ఎర్రవల్లి ఫామ్‌హౌస్ లో కెసిఆర్ ను కలిసిన కే.కేశవరావు
![]()
పార్టీ మారుతారనే ఊహా గానాలు జోరందుకున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
కాసేసటి క్రితమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు కేశవరావు. కేసీఆర్‌తో భేటీలో పార్టీ మార్పుపై కేకే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే వార్తలు రాగా.. కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కేకేను పార్టీలోకి ఆహ్వానించారు.
దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేప థ్యంలో కేసీఆర్‌ను కేకే కలవడం చర్చనీయంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యలు చేశారు కేకే.







Mar 28 2024, 17:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.3k