాం.. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్ళీ గెలిపిద్దాం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిద్దాం

జగనన్న సీఎంగా ఉంటేనే సక్రమంగా పథకాలు

"ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్ళీ గెలిపిద్దాం

పొత్తులు పెట్టుకున్న పార్టీలను నమ్మొద్దు

శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని వీరాంజనేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పుట్లూరు మండలం కందిగోపుల, చింతకుంట, చాలవేముల, రంగరాజుకుంట, కుమ్మనమల, తురకవానిపల్లి, కొండగారికుంట, రంగినేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.

గ్రామాల్లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు ఇలానే సక్రమంగా అందుతాయని రానున్న ఎన్నికలలో మీ అందరి ఓటు "ఫ్యాన్" గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతినెల ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి అందించే పింఛన్ల పంపిణీని టిడిపి నేతలు అడ్డుకున్నారన్నారు. పేదల ఉసురు చంద్రబాబునాయుడుకు తగలకుండా మానదన్నారు. ఎన్నికలవేళ ప్రజలను మోసం చేయడానికి టిడిపి నేతలు ఇంటి దగ్గరికి వస్తున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మంచి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తమ ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటున్న వృద్ధులు

తెల్లవారుజామున నిద్రలేవక మునుపే ఇంటి దగ్గరే కుటుంబ పింఛన్ అందిస్తూ వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన తమ మనవడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గెలవలేరన్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న తమలాంటి వృద్ధుల కడుపు కొట్టిన చంద్రబాబుకు మా ఉసురు తప్పకుండా తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 03 2024, 10:45

ముంటి మడుగు కేశవరెడ్డి కాట్టప్ప గారి రామలింగారెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలని కోరిన MP అభ్యర్థి

అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారి నివాసం లో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారిని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలి అని కోరిన అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ గారు*