NLG: నల్గొండ జిల్లా ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఈ రోజు నల్గొండ జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో హోలీ పండగ కొత్త కాంతులను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తూ.. ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా హోలీ పండగను జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

NLG: జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు

నల్లగొండ: జిల్లా ప్రజలకు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సహజమైన, ప్రకృతి సిద్ధమైన రంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో హోలీ రంగేళి ని నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

NLG: నల్లగొండ పట్టణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మొదటి సమావేశం

నల్లగొండ పట్టణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ మొదటి సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కంభంపాటి రవి మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి పాటు పడతానని, సభ్యుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తానని, వచ్చే నూతన టెక్నాలజీని సభ్యులకు తెలిసే విధంగా వర్క్ షాప్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

TG: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది.

ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణా కు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణా కు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల లలో ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

NLG: చత్రపతి శివాజీ(CSL )ఫుట్బాల్ లీగ్స్.. వేసవి కాలంలో మహిళ ఫుట్బాల్ లీగ్స్ పోటీల నిర్వహణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 6 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో సూర్యాపేట ఫుట్బాల్ క్లబ్, మేకల స్టేడియం ఫుట్బాల్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 1-0 స్కోర్ తో అభినవ్ స్టేడియం జట్టు విజయం సాధించింది.

ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాచూరి లక్ష్మిగణేష్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని రాబోయే వేసవి కాలంలో 8 నుండి 10 సంవత్సరాలలోపు బాల బాలికలకు, సీనియర్ సిటిజన్స్ కు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, మరియు మహిళలకు ప్రత్యేకమైన ఫుట్బాల్ లీగ్ కాంపిటీషన్స్ నిర్వహించడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు

ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన MCC 9 కాంపిటీటివ్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ పాముల అశోక్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో, గత 13 సంవత్సరాల నుంచి ఎంతోమంది కబడ్డీ, ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసి తెలంగాణ రాష్ట్రానికి అందించి మన నల్లగొండ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా కృషిచేసిందని తెలియజేస్తూ, క్రీడలు అంటేనే క్రమశిక్షణ, సమయపాలన, క్యారెక్టర్లతో కూడిన వ్యవహారమని దీనిని ప్రతి ఒక్క క్రీడాకారుడు పాటించి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు.అనంతరం క్రీడాకారులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.

ఫుట్బాల్ క్రీడాకారినులు మైనం వకుళ మరియు అప్పల సోనీ లు మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో మేము గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం సాధన చేస్తూ, రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్నాము. భవిష్యత్తులో కూడా కోచ్ లు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ మా యొక్క భవిష్యత్తు కు బాటలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, రాచూరి లక్ష్మీగణేష్, కత్తుల హరి,జాకటి బాలరాజు, అప్పల లింగయ్య, మురళి, తదితరులు పాల్గొన్నారు

NLG: బీజేవైఎం నల్లగొండ పట్టణ అధ్యక్షులుగా దుబ్బాక సాయికిరణ్

నల్లగొండ: బిజెపి జిల్లా కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా నల్లగొండ పట్టణ అధ్యక్షునిగా దుబ్బాక సాయికిరణ్ నియామకం. బిజెపి పట్టణ అధ్యక్షులు కంకణాల నాగిరెడ్డి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా దుబ్బాక సాయికిరణ్ మాట్లాడుతూ.. నా నమ్మకంతో నన్ను పట్టణ అధ్యక్షులుగా నియమించిన పట్టణ అధ్యక్షులు కు మరియు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

మునుగోడు మండలంలో బిజెపి పార్టీ బూత్ కమిటీ సమావేశం

మునుగోడు: మండలంలో కల్వలపల్లి, పులిపల్పల, జమస్తాన్ పల్లి గ్రామాలలో ఆదివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెంబళ్ల జానయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం వేణు కుమార్ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ హాజరు అయి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త బూత్ లెవెల్లో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి చంద్రకళ, మాదగోని నరేందర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముంగి ధనుంజయ, నియెజక వర్గ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

శివన్నగూడ రిజర్వాయర్ పనులు అడ్డగింత

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామంలో, నిర్మాణంలో ఉన్నటువంటి రిజర్వాయర్ పనులను భూ నిర్వాసితులు శనివారం ఉదయం అడ్డుకున్నారు. భూ నిర్వాసితులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి నష్టపరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని కోరారు. దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు పై స్థాయి అధికారులకు విన్నవించి సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో నిరసన విరమించారు.

NLG: ముర్రుపాలు పట్టించడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది: సూపర్వైజర్ పద్మ

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లలకు గంట లోపు తల్లిపాలు ముర్రుపాలు (తల్లిపాలు) పట్టించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఉమాదేవి, అంగన్వాడీ టీచర్లు చాపల పద్మ, అండాలు ఆశాలు సైదాబీ, ఏర్పుల పద్మ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

అండర్-20 బాలుర రాష్ట్రస్థాయి ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ కు ముగ్గురు క్రీడాకారులు ఎంపిక

NLG: ఏప్రిల్ నెలలో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరగబోయే అండర్-20 బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు గాను, ఈరోజు నుండి 3 రోజుల పాటు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ జింఖానా ఫుట్బాల్ గ్రౌండ్స్ నందు రాష్ట్ర జట్టు సెలక్షన్ ట్రయల్స్ ను నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ZPHS హైస్కూల్ నందు ఫుట్బాల్ కోచ్ లు గడసంతుల మధుసూదన్, మరియు మద్ది కరుణాకర్ పర్యవేక్షణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సెలక్షన్ ట్రయల్స్ ను నిర్వహించి ముగ్గురు ఫుట్బాల్ క్రీడాకారులు G.కుశాల్, మేకల దాసు, N.వెంకన్న లను ఎంపిక చేసినట్లు TFA రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

SB NEWS