ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను.. ఆదరించండి.గెలిపించండి.. శింగనమల వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాను.. ఆదరించండి.గెలిపించండి.. శింగనమల వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
ప్రజలకు, జగనన్నకు బాధ్యుడనై ఉంటూ, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తాను.. ఆదరించి..గెలిపించండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండలం దుర్గం, సిద్దరాచెర్ల, బోయకొట్టాల, గొల్లపల్లి, కమ్మకొట్టాల, మాలవాండ్లపల్లి, బండ్లపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ సీపీ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి ఆయన చేపట్టారు.
ముందుగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల మేలును వివరించారు. శింగనమల స్థానిక బిడ్డగా వస్తున్నా అందుబాటులో ఉంటాను, ఆదరించండి మీకు సేవకుడిగా పని చేస్తాను. రానున్న ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును "ఫ్యాన్" గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్దంలో పేదల పక్షాన నిలిచిన జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. పేదలకు మెరుగైన విద్య, వైద్యం, సంక్షేమాభివృద్దే ధ్యేయంగా పరిపాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్య, వైద్యం సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు. జగనన్న చేసిన సంక్షేమాన్ని చూసి రానున్న ఎన్నికలలో గెలవలేని భయంతో, టిడిపి, జనసేన, బిజెపి, మరికొన్ని పార్టీలు జతకట్టి జగనన్నని ఓడించడానికి వస్తున్నాయన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఇచ్చిన మాట ప్రతి హామీని నెరవేర్చిన సంక్షేమ ప్రధాత జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 28 2024, 07:11