సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నాం.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు..శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నాం.. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు.. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగనన్నదే విజయం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలు ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను గెలిపించుకుంటామన్నారని ఎం. వీరాంజనేయులు, ఎం. శంకర్ నారాయణ అన్నారు.
శింగనమల మండలం లోలూరు, రఘునాథపురం, ఆకులేడు, నాగులగుడ్డం, నాగులగుడ్డం తండా గ్రామాల్లో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, ఆలూరు సాంబ శివారెడ్డితో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ, చేపట్టారు.
ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలలతో సన్మానించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను, అవ్వ తాతలను పలకరిస్తూ వైఎస్సార్సీపీ చేసిన మేలును వివరించారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, రాబోయే ఎన్నికలలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగనన్నదే విజయమన్నారు. టిడిపి, జనసేన, బిజెపితో పాటు ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా జగనన్నని తాకలేరన్నారు. గత టిడిపి పాలనలో పాలకులు దోచుకోవడానికి మాత్రమే పరిపాలించారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరిస్తుందన్నారు. వెళ్లిన ప్రతి గ్రామంలో సంక్షేమం కనిపిస్తోందని, టిడిపి ఎన్ని కూటములతో వచ్చినా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు వారి మాటను తెలియజేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎంత మందితో వచ్చినా జగనన్న సింగల్ గా అఖండ మెజారిటీతో మళ్లీ తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ వారితో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకొని ఆ గ్రామాల్లో బస చేయడం వల్ల ప్రజలకు మరింత దగ్గర అవడం ఎంతో సంతోషం ఇస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Mar 27 2024, 07:32