madagoni surendar

Mar 31 2024, 20:32

ఇఫ్తార్ విందులో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఇఫ్తార్ విందులో నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం:- పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.అంతరం నకిరేకల్ మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో నకిరేకల్ పట్టణ వివిధ వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Mar 27 2024, 09:40

బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి
బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి

నల్గొండ జిల్లా :- బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి  ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లామన్నారు.బహుజనుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అన్నారు. బహుజనులంతా ఏకతాటిపై వచ్చి అన్ని రంగాల్లో తమ వాటా  సాధించుకోవాలన్నారు. తనకు రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించిన  నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మరియు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

madagoni surendar

Mar 22 2024, 18:05

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా... - ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు... - బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంట
బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా...


- ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు...

- బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ...

- నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని


నల్గొండ జిల్లా :- ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు.  శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దని, అందరికీ వెన్నంటుగా ఉండి, అండగా ఉంటానని బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి మేడి ప్రియదర్శిని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్స్ మునుగోటి సత్తయ్య, చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండలం అధ్యక్షులు జోగు శేఖర్, రామన్నపేట మండల ఉపాధ్యక్షులుగుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి  నరసింహ, మండల కోశాధికారి గట్టు రమేష్,మండల మహిళా కన్వీనర్,బందెల అనిత, నాయకులు బాలాగోని మల్లయ్య గౌడ్,బుస్సు శ్రీకాంత్,రవి,యోగి, రామ్ కుమార్  బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Mar 19 2024, 16:25

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము. పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము.
   
పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

*ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీకే అన్నారంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ*
నల్గొండ జిల్లా :-
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారి ఆశయాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.  ఈ రోజు జీకే అన్నారం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) నల్గొండ ఆధ్వర్యంలో *సంకల్ప హాస్పిటల్ , ప్రభుత్వ PHC రాములబండ వారి సహకారంతో*  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పెట్టి చాకిరి విముక్తి కావాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యతిరేకంగా నిలబడి తుపాకీ బట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు.  భూమి భుక్తి విముక్తి పోరాటాలు ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశముకుల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన పదకొండవ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని అన్నారు.   నేటి పాలకులు మద్యం మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నాయని అన్నారు.
ప్రజలు  విద్యా వైద్యం ఉపాధి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.  ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని గ్రామాలలో వృద్ధులు పిల్లలు సరియైన పౌషక ఆహారము లేక సరియైన వైద్యం చేయించుకోలేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు.  ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అత్యధిక మంది ప్రజలు తమ ఆరోగ్యాలను పరీక్షించుకొని ఉచితంగా మందులు పొందారని అన్నారు.  రాములబండ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రభుత్వం వారిచే డాక్టర్ తిరుమల్ డాక్టర్ భాస్కర్  పద్మ సూపర్వైజర్ మరియు నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లో గల సంకల్ప ఆసుపత్రి బృందం డాక్టర్ కరీముల్లా జనరల్ ఫిజీషియన్  డాక్టర్  లీనా మాధురి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్వల చిన్న పిల్లల డాక్టర్లు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కమిటీ సభ్యురాలు కొండ అనురాధ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న మండల కమిటీ సభ్యులు బోల్లు రవీందర్ కుమార్ సంకల్ప ఆసుపత్రి సహాయకులు రాము శ్రీకాంత్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కొండ అనురాధ,
రాష్ట్ర కమిటీ సభ్యురాలు
ఐద్వా నల్లగొండ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 18 2024, 19:08

*డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన డ్రైవర్లు*
*డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన డ్రైవర్లు* నల్గొండ జిల్లా :-
కట్టంగూర్ మండల కేంద్రనికి చెందిన డ్రైవర్ చెరుకు శంకర్
ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి తోటి డ్రైవర్లు, ఓనర్లు చేయితన అందించారు. వారందరూ కలిసి సేకరించిన  22వేలను సోమవారం నాడు చెరుకు శంకర్  కుటుంబానికి అందజేసిన వారు.చెరుకు సైదులు(మడేల్ )ఓరుగంటి హరిబాబు,డిసిఎం ఓనర్లు డ్రైవర్లు,చెరుకు కాశీనాథ్,దాసరి శివ,వీరమళ్ల నగేష్,పలస రాజు, చితలూరు అశోక్,రెడ్డిపల్లి, వెంకన్న,చెరుకు సైదులు, అమరబోయిన వెంకన్న, చెరుకు మల్లికార్టున్,చెరుకు సత్యం,పోడిచేటి కృష్ణ, వెంకన్న ఇనుపాముల, జంజారాల నగేష్,గట్టిగోర్ల అంజి,చిక్కుల్ల లింగస్వామి, చిక్కుల్ల సైదులు,నర్సింగ్ శ్రీను,పోడిచేటి కృష్ణ, ఉంజరాల కృష్ణ,నడిగోటి కృష్ణ,బొల్లం వెంకన్న, చెరుకు రవి (యోగి),చెరుకు రమేష్, గట్టిగొర్ల రాజు,చితలూరి. సైదులు,కొంపల్లి నాగారాజు,పోడిచెటి శ్రీను, పోడిచెటి లింగయ్య,మండ యదయ్య,గదగోని వెంకన్న, చెరుకు రవి(ఆర్.టి.సి ),తేలు శంకర్,యారకల సత్యనారాయణ చెరుకు రవి, తదితరులు ఉన్నారు.

madagoni surendar

Mar 08 2024, 18:12

మహాశివుని కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి*. *మహశివరాత్రి వేడుకలో* నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
*మహాశివుని కరుణాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి*.

*మహశివరాత్రి వేడుకలో*

నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం
నల్గొండ జిల్లా :-
నకిరేకల్ నియోజకవర్గం.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, కట్టంగూర్ మండల కేంద్రంలోని శివాలయంలో స్వామి వారిని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి  ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో  ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు.  మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ  ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

madagoni surendar

Mar 07 2024, 11:49

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
*నల్గొండ. స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత*
నల్గొండ జిల్లా:-
నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ ఇటీవల మృతి చెందాడు. ఈసందర్బంగా నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2012-15 బ్యాచి కి చెందిన శంకర్ స్నేహితులు గురువారం గుడ్లపల్లి గ్రామం లోని శంకర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయన్ని అందజేశారు. కలిసి చదువుకున్న స్నేహితులు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

madagoni surendar

Mar 07 2024, 10:06

చిట్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల పట్టణాన్ని ఆదర్శ  పట్టణంగా తీర్చిదిద్దుతా

పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా :-
నకిరేకల్ నియోజకవర్గం.
చిట్యాల మున్సిపాలిటీ 04వ వార్డు పరిధిలోని సిరి వెంచర్ నుండి NH-65 వరకు 25. 00 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్ర్టోం వాటర్ డ్రెన్ నిర్మాణం పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  గురువారం నాడు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. చిట్యాల మున్సిపాలిటి ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా  అని అయన అన్నారు.పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. చిట్యాల మున్సిపాలిటి ని ఆదర్శ  మున్సిపాలిటి జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.. . ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి,కౌన్సిలర్లు,మండల నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Mar 03 2024, 18:58

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్‌మ్యాప్‌తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్‌ ఛైర్మన్‌ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
జేఎన్‌జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హామీని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీకి 16 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిజాంపేట, పేట్‌బషీరాబాద్‌లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిందని ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదన్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు.  ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపైనా దృష్టిసారించామని తెలిపారు. సమావేశంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

madagoni surendar

Mar 03 2024, 11:16

తెలంగాణ లో మార్చి 15 నుండి ఒక్క పూట బడులు*
*తెలంగాణ లో మార్చి 15 నుండి ఒక్క పూట బడులు* తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒక్క పూట తరగతులు నిర్వహించాలని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒక పూట భోజనం పెట్టాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనానని అందించనున్నారు. అయితే 10వ తరగతి కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.