చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం...శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు
చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం...శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన సంక్షేమాభివృద్ధి పాలనకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని నియోజకవర్గ అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు.
"మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గార్లదిన్నె మండలం పెనకచెర్లడ్యాం, పెనకచెర్ల, పి.కొత్తపల్లి, కేశవాపురం, కొప్పలకొండ గ్రామాలలో రెండవ రోజు స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వైయస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని అయన చేపట్టారు.
పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరిస్తూ, ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని తెలిపారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలను అందించి అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సైనికుల్లా పనిచేద్దామన్నారు. అన్ని వర్గాలకు మీరు చేసిన జగనన్నను రాబోయే ఎన్నికలలో మళ్ళీ గెలిపించాలని కోరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. టీడీపీ ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదనే విషయాన్ని గుర్తు చేశారు. కుల, మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీ కే దక్కుతుందన్నారు.
ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చి ప్రజల గుండెల్లో నమ్మకాన్ని పొందారన్నారు. పొత్తులతో వస్తున్న టిడిపిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని చెబుతున్నారన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నెరవేర్చారన్నారు. జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి గ్రామాల్లో ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
ఎన్నికల ప్రచారం అనంతరం గ్రామాల్లోని ఎస్సీ కాలనీలలో "పల్లెనిద్ర" అనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు
Mar 25 2024, 07:33