వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య?

ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించి నా.. పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఏఐసీసీ నేతలు, కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బోర్డు సోమవా రం రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 9 అభ్యర్థుల జాబితాలను విడుదల చేయగా, ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ను తాజాగా ప్రకటించింది.

మహారాష్ట్రలోని అకోలా నుంచి అభ్యర్థిగా డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్‌ను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిం చింది.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు..

వాఖండే స్టేడియంలో ముంబైని చిత్తుగా ఓడించిన రాజస్థాన్

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ వరుస విజయాలతో జోరు కనిపిస్తోంది. నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్‌లో రాజ స్థాన్ విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియం లో జరిగిన మ్యాచ్‌లో ముం బైని చిత్తుగా ఓడించింది… పాయింట్స్ టేబుల్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్125 తక్కువ పరుగులకే పరిమి తం చేసిన రాజస్థాన్…ఛేద నలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో మరోసారి మెరిశాడు. దీంతో నిర్ధిష్ట లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేధించిన రాజస్థాన్.. ముంబైపై విజయం సాధించింది.

అయితే రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు నిల కడగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకె ళ్లారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), జోస్ బట్లర్ (13), శాంసన్ (12) పేలవ ఫామ్‌తో నిరాశపరిచారు.

రియాన్ పరాగ్ 54 నాటౌట్ తో ఆకట్టుకున్నాడు. రవిచం ద్రన్ అశ్విన్ (16) ర్యాన్ పరాగ్ కు మద్దతుగా నిలిచి పరుగులు సాధించాడు. ఇక ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయగా.. క్వేనా మఫాకా ఒక్క వికెట్ దక్కించుకుంది..

కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషి యల్ కస్టడీ విధించింది కోర్టు.

ఇవాళ ఈడీ కస్టడీ ముగి యడంతో రౌజ్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశ పెట్టారు.అధికారులు.

కేజ్రీ వాల్ విచారణకు స‍హకరిం చడంలేదని, దర్యాప్తును తప్పుదోవప ట్టిస్తున్నారని ఈడీ న్యాయ వాదులు కోర్టుకు తెలిపారు.

జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈడీ వాదనలను పరిగణలోని తీసుకున్న కోర్టు ఆయనకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

వాత పెట్టిన వాగ్దానం మారలేదు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచేందుకు అనేక హామీలు ఇస్తుండ‌టం స‌హ‌జం .. అయితే ఓ క్యాండిడేట్ ఎన్నిక‌ల వాగ్ధానాల‌లో కాస్త కిక్కు ఇచ్చింది

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేస్తున్న వ‌నితా రౌత్ పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని హామీలు ఇచ్చేసింది.

ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్‌ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది. ముందుగా ఈ షాపుల‌లో ప్రీగా మందు అందిస్తానని వాగ్దానం చేసేసింది.

ఇండియ‌న్ లిక్క‌ర్ కాకుండా విదేశీ మద్యం అందుబాటు లో ఉంచుతాన‌ని ఘంటా ప‌ధంగా చెపుతున్న‌ది.. దీంతో ఆమె ప్రచారానికి జ‌నాలు పోటేత్తుతున్నారు.

తాగేందుకూ లైసెన్స్….

అయితే ఈ స్కీమ్‌ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్‌ ఉండాల్సిందే నన్న కండీషన్‌ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడ మని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్‌ వారికి అవసరమని సమర్థించు కుంటోంది.

పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది.

గ‌త ఎన్నిక‌లో ఇదే వాగ్ధానం… వాత‌పెట్టిన ఎన్నిక‌ల సంఘం…

వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్‌ సెగ్మెంట్‌ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్‌ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం.

ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి.

ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే రూ.75 అదనం గా చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంపిక చేసిన కొన్ని ఏటీఎమ్‌ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలు మునుపటి కంటే రూ. 75 ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది...

Streetbuzz News

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు.

ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు.

కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ, మరో నాలుగు పార్లమెంట్ నియోజకవ ర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

ఇక తెలంగాణలో అభ్యర్థు లను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది....

నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు

పెయిన్‌ కిల్లర్లు, యాంటి బయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు ఏప్రిల్‌ 1నుంచి పెరగనున్నాయి.

ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడి న అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం సంవత్స రంతో పోలిస్తే 0.0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ ఎన్​పీపీఏ వెల్లడించింది..

ఈ మేరకు ఎన్​పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్​లో మందుల ‘టోకు ధరల సూచీ’లో వార్షిక మార్పును ప్రకటించింది.పెయిన్‌కిల్లర్ డైక్లోఫెనాక్ ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కి చేరింది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg)కి, రూ.1.20 (400 Mg)కి పెరిగింది.

WPIలో సూచించిన ధర లకు అనుగుణంగా షెడ్యూ ల్​ చేసిన ఫార్ములాల మందు లపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు.

ఈవిధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయో టిక్స్, యాంటీ మలేరియ ల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం.

బెజ్జంకి యువతికి మిస్‌ టీన్‌ టైటిల్‌..

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది..

యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువ తులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది.

వచ్చే ఆగస్టులో యూఎస్‌ ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనున్నది...

Streetbuzz News

ఏప్రిల్ 5 న కరీంనగర్‌ జిల్లాలో పొలాల బాట పట్టనున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 5న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.

కరీంనగర్ రూరల్, వేముల వాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు.

రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెబుతామన్నారు. గులాబీ బాస్ కరీంనగర్‌ పర్యటన ఖరారు కావడంతో బారాస నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Streetbuzz News

CSK పై మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. విశాఖ వేధిక‌గా CSKతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది.

దీంతో చెన్నైపై ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.చేజింగ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్లు కోల్పో యింది చెన్నై జట్టు. మిడిలా ర్డర్‌లో అజింక్యా రహానే (45), డారిల్ మిచెల్ (34) పరుగులు సాధించగా.. శివమ్ దూబే (18) పరుగు లకే అవుటయ్యారు.

ఆఖరిలో జడేజా 21 నాటౌట్ ధోని 37 నాటౌట్ పరుగులు చేశారు. చెన్నై గెలుపు భారం అంతా మిడిల్ ఆర్డర్ పైనే. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52), రిషబ్ పంత్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. మరోవైపు ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన పృథ్వీ షా (43) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...