పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా రక్తదాన శిబిరం పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా రక్తదాన శిబిరం
పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లా :- ఏప్రిల్ మాసం మహానీయుల మాసంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తుందని పూలే అంబేడ్కర్ జన జాతర సందర్భంగా నల్లగొండ అంబేద్కర్ భవనంలో ఏప్రిల్ 13న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 11 మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో మండలాలు నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. మహానీయుల ఆశయాలను ఆదర్శ లను నేటి యువతకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. దళితుల సంక్షేమం కొరకు కృషి చేస్తూనే దళితులపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కెవిపిఎస్ పోరాడుతుందని తెలిపారు. పాలకులు మారిన ప్రభుత్వాలు మారినా దళితుల సంక్షేమం జీరో అన్నారు. నేటికి సంక్షేమ హాస్టల్స్ కి బిల్లులు చెల్లించలేదని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందడం లేదని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే స్థితి అసలే లేదని పేరుకే దళితుల సంక్షేమాన్ని కట్టుబడి ఉన్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలని సంక్షేమ పథకాలు గ్రీన్ ఛానల్ ద్వారా అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో దాడులు దౌర్జన్యాలకు గురైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన బాధితులకు కూడా కనీసం పరిహారం అందించడం లేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏమిటో చూడాలని అన్నారు. దేశంలో మత ఉన్మాదం పెరిగిపోతుందని భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు దాపరిoచాయని రిజర్వేషన్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి మొదలుకొని ఉపముఖ్యమంత్రి వరకు అవమానాలు ఎదురై ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు. దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తగు గుణపాఠం చెప్పాలని లౌకిక పార్టీలను గెలిపించాలని కెవిపిఎస్ సంఘం తీర్మానించిందని తెలిపారు. రక్తదాన శిబిరం ప్రారంభకులు డాక్టర్ ధరనీధర్ ప్రముఖ కార్డియో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్రం దళితుల స్థితిగతులు పైన సెమినారు నిర్వహిస్తున్నట్టు దీనికి ముఖ్యఅతిథిగా అంబటి నాగన్న హాజరవుతారని తెలిపారు. పెద్ద ఎత్తున దళిత గిరిజన మైనారిటీ బలహీనవర్గాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాదే నరసింహ బొల్లు రవీందర్ కుమార్ కోడి రెక్క మల్లయ్య ఒంటెపాక కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్యామ్ దొంతాల నాగార్జున దోరేపల్లి మల్లయ్య సోమలింగం నర్సింహా శైలజ బొడ్డు బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Apr 05 2024, 10:56