బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ""కార్యక్రమం నిర్వహించిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు..
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని K.V.S నగర్ దక్షిణ మూర్తి నగర్ ఐలమ్మ కాలనీ గిరిప్రసాద్ నగర్ వీరభద్ర కాలనీ ""బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ""కార్యక్రమం నిర్వహించిన జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, అశోక్ లక్ష్మి నారాయణ SK,వేంకటేశు S.నారాయణ స్వామి కేశన్న సందర్భంగా మాట్లాడుతూ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.మహిళల కోసం మంచి పథకాలు పొందుపరిచారన్నారు.ఇందులో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18 వేల రూపాయలు, తల్లికి వందనం పథకం కింద పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఒక్కొక్కరికి 15000 చొప్పున ఎంతమందిని బడికి పంపిస్తే అంతమందికి వర్తింపజేసేలా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు,ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి ఇచ్చి వారిని పూర్ టు రిచ్ అయ్యేలా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి యువతను మోసం చేశారన్నారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అలాగే శింగనమల అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి బండారు"" శ్రావణి శ్రీ ""గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నల్లాని నాగభూషణ మల్లికార్జున రెడ్డి రామానాయుడు వేంకట సబ్బయ్య నరేంద్ర యాదవ్ ఓబులపతి తలారి రంగయ్య జొన్నరామయ్య పెద్దప్ప బోలే అక్కలప్ప మదు ఎల్లప్ప వడ్డే రామకృష్ణ బాబయ్య చితంబరి హరి భూషి చెరకూరి అడవాల రవి శేషు కాటమయ్య రాజు యుగంధర్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.
Mar 25 2024, 07:26