NLG: డోలారోహణ కార్యక్రమంలో పాల్గొన్న నాంపల్లి జెడ్పిటిసి ఎవి రెడ్డి

నల్లగొండ జిల్లా:

నాంపల్లి మండలం లోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు దండిగా నరసింహ, మల్లమ్మ మనవరాలు డోలారోహణ కార్యక్రమంలో జెడ్పిటిసి ఏవి రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

ఎంపీటీసీ అనేపాక సరిత కిరణ్, మండల కాంగ్రెస్ నాయకులు గెలవాల్ రెడ్డి, దండిగ వెంకటయ్య నాగమణి, రేవెల్లి వెంకటయ్య, మల్లేష్, తదితరులు ఉన్నారు.

NLG: సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జయప్రదం చేయాలి: ఏర్పుల యాదయ్య

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం సిపిఎం పార్టీ విస్తృతస్థాయి సమావేశం గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ చౌటుప్పల్  కేంద్రంలో, ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు సమావేశం ఉన్నందున మర్రిగూడ మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, సానుభూతిపరులు తప్పక సమయం పాటించి హాజరుకావాలని సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా, మునుగోడు నియోజకవర్గ పరిధిలో 7 మండలాల విస్తృతస్థాయి సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. 

సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఎం.డీ జాంగిర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు మేధావులకు అభిమానులకు మీ పవిత్రమైన ఓటు వేసి పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఎం అని ఆయన గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కోసం ఎర్రజెండా ను భుజాన వేసుకుని కార్మిక కర్షక శ్రామిక మహిళల కోసం రైతు గిట్టుబాటు ధర కోసం చట్టం చేయాలని పోరాటం చేసే అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, నారోజు అంజాచారి, గడగోటి వెంకటేష్, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, నామ సైదులు, తదితరులు పాల్గొన్నారు. 

SB NEWS NATIONAL MEDIA

క్రైస్తవులకు ఎమ్మెల్యే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

మిర్యాలగూడ: నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామంలోని పరిశుద్దాత్మ అగ్ని మినిస్ట్రీస్ చర్చ్ యందు జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా హాజరవగా ఫాస్టర్లు ఆయనకు దీవెనలు ఇచ్చారు.

ఈ మేరకు ఎమ్మెల్యే క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని కోరారు.

నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సిరిగిరి వెంకటరెడ్డి

నల్లగొండ బార్ అసోసియేషన్ లో జరిగిన న్యాయవాదుల ఎన్నికలలో అధ్యక్షులుగా సిరిగిరి వెంకటరెడ్డి, కార్యదర్శిగా గిరి లింగయ్య, జాయింట్ సెక్రటరీ గా ప్రమీల, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. పలువురు న్యాయవాదులు నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు.

'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' జాతీయ సదస్సు

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో 'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' అను అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపజేయడమే కాకుండా విద్యార్థులను పరిశోధకులుగా సాహిత్య అభిమానులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తాయని అన్నారు.

తెలంగాణ నాటక సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ ఎంతోమంది నాటకా రచయితల రచనలు నేటి సాహితీ లోకానికి అందడం లేదని అలాంటివారి సాహిత్యాన్ని వెలికిదీసి భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కీలకోపన్యాసం గావించిన జాతీయ ఉత్తమ సినీ విమర్శక పురస్కార గ్రహీత డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ తెలుగు నాటక రంగం ఆరంభ వికాసాలను గురించి సమగ్రంగా తన ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. నాటక రచయితతో పాటు నటులు, నాటక ప్రయోక్త అందరూ తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ నాటకం జనరంజకం అవుతుందని, పది కాలాలపాటు నిలుస్తుందని అన్నారు. అంతేకాకుండా నాటకం రమణీయమైన దృశ్యకావ్యమని ఇలాంటి కావ్యాలను రాసినటువంటి ఎంతోమంది రచయితలు తెలుగు సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని పొందినారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ నాటక రంగం మనోరంజకమైనదని ఇవాళ సినిమా ప్రభావం వల్ల నాటక రంగ సంస్థలు కనుమరుగైపోతున్నాయని అలాంటి సంస్థల్ని, నటుల్ని ఆదరించాల్సిన అవసరం నేటి ప్రభుత్వం పైన ఉందని అన్నారు. అదేవిధంగా సాహిత్యంలో నాటకం చాలా ప్రధానమైనదని, సాహిత్యాన్ని నేటి విద్యార్థులు ఎక్కువ అధ్యయనం చేస్తూ మంచి పరిశోధకులుగా రాణించాలని అన్నారు. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని, ప్రతి విద్యార్థి ఇలాంటి కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య కరిమిళ్ళ లావణ్య, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, డాక్టర్ టి. సైదులు, ఎస్. ప్రభాకర్, ఎం. లింగస్వామి, బి. రమ్య, డి. అంజయ్య, గ్రంథపాలకులు డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్ ఫిజికల్ డైరెక్టర్ కె. మల్లేశంతో పాటు,సుమారు 20 మంది వివిధ కళాశాల నుండి విచ్చేసిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు. ఇతర శాఖల అధ్యాపకులతో పాటు విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. 

ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలను ప్రభావితం చేయని నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని ఈసీ సూచించింది.

NLG: జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు

ఈరోజు నల్లగొండలో ఎన్జీ కాలేజ్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఓటర్ అవేర్నెస్ రన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఏఎస్పి, అధికారులు, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఫుట్బాల్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు జిల్లా కలెక్టర్ హరిచందన, ఏఎస్పీ రాములు నాయక్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుల వెంట శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మాపాల గిరిబాబు ఉన్నారు.

NLG: ఓటరు అవగాహన.. 5 కే రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన

నల్లగొండ: ఓటరు అవగాహన కార్య క్రమంలో భాగంగా పట్టణం లో నైతిక ఓటింగ్ పై ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను, జిల్లా కలెక్టర్ హరిచందన జండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కు ను వినియోగించుకోవాలన్నారు. 85 సం.లు నిండిన ఓటర్ల కు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్ 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు, అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా అమరజీవి ధర్మ బిక్షం 13 వ వర్ధంతి

మర్రిగూడ: సిపిఐ మండల కార్యాలయంలో, నేడు అమరజీవి కామ్రేడ్ ధర్మబిక్షం 13 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ..  అమరులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 1922 ఫిబ్రవరి 15 జన్మించి , తన విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు పార్టీ కి ఆకర్షితులై, సాయుధ రైతాంగ, తెలంగాణ పోరాటం లో విరోచిత పోరాటం చేశారు. దున్నే వానికే భూమి, గీసే వానికే చెట్టు కావాలని జరిపిన పోరాటంలో 8 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి, అనంతరం జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులు గా, రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించారని, గీత కార్మికులకు సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత ధర్మ బిక్షం గారి దేనని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, జిల్లా యూత్ అద్యక్షుడు బూడిద సురేష్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు చెల్లం పాండు రాంగరావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘమయ్య, ఐతగోని వెంకటయ్య, నిరంజన్, AISF ఏ.ఐ.ఎస్.ఎఫ్ మండల కార్యదర్శి ఇస్కీళ్ళ మహేందర్, సుభాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: చర్లగూడెంలో ఘనంగా నీలకంఠ రామస్వామి వారి రథోత్సవం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, చర్లగూడెం గ్రామంలో నీలకంఠ రామ స్వామివారి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, వెన్నమనేని రవీంద్రరావు, దేవాలయ కమిటీ చైర్మన్ రాపొల్ యాదగిరి, వెంకటం పేట బాలయ్య, దేవాదాయ కమిటీ మెంబర్లు మంచుకొండ వెంకటేశ్వర్లు, వల్ల భాస్కర్ గౌడ్, ఏర్కలి యాదయ్య గౌడ్, జమ్మల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.