NLG: జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు

ఈరోజు నల్లగొండలో ఎన్జీ కాలేజ్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఓటర్ అవేర్నెస్ రన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఏఎస్పి, అధికారులు, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఫుట్బాల్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు జిల్లా కలెక్టర్ హరిచందన, ఏఎస్పీ రాములు నాయక్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుల వెంట శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మాపాల గిరిబాబు ఉన్నారు.

NLG: ఓటరు అవగాహన.. 5 కే రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన

నల్లగొండ: ఓటరు అవగాహన కార్య క్రమంలో భాగంగా పట్టణం లో నైతిక ఓటింగ్ పై ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను, జిల్లా కలెక్టర్ హరిచందన జండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కు ను వినియోగించుకోవాలన్నారు. 85 సం.లు నిండిన ఓటర్ల కు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్ 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు, అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా అమరజీవి ధర్మ బిక్షం 13 వ వర్ధంతి

మర్రిగూడ: సిపిఐ మండల కార్యాలయంలో, నేడు అమరజీవి కామ్రేడ్ ధర్మబిక్షం 13 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ..  అమరులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 1922 ఫిబ్రవరి 15 జన్మించి , తన విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు పార్టీ కి ఆకర్షితులై, సాయుధ రైతాంగ, తెలంగాణ పోరాటం లో విరోచిత పోరాటం చేశారు. దున్నే వానికే భూమి, గీసే వానికే చెట్టు కావాలని జరిపిన పోరాటంలో 8 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి, అనంతరం జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులు గా, రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించారని, గీత కార్మికులకు సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత ధర్మ బిక్షం గారి దేనని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, జిల్లా యూత్ అద్యక్షుడు బూడిద సురేష్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు చెల్లం పాండు రాంగరావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘమయ్య, ఐతగోని వెంకటయ్య, నిరంజన్, AISF ఏ.ఐ.ఎస్.ఎఫ్ మండల కార్యదర్శి ఇస్కీళ్ళ మహేందర్, సుభాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: చర్లగూడెంలో ఘనంగా నీలకంఠ రామస్వామి వారి రథోత్సవం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, చర్లగూడెం గ్రామంలో నీలకంఠ రామ స్వామివారి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, వెన్నమనేని రవీంద్రరావు, దేవాలయ కమిటీ చైర్మన్ రాపొల్ యాదగిరి, వెంకటం పేట బాలయ్య, దేవాదాయ కమిటీ మెంబర్లు మంచుకొండ వెంకటేశ్వర్లు, వల్ల భాస్కర్ గౌడ్, ఏర్కలి యాదయ్య గౌడ్, జమ్మల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్గొండ జిల్లా ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఈ రోజు నల్గొండ జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో హోలీ పండగ కొత్త కాంతులను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తూ.. ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా హోలీ పండగను జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

NLG: జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు

నల్లగొండ: జిల్లా ప్రజలకు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సహజమైన, ప్రకృతి సిద్ధమైన రంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో హోలీ రంగేళి ని నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

NLG: నల్లగొండ పట్టణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మొదటి సమావేశం

నల్లగొండ పట్టణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ మొదటి సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కంభంపాటి రవి మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి పాటు పడతానని, సభ్యుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తానని, వచ్చే నూతన టెక్నాలజీని సభ్యులకు తెలిసే విధంగా వర్క్ షాప్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

TG: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది.

ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణా కు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణా కు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల లలో ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

NLG: చత్రపతి శివాజీ(CSL )ఫుట్బాల్ లీగ్స్.. వేసవి కాలంలో మహిళ ఫుట్బాల్ లీగ్స్ పోటీల నిర్వహణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 6 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో సూర్యాపేట ఫుట్బాల్ క్లబ్, మేకల స్టేడియం ఫుట్బాల్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 1-0 స్కోర్ తో అభినవ్ స్టేడియం జట్టు విజయం సాధించింది.

ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాచూరి లక్ష్మిగణేష్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని రాబోయే వేసవి కాలంలో 8 నుండి 10 సంవత్సరాలలోపు బాల బాలికలకు, సీనియర్ సిటిజన్స్ కు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, మరియు మహిళలకు ప్రత్యేకమైన ఫుట్బాల్ లీగ్ కాంపిటీషన్స్ నిర్వహించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు

ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన MCC 9 కాంపిటీటివ్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ పాముల అశోక్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో, గత 13 సంవత్సరాల నుంచి ఎంతోమంది కబడ్డీ, ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసి తెలంగాణ రాష్ట్రానికి అందించి మన నల్లగొండ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా కృషిచేసిందని తెలియజేస్తూ, క్రీడలు అంటేనే క్రమశిక్షణ, సమయపాలన, క్యారెక్టర్లతో కూడిన వ్యవహారమని దీనిని ప్రతి ఒక్క క్రీడాకారుడు పాటించి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు.అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.

ఫుట్బాల్ క్రీడాకారినులు మైనం వకుళ మరియు అప్పల సోనీ లు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో మేము గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం సాధన చేస్తూ, రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్నాము. భవిష్యత్తులో కూడా కోచ్ లు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క భవిష్యత్తు కు బాటలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, రాచూరి లక్ష్మీగణేష్, కత్తుల హరి,జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, మురళి, తదితరులు పాల్గొన్నారు

NLG: బీజేవైఎం నల్లగొండ పట్టణ అధ్యక్షులుగా దుబ్బాక సాయికిరణ్

నల్లగొండ: బిజెపి జిల్లా కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా నల్లగొండ పట్టణ అధ్యక్షునిగా దుబ్బాక సాయికిరణ్ నియామకం. బిజెపి పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా దుబ్బాక సాయికిరణ్ మాట్లాడుతూ.. నా నమ్మకంతో నన్ను పట్టణ అధ్యక్షులుగా నియమించిన పట్టణ అధ్యక్షులు కు మరియు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.