హైదరాబాద్ లో పరుగుల వర్షం కురిపించిన సన్ రైజర్స్

సొంత స్టేడియమైన ఉప్ప‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌కు చిత‌క్కొట్టారు.

నువ్వానేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతూ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో

హోరెత్తించారు. అరం గేట్రంలోనే ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (62) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టి హైద‌రాబ్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

అత‌డి త‌ర్వాత‌ అభిషేక్ శ‌ర్మ‌(63) విధ్వంసం కొన‌సాగించాడు. ఆ తర్వాత క్లాసెన్ (80) వీర బాదుడు బాదాడు. మార్కరామ్ (42) కూడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

దీంతో సన్ రైజ్ హైదరాబాద్ జట్టు స్కోరు నిర్ణిత 20 ఓవర్లకు 277 భారీగా స్కోరు నమోదు చేసింది. దీంతో ముంబైకి 278 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది..

నేడు మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీ టీసీ సభ్యులు, ఎక్స్‌అఫీషి యో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.

మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తారు.

ఓటింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచ నున్నారు.

ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఉప ఎన్నిక కోసం మన్నె జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ నవీన్‌కుమార్‌ రెడ్డి,బీఆర్ఎస్ సుదర్శన్‌ గౌడ్‌,స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు.

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో బుధవారం రాత్రి మరోసారి చిరుత కలకలం రేపింది.

తిరుమల శ్రీవారి నడక దారిలో వన్యప్రాణుల సంచారం కొనసాగుతోంది.

తాజాగా ట్రాప్ కెమరాలు ద్వారా చిరుత సంచారాన్ని గుర్తించారు.అటవి శాఖ అధికారులు.

ఈ చిరుత సంచారం నేప థ్యంలో భధ్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తోంది టిటిడి పాలక మండలి. తిరుమల శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భధ్రతా ఏర్పాట్లు చేస్తు న్నారు.

కాగా.. ఇప్పటికే తిరుమల శ్రీవారి నడకదారిలో వన్యప్రాణుల సంచారం చోటు చేసుకుంది. గతే డాది.. ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి.. చంపేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయడానికి అనుమతి అవసరం లేదు: విద్యాశాఖ

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది.

ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ ఇచ్చారు. టెట్‌ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా

విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి వార్తలు వినిపిం చాయి.

ఈ వార్త ప్రభుత్వ ఉపాధ్యా యుల్లో ఆయోమయానికి దారితీసింది. నిజంగా విద్యా శాఖ ఆ రకమైన ఆదేశాలు జారీ చేసిందా.. లేక ఒట్టి పుకారేనా టీచర్లు తేల్చకోలేకపోయారు.

ఈ క్రమంలో విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు.

రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్‌ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతోపాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు..

''కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందిస్తున్నా. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలి. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలి.

సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలి. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి''అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నర్సింహా, జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు..

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే..

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది.

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్‌ కల్యాణ్ సమావేశమై చర్చించారు.

మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచిన జనసేనాని.. స్థానిక ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం పోతిన మహేశ్‌ పవన్‌ను కలిశారు.

మరో రెండ్రోజుల్లో అభ్యర్థులను ఫైనల్‌ చేసేందుకు కసరత్తు చేస్తునట్టు సమాచారం. మార్చి 30న పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు..

కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు.

2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్టచతుష్టం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు.

మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసే వారే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్ధులని జగన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకువస్తుందని, ఆ తర్వాత అది చెత్త బుట్టకే పరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసింది ఎవరో అందరికి తెలుసన్నారు. హంతుకుడికి తన ఇద్దరి చెల్లెమ్మలు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.�

Delhi CM: లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు..

లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.

కేజ్రీవాల్‌కు డయాబెటిస్ ఉందని, షుగర్ లెవల్స్ సరిగ్గా లేవన్నారు. గడిచిన రెండేళ్లలో ఈడీ 250 పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిందని ఒక్క పైసా దొరలేకదన్నారు.

మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఎలాంటి డబ్బులు దొరకలేదని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడన్నారు. తన శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే ఉందని వెల్లడించారు.

రేపు కోర్టు ముందుకు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈనెల 21వ తేదీన అరెస్ట్ చేశారు. 22న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు న్యాయస్థానం 6 రోజుల ఈడీ కస్టడీకి విధించింది. ఈరోజుతో ఈడీ కస్టడీ ముగుస్తుంది. రేపు కేజ్రీవాల్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను మరో ఐదు రోజులు ఈడీ అధికారులు కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

ప్రధాని మోడీ నివాసం వద్ద నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవా ల్‌ అరెస్టుకు నిరసనగా

ఆమ్ ఆద్మీ పార్టీ మంగళ వారం ప్రధాని మోడీ నివాసం వద్ద నిరసన చేపట్టనుంది.

దీంతో ఢిల్లీ పోలీసులు ప్రధాని నివాసం వద్ద భద్ర తను పటిష్టం చేశారు.

దేశ రాజధానిలోని పలు ప్రాంతా ల్లో కూడా పోలీసులు భద్రత ను పెంచారు.

నిరసనల కారణంగా న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోక లపై ఆంక్షలు విధించే అవ కాశం ఉందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు..

ఎమ్మెల్సీ కవితకు నేడు ముగియనున్న ఈడీ కస్టడీ

ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియ నున్నది.

దీంతో ఈడీ అధి కారులు బుధవారం ఉద యం 11.00 గంటలకు ఆమెను ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ లోని ప్రత్యేక కోర్టులో హాజ రుపరుచనున్నారు.

ఈసందర్భంగా ఈడీ తనను అక్రమంగా అరెస్ట్‌ చేసిందని కవిత మరోమారు న్యాయ స్థానానికి తెలియజేయ నున్నారు. కేవలం రాజకీయ కక్షతో నమోదైన కేసు అని వివరించనున్నారు.

తనను విడుదల చేయాలని కోరనున్నారు. ఈడీ అధికా రులు ఈ నెల 15న కవిత ను అరెస్ట్‌ చేసి 16న కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

మొదట వారం రోజులు కస్టడీ విధించిన కోర్టు..23వ తేదీన మరో మూడు రోజులు పొడిగించింది...