తెల్ల కాగితం మీద చేతిరాత తో రాసి బిల్లు లని ఇస్తున్నారు!
దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చెల్లించిన డబ్బులకు రసీదులు ఇవ్వడం లేదని పేషంట్ల సంబంధీకులు తెలిపారు. తమ పేషెంట్ ను అనారోగ్య రీతి హాస్పిటల్లో జాయిన్ చేసి సంబంధిత రుసుము చెల్లించినప్పుడు కంప్యూటర్ జనరేటర్ బిల్లులు ఇవ్వకుండా తెల్ల కాగితం మీద రాసి అనధికారిక బిల్లులు ఇస్తున్నట్లు ఆకులపల్లి లక్ష్మమ్మ పేషెంట్ సంబంధీకులు కత్తుల వెంకటేష్ ఆరోపించారు. అట్టి తెల్ల కాగితం బిల్లులు ఈఎస్ఐ వంటి వాటిలో రియంబర్స్మెంట్ కోసం పనికిరావని, ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వ్యవస్థను సక్రమంగా నడిచేలా చూడాలని అన్నారు.

దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చెల్లించిన డబ్బులకు రసీదులు ఇవ్వడం లేదని పేషంట్ల సంబంధీకులు తెలిపారు. తమ పేషెంట్ ను అనారోగ్య రీతి హాస్పిటల్లో జాయిన్ చేసి సంబంధిత రుసుము చెల్లించినప్పుడు క

తెల్ల కాగితం మీద చేతిరాత తో రాసి బిల్లు లని ఇస్తున్నారు!
NLG: నల్లగొండ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులకు సన్మానం

నల్లగొండ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు సిరిగిరి వెంకటరెడ్డి, కార్యదర్శి గిరి లింగయ్య, జాయింట్ సెక్రటరీ మామిడి ప్రమీల, కార్యవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సిరిగిరి వెంకటరెడ్డి మరియు సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని కోర్టు న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను పలువురు న్యాయవాదులు సన్మానించి, పుష్ప గుచ్చం అందజేసి అభినందించారు.

SB NEWS NATIONAL MEDIA

భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం

మునుగోడు: మండల కేంద్రంలోని సిపిఐ ఆఫీసులో, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య అధ్యక్షతన జరిగింది. 

ఈ సమావేశం లో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను పాల్గొని మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను.. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేస్తూ నాలుగు కోడ్ లుగా విభజిస్తున్నారు. 

అందుకని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోవు పార్లమెంటు ఎలక్షన్ లో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని, అదేవిధంగా కార్మికులకు పని వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రమాద బీమా క్రింద 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మత్స్యకారులకు ఇచ్చినట్టుగా ప్రతి కార్మికునికి టు వీలర్ సైకిల్ మోటార్ వాహనాన్ని ఇవ్వాలని, గతంలో పెండింగులో వివిధ రకాల ఉన్న బిల్లులు, ఎక్స్గ్రేషియా ఇతర ఇతర పెండింగ్ బిల్లులు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో నరసింహ, దొమ్మాటి గిరి, యాసరాని వెంకన్న, బొల్లు సైదులు, భీమనపల్లి స్వామి, డి. నగేష్, ఉప్పు రమణయ్య, వి.ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: మరోసారి మానవత్వం చాటుకున్న నాంపల్లి ZPTC ఎ.వి.రెడ్డి

నల్లగొండ జిల్లా:

నాంపల్లి మండలంలోని పసునూరు గ్రామానికి చెందిన భూతం అంజయ్య తల్లి భూతం లక్ష్మమ్మ మరణించిన విషయం మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్ ద్వారా విషయం తెలుసుకున్న నాంపల్లి జెడ్పిటిసి ఎవి రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. వారి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సాయం అందించారు.

వారి వెంట పసునూరు మాజీ సర్పంచ్ ఎస్.రాములు,రాగి ఫణి ధనుంజయ చారి, ఎస్కే జానీ, జింకల నరేష్, ఉ

ప్పునూతల ఆంజనేయులు, రామస్వామి, శ్రీకాంత్,బాలమ్మ, మహిమూద్, ఆనంద్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

TS: స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఫుట్బాల్ క్రీడాకారున్ని అభినందించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ మెంబర్ జి.పి.ఫల్గుణ

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీసు ఉద్యోగాలలో TSSP విభాగంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయిచంద్ర సిద్ధార్థ్.. ఈ రోజు హైదరాబాద్ LB స్టేడియంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ మెంబర్ అయిన జి.పి. ఫల్గుణ ను ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా జి.పి. ఫల్గుణ బొమ్మపాల సాయిచంద్ర సిద్ధార్థ ను ప్రత్యేకంగా అభినందించి స్వీట్స్ తినిపించారు.

అనంతరం G.P ఫల్గుణ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో రాణించిన ప్రతి క్రీడాకారుడు ఆటతో పాటు, చదువుల పట్ల కూడా దృష్టి సారిస్తే యుక్త వయసులోనే స్థిరపడి భవిష్యత్తులో అద్భుతమైన రీతిలో రాణించి భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారని సూచించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అద్భుతమైన ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారని వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి, ప్రభుత్వం, అధికారులు, వివిధ సంస్థలు, సహాయ సహకారాలు అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటారని తెలిపారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: వరి పంట వేసిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

మర్రిగూడ మండలంలోని తిరుగండ్ల పల్లి, తమ్మడపల్లి, ఇందుర్తి గ్రామాలలో రైతు సంఘం సిపిఎం పార్టీ పంటల పరిశీలన బృందం, ఎండిపోయిన వరి పంట రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి, బోరు బావులు ఎండి పోయినవి. వరి పంట వేసిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రామాల లోకి ప్రభుత్వ అధికారులు వెళ్లి వరి ఎండిపోయిన రైతులను గుర్తించి, ఎండిపోయిన వరికి ఎకరానికి 25 వేల రూపాయలు, ఇతర పంటలకు 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, బ్యాంకులలో ఉన్న అప్పులను మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, రైతు సంఘం మండల నాయకులు కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, ఉప్పునూతల వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: దామర భీమనపల్లి లో బిజెపి బూత్ అధ్యక్షుల ఎన్నిక

మర్రిగూడ మండలం, దామెర భీమనపల్లి గ్రామంలో నూతనంగా బిజెపి బూత్ అధ్యక్షుల ఎన్నిక జరిగింది. 248 బూత్ అధ్యక్షులు గా, అయితరాజు రమేష్, 246 బూత్ అధ్యక్షులు గా చిలివేరు ధర్మేష్, 249 బూత్ అధ్యక్షులు గా చక్క నరసింహ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల బిజెపి అధ్యక్షులు పాత్లావత్ రాజేంద్ర నాయక్, భీమనపల్లి నాయకులు అంబాల రమేష్, దేవేందర్, స్వామి, కారింగు శివకుమార్, సైదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: చత్రపతి శివాజీ ఫుట్బాల్ లీగ్స్.. ముఖ్య అతిథిగా పాల్గొన్న బండమీది అంజయ్య

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 7 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో మిర్యాలగూడ ఫుట్బాల్ క్లబ్, నల్గొండ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 2-0 స్కోర్ తో నల్గొండ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.

ఈ సందర్భంగా క్రీడాకారులకు నల్గొండ మండలం మర్రిగూడ జెడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు అందెం శ్రీనివాస్ గౌడ్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు సేవా భావం కలిగిన వ్యక్తులను, సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, ఈరోజు సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బండమీది అంజయ్య రావడం జరిగిందని, క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని వారు కూడా ఇక్కడ జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలను పూర్తిగా గమనించి తనవంతుగా తనవంతుగా 6 ఫుట్బాలను క్రీడాకారులకు అందజేస్తామని ప్రకటించడం జరిగిందని తెలిపారు.

ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సమాచార హక్కు సంరక్షణ సమితి తెలంగాణ అధ్యక్షులు బండమీది అంజయ్య మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉచితంగా శిక్షణ ఇస్తూ, గ్రామీణ నిరుపేద విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులు గా తయారు చేశారని, ఇప్పుడు ఫుట్బాల్ క్రీడా వ్యవస్థను ఆయన చేత భూని పూర్తి శ్రద్ధతో, అంకితభావంతో, నిరంతరం పనిచేస్తూ, నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారులకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ శిక్షణ కార్యక్రమాలు మరియు లీగ్ పోటీలను నిర్వహిస్తూ, ఫుట్బాల్ వ్యవస్థను సమాజంలోని ప్రతి వ్యక్తికి చేరవేసేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అది మన నల్లగొండ జిల్లాకే ఎంతో శుభసూచకుని దీని పర్యవసానమే గత 4 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లాకు చెందిన ఎంతోమంది ఫుట్బాల్ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తూ మంచి ఉజ్వల భవిష్యత్తు ను పొందే దిశగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.

ఫుట్బాల్ క్రీడాకారిని అప్పల సోనీ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో నేను గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పోటీలలో పాల్గొన్నానని భవిష్యత్తులో కూడా కోచ్ లు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క భవిష్యత్తు కు బంగారు బాటలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, అంబటి ప్రణీత్ , సత్యం, కర్ణాకర్ రెడ్డి, మురళి, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

NLG: వ్యాయామ ఉపాధ్యాయులు కీ. శే సాజిద్ అలీ కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ: ఇటీవల తల్లి, తండ్రి ని కోల్పోయిన పిల్లలకు 80,000/- వేలు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని DYSO మక్బూల్ మహమ్మద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో, ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కనగల్ జడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సాజిద్ అలీ సంస్మరణ సభను నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .

ఈ సందర్భంగా డివైఎస్ఓ మక్బూల్ మహమ్మద్ మాట్లాడుతూ.. 6నెలల క్రితం క్యాన్సర్ వ్యాధితో తల్లి, ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించడంతో ఆ పిల్లలు ఒంటరి వారిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మృతుని పిల్లలకు 80 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి మాట్లాడుతూ.. సహోదరుని కోల్పోవడం బాధాకరమని, సంఘ పరంగా ఆర్థిక సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. సాజిద్ అలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం సాజిద్ అలీ కుమారుడు, కుమార్తెకు 80 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి కూతాటి మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు దుబ్బ ఆనంద్, ఆర్. నాగేశ్వరరావు, కోడుమూరు వెంకటరామిరెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, అలీమ్, శ్రీకాంత్ రెడ్డి, విజయపాల్, విజయ్, శ్రీనివాస్, రఫీ, వహీద్, గఫార్, కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA