మూడు నెలలూ మండే ఎండలు

•ఏప్రిల్‌, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక

దిల్లీ: దేశంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది..

మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశముందన్నారు.

సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని, ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశముందని హెచ్చరించారు. గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మహాపాత్ర చెప్పారు..

'కాళేశ్వరం' దోషులెవరో తేల్చండి

•విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు ఇరిగేషన్‌ అధికారులు

బీఆర్‌కేఆర్‌ భవన్‌లో విచారణ కార్యాలయం ఏర్పాటు

విచారణ కమిటీ చైర్మన్‌ ఘోష్‌ను కలిసేందుకు కోల్‌కతాకు నీటిపారుదల శాఖ అధికారులు..

హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలు, అవకతవకలపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని జ్యుడిషీయల్‌ విచారణ కమిటీని కోరేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు మంగళవారం కోల్‌కతాలో కమిటీ చైర్మన్‌ అయిన జస్టిస్‌ పినాకి చంద్రఘో్‌షను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా నేతృత్వంలోని అఽధికారుల బృందం కలవనుంది.

ఇప్పటికే రాహుల్‌బొజ్జాతో పాటు ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్‌సీ (పీఅండ్‌ఎం) కె.శ్రీనివాస్‌ కోల్‌కతాకు చేరుకున్నారు. మంగళవారం అపాయింట్‌మెంట్‌ ఉండటంతో ఆయన్ను కలిసి, టీవోఆర్‌ అందించి, కేసును వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్‌కేఆర్‌)లో విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు అంశాల ఆధారంగా విచారణ జరిపి, దోషులెవరో గుర్తించి, జూన్‌ 30లోపు నివేదిక అందించాలని ఘోష్‌ను అధికారులు కోరనున్నారు.

ఆ ఏడు అంశాలేంటంటే...

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్‌, డిజైనింగ్‌లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలి

కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు కారకులను గుర్తించాలి

3 బ్యారేజీల్లో ఆపరేషన్‌ మెయింటెన్స్‌లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలను తేల్చాలి

క్వాలిటీ కంట్రోల్‌, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై విచారణ జరపాలి

నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైమ్‌-ఈవోటీ), పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తించాలి

కోరిన అన్ని అంశాల్లో బాధ్యులను గుర్తించడం, దానివల్ల ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను నిగ్గుతేల్చాలి

ఇంకా ఇతర ఏమైనా అంశాలు ప్రభుత్వం సిఫారసు చేస్తే.. వాటిపై విచారణ చేయాలి..

కడప బరిలోనే షర్మిల

5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌

నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటన

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..

రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను మంగళవారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు.

సీఈసీ సమావేశం సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ ఎస్టీఎస్టీసెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, షర్మిల పాల్గొన్నారు.

మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సందర్భంగా చర్చించారు. కడప ఎంపీ స్థానంలో షర్మిల, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, విశాఖ-సత్యారెడ్డి, కాకినాడ-ఎంఎం పళ్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు తెలిసింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని సమాచారం. కమ్యూనిస్టు పార్టీలతో సర్దుబాటు నేపథ్యంలో మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ తొలి జాబితా ప్రకటన కోసం షర్మిల మంగళవారం కడప జిల్లాకు వెళ్తున్నారు..

కవిత కోరుకున్న సౌకర్యాలు కల్పించండి: అవెన్యూ కోర్టు

తిహాద్ జైల్లో బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అవస రమైన సౌకర్యాలు కల్పిం చాలని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారుల ను ఆదేశించింది.

కొన్ని వస్తువులను స్వయం గా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమా ల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్‌ చేసుకునేందు కు, ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకు నేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లుకు అనుమతించా లని న్యాయస్థానం ఆదేశిం చింది.

మార్చి 26న ఇచ్చిన ఉత్త ర్వుల్లో ఏ ఒక్కటీ అనుమ తించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నిం టినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్‌ న్యాయ స్థానానికి తెలిపారు.

దీనిపై స్పందించిన రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

నేడు బండిసంజయ్ రైతు దీక్ష

ఇవాళ బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేయ నున్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టను న్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన‎ హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో దీక్ష చేయనున్నారు.

అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందిం చకపోవడంపై బండిసంజ య్ ‘రైతు దీక్ష’ చేపట్టను న్నారు.

2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల నే డిమాండ్ తో దీక్ష చేపట్ట నున్నారు.. బండి సంజయ్. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ కోరారు..

Streetbuzz News

అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్‌ అధికారి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి కోత అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

రాష్ట్ర 51వ సీఎస్‌గా ఆయ న బాధ్యతలు నిర్వర్తించను న్నారు. 1993వ బ్యాచ్‌ అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన రవి ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు.

పబన్‌కుమార్‌ బోర్తకుర్‌ రిటైర్ కావడంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు తీసుకున్నారు. 1966 ఏప్రిల్‌ 12న రవి జన్మించారు. 30 ఏళ్ల సర్వీసులో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు హోదాల్లో బాధ్య తలు నిర్వర్తించారు.

అమెరికా రాజధాని వాషిం గ్టన్‌ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయం ఆర్థిక విభాగ హెచ్‌డ్‌గా కూడా పనిచేశారు. భార త్‌-అమెరికా దౌత్య సంబం ధాలు, భాగస్వామ్యంపై విస్తృతంగా పనిచేశారు.

15వ ఆర్థిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి కమిషన్‌కు కీలకమైన రిపోర్ట్ అందజేశారు. పబ్లిక్‌ఫైనాన్స్‌, మాక్రో ఎకనామిక్స్‌ విధా నాల రూపకల్పనలోనూ ఆయన కీలకంగా వ్యవ హరించారు.

కాగా అసోం సీఎస్‌గా బాధ్య తలు స్వీకరించిన తొలి డాక్ట రేట్‌ రవి కావడం విశేషం. సీఎస్‌ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ కూడా ఆయనే నిర్వహిం చనున్నారు...

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య?

ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించి నా.. పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ నేతలు, కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బోర్డు సోమవా రం రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 9 అభ్యర్థుల జాబితాలను విడుదల చేయగా, ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ను తాజాగా ప్రకటించింది.

మహారాష్ట్రలోని అకోలా నుంచి అభ్యర్థిగా డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిం చింది.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు..

వాఖండే స్టేడియంలో ముంబైని చిత్తుగా ఓడించిన రాజస్థాన్

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ వరుస విజయాలతో జోరు కనిపిస్తోంది. నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్‌లో రాజ స్థాన్ విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియం లో జరిగిన మ్యాచ్‌లో ముం బైని చిత్తుగా ఓడించింది… పాయింట్స్ టేబుల్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్125 తక్కువ పరుగులకే పరిమి తం చేసిన రాజస్థాన్…ఛేద నలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో మరోసారి మెరిశాడు. దీంతో నిర్ధిష్ట లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేధించిన రాజస్థాన్.. ముంబైపై విజయం సాధించింది.

అయితే రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు నిల కడగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకె ళ్లారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), జోస్ బట్లర్ (13), శాంసన్ (12) పేలవ ఫామ్‌తో నిరాశపరిచారు.

రియాన్ పరాగ్ 54 నాటౌట్ తో ఆకట్టుకున్నాడు. రవిచం ద్రన్ అశ్విన్ (16) ర్యాన్ పరాగ్ కు మద్దతుగా నిలిచి పరుగులు సాధించాడు. ఇక ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయగా.. క్వేనా మఫాకా ఒక్క వికెట్ దక్కించుకుంది..

కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషి యల్ కస్టడీ విధించింది కోర్టు.

ఇవాళ ఈడీ కస్టడీ ముగి యడంతో రౌజ్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశ పెట్టారు.అధికారులు.

కేజ్రీ వాల్ విచారణకు స‍హకరిం చడంలేదని, దర్యాప్తును తప్పుదోవప ట్టిస్తున్నారని ఈడీ న్యాయ వాదులు కోర్టుకు తెలిపారు.

జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈడీ వాదనలను పరిగణలోని తీసుకున్న కోర్టు ఆయనకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

వాత పెట్టిన వాగ్దానం మారలేదు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచేందుకు అనేక హామీలు ఇస్తుండ‌టం స‌హ‌జం .. అయితే ఓ క్యాండిడేట్ ఎన్నిక‌ల వాగ్ధానాల‌లో కాస్త కిక్కు ఇచ్చింది

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేస్తున్న వ‌నితా రౌత్ పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని హామీలు ఇచ్చేసింది.

ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్‌ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది. ముందుగా ఈ షాపుల‌లో ప్రీగా మందు అందిస్తానని వాగ్దానం చేసేసింది.

ఇండియ‌న్ లిక్క‌ర్ కాకుండా విదేశీ మద్యం అందుబాటు లో ఉంచుతాన‌ని ఘంటా ప‌ధంగా చెపుతున్న‌ది.. దీంతో ఆమె ప్రచారానికి జ‌నాలు పోటేత్తుతున్నారు.

తాగేందుకూ లైసెన్స్….

అయితే ఈ స్కీమ్‌ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్‌ ఉండాల్సిందే నన్న కండీషన్‌ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడ మని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్‌ వారికి అవసరమని సమర్థించు కుంటోంది.

పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది.

గ‌త ఎన్నిక‌లో ఇదే వాగ్ధానం… వాత‌పెట్టిన ఎన్నిక‌ల సంఘం…

వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్‌ సెగ్మెంట్‌ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్‌ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం.