జనగాం ఏసీపీ పై ఈసీ వేటు

ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది.

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది...

Streetbuzz News

*SB NEWS*

Streetbuzz news

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం:ముగ్గురు మహిళలు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని హుటాహు టిన ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది..

మహబూబ్ నగర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఉపఎన్నిక పోలింగ్

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది.

మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

ఈ ఎన్నికలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు.

ఈ నేప థ్యంలో ఇవాళ మధ్యాహ్నం కొడంగల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు.

ఎంపీడీవో ఆఫీస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఓటు వేయను న్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుండ గా .ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతు న్నారు

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి.

ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు అలుముకో వడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహు టిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

5 ఫైర్ ఇంజిన్ల తో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.....

డిఎండికె పార్టీ నేత గణేష్ మూర్తి మృతి

టికెట్ రాలేదని మనస్తాపం తో తమిళనాడుకు చెందిన డీఎండీకే ఎంపీ,ఈరోడ్, గణేశమూర్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.

గత కొన్ని రోజులుగా కోయం బత్తూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న ఆయన ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో కన్ను మూశారు.

ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మనస్తా పానికి గురైన గణేశమూర్తి ఆదివారం మార్చి 24వ తేదీన తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.

వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కొయంబత్తూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న గణేశమూర్తికి ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి...

ఓపెన్ స్కూల్ చదివితే DSC కి నో ఛాన్స్

తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియా మక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

వీళ్లు గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన ప్పటికీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించి నట్లు సమాచారం.

తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికం గా ఉత్తర్వులు ఇవ్వనున్నా రు.

విద్యాశాఖ తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది అభ్యర్ధులు డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది...

నేడు మంథని లోని ఆలయాల హుండీ లెక్కింపు

మంథని పట్టణానికి చెందిన మూడు ప్రముఖ ఆలయాల హుండీలు ఈరోజు లెక్కించ నున్నట్లు ఆలయాల ఎండో మెంట్ మేనేజర్ రాజ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.

మంథని పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం హుండి ఉదయం 10. 30 గంటలకు,

శ్రీ మహాలక్ష్మి దేవాలయం హుండి మధ్యాహ్నం 12. 30 గంటలకు,

శ్రీ గౌతమేశ్వర స్వామి దేవస్థానం హుండి మధ్యాహ్నం 3. 30 నిమిషాలకు లెక్కించ నున్నట్లు తెలిపారు..

Streetbuzz News

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది.

విదేశీ మారక ద్రవ్య నిర్వ హణ చట్టం,(ఫెమా ) నిబం ధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరుకా వాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానికి కూడా సమన్లు పంపింది.

కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరుకాలేదు.

ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసా ల్లో, కార్యాలయాల్లో సోదా లు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడోసారి ఆమెకు సమన్లు జారీ చేసింది.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది.

బాసగూడెం లో ఎన్ కౌంటర్ ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఆరుగురు మృతి

•పోలీసులకు లొంగిపోయిన దళ సభ్యుడు

చర్ల సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లా బాసగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చీపురు బట్టి సమీప తాలి పేరు నది ఒడ్డున బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఆరుగురు మృతి చెందినట్టు బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మృతులను.. మిలీషియా సెక్రటరీ కమాండర్‌ మూక, ఏసీఎం నగేష్‌, అతని భార్య సోనీ, ఏసీఎం మిలీషియా సీప్‌ వికాస్‌, ఏసీఎం గనజి, సుక్కగా పోలీసులు గుర్తించారు.

హోలీ పండుగ రోజు ముగ్గురు గ్రామీణు లను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఆచూకీ కోసం కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్‌ 229 బెటాలి యన్‌, డీఆర్జీ బలగాలు బాసగూడ అడవులను జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో చీపురు బట్టి సమీప అడవిలో మావోయి స్టులు తారసపడి విచక్ష ణారహితంగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఆత్మ రక్షణ కోసం బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు చనిపో యారని తెలిపారు.

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్‌ నెంబర్‌ 10 కమిటీ కమాండర్‌ రమేష్‌, అతని భార్య సోనీ మృతుల్లో ఉన్నారని ఎస్పీ ధ్రువీకరించారు. రెండు మూడు గంటల పాటు ఏకధాటిగా జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఒక దళ సభ్యుడు లొంగిపోగా అనంతరం ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు తుపాకులు, మందు గుండు సామగ్రి, మావోయిస్టుల విప్లవ సాహిత్యం భారీగా లభించిందని ఎస్పీ తెలిపారు.

నేడు ఢిల్లీతో రాజస్థాన్ పోరు

గురువారం ఢిల్లీ క్యాపి టల్స్‌తో జరిగే పోరుకు రాజస్థాన్ రాయల్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లోనూ విజయ మే లక్షంగా పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈమ్యాచ్‌లో గెలిచి శుభా రంభం చేయాలనే పట్టుదల తో ఢిల్లీ కనిపిస్తోంది.

ఇక తొలి మ్యాచ్‌లో లక్నోను అలవోకగా ఓడించిన రాజ స్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిం చాలని భావిస్తోంది. కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కలిగిన శాంసన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం.

ఐపిఎల్ శాంసన్‌కు చక్కటి రికార్డు ఉండడం కూడా రాజస్థాన్‌కు సానుకూలా పరిణామమే. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ల రూపం లో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్‌లో వీరిద్దరూ బాగానే ఆడినా భారీ స్కోర్లను సాధించడంలో విఫల మయ్యారు.

ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో యశస్వి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పరుగుల వరద పారించాడు.

ఐపిఎల్‌లోనూ అదే జోరు ను కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రపంచంలోని అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకరిగా పేరున్న బట్లర్, హెట్‌మెయిర్‌ల రూపంలో రాజస్థాన్‌కు పదునైన అస్త్రాలు ఉండనే ఉన్నాయి...