ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని గెలిపిద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని గెలిపిద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

◆ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ.

పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని రానున్న ఎన్నికలలో మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని వీరాంజనేయులు, ఎం.శంకర్ నారాయణ అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా, పార్టీ జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తల మధ్య ఎం. శంకర్ నారాయణ, ఎం. వీరాంజనేయులు, పైలా నరసింహయ్య ప్రారంభించారు.

ముందుగా గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలాంపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి పాత చెదళ్ల, కొత్త చెదళ్ల, రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఇంటింటికీ తిరిగి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించుకుందామన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే శింగనమల నియోజకవర్గాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ కరపత్రం అందజేస్తూ ఓటు అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులను కళ్లారా చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభ్యున్నతి కోసం నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. గత టిడిపి పాలనలో ప్రజలకు ఫలానా చేసాము అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో జగనన్న మీద తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విదంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అభివృద్ధి చేసి చూపించారన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకున్న పాపాన పోని టీడీపీ నాయకులు కూడ అభివృద్ధి గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాల కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

శంకర్ నారాయణ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులకు అవకాశం కల్పించిన వైస్సార్సీపీ పార్టీ పేదల పార్టీగా జగనన్న నిరూపించారన్నారు. చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించారన్నారు. గత టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే సంక్షేమ పథకాలు అందడంతో తమ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. గొప్ప పాలన ఇలాగే కొనసాగాలి అంటే మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ మాల్యవంతం మంజుల, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

పల్లె నిద్ర చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజి నేయులు..

పల్లె నిద్ర చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజి నేయులు..

పల్లె నిద్రలో కార్యక్రమంలో స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం తర్వాత "పల్లె నిద్ర" కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో బస చేయటం జరిగింది. గ్రామ సమస్యలపై ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. వాటి పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమస్యలను గుర్తించి తాము కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు

ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మళ్లీ రౌడీ రాజ్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..

శిగనమ నియోజకవర్గం నార్పల మండలం నరసాపురం గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు గ్రామం లో ర్యాలీ నిర్వహించి మొదటగా పెద్దమ్మ స్వామి,శ్రీ సీత రాముల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైసీపీ అదికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అందకారం అయిందని ఒక ఛాన్స్ తో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంను సర్వనాశనం చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు, దాడులుకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఏదీ ఏమైనా ఎన్నికలలో టీడీపీదే విజయమన్నారు.వైసీపీ ని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చిత్తుగా ఓడించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిని చేసారని వచ్చిన నిధలున్ని వైసీపీ నేతలు రంగులు పిచ్చితో టీడీపీ హయంలో నిర్మించిన భవనాలుకు రంగులు వేశారన్నారు. తమ సొంత పేపరుకు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు.శిoగనమల నియోజకవర్గం లో ఎక్కడ చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది అని తెలియజేసారు.

 తెలుగుదేశం పార్టీలోకి చేరిన పలువురు వైసిపి నాయకులు

ఇదే గ్రామం లో నుండి వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ లోకి చేరిన మాజీ వైస్ సర్పంచ్ సుశీలమ్మ,వైసిపి నాయకులు సీవీ గోపాల్ రెడ్డి,లింగారెడ్డి వీరి తరుపున వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరారు. వారికి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానిoచిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు..

ఈ కార్యక్రమం లో మండలo లోని సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీలు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలో టిడిపి శ్రేణులు విస్తృత ప్రచారం

భారీ జన సంద్రోహం మధ్య బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి గారు మరియు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో బండారు శ్రావణి శ్రీ  సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు..

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీ లోని చేపల కాలనీ లోను, ఊర్లో ను ఇంటి ఇంటి దగ్గరకు వెళ్లి టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి గారికి ఓటు వేసి వేపించి గెలిపించాలి అని కోరిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,టీడీపీ రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు , జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు , మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మరియు మాజీ ఎంపీపీ, మాజీ జెడ్ పి టి సి, ఎంపీటీసీలు , సర్పంచులు, టీడిపి ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీ లకు 50 ఏళ్లకే పెన్షన్, నెలకు రూ.4000 లు : బండారు శ్రావణి శ్రీ
బీసీ లకు 50 ఏళ్లకే పెన్షన్, నెలకు రూ.4000 లు : బండారు శ్రావణి శ్రీ


టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం లో బీసీ లకు 50 ఏళ్ళ కే పెన్షన్, నెలకు రూ.4,000 లు ఇవ్వడం జరుగుతుందని టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలిపారు.

సింగనమల నియోజకవర్గం : సింగనమల మండలంలోని ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి, కొరివిపల్లి, అలంకరాయపేట గ్రామాల యందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగినది. 

  గ్రామాలలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాల గురించి కర్రపత్రాలను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ బిసి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4000 లు, పెన్షన్ అందించడంతో పెళ్లి కానుక కింద లక్ష రూపాయల సహాయం, బీసీ విద్యార్థుల స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, షరతులు లేకుండా విదేశీ విద్యా పథకం, బీసీ సంరక్షణ చట్టం, శాశ్వతంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, తదితర పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

  ఈ కార్యక్రమం నందు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బండారు శ్రావణశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతో పొత్తులు.. జగనన్న వెంట జనం..రానుంది వైసీపీ ప్రభుత్వం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజినేయులు.

ప్రజా సంక్షేమానికి వైఎస్సార్సీపీ పెద్ద పీట.. టీడీపీ పాలనలో ప్రజలకు చేసింది శూన్యం.. ఓటమి భయంతో పొత్తులు.. జగనన్న వెంట జనం..రానుంది వైసీపీ ప్రభుత్వం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజినేయులు.

ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గత టీడీపీ పరిపాలనలో ప్రజలకు చేసింది శూన్యం అని వీరాంజ నేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జనచైతన్య నగర్, ఎల్బీ కాలనీ, ఏబీ బర్ధన్ కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. టిడిపి పార్టీ పొత్తులతో ప్రజలను మోసం చేయడానికి వస్తుందని మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపి "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. గత టిడిపి పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేకపోవడంతో జగనన్న ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్, టిడిపి పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్సిపి అధికారం చేపట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఐదేళ్ల పాలనలో మీకు మంచి జరిగింటే ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో టిడిపిని ప్రజలు ఓడించి, వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బంగారం కోసం వృద్ధురాలు నీ హత్య చేసిన కుటుంబ సభ్యులు

అనంతపురం 

బంగారం కోసం వృద్ధురాలు నీ హత్య చేసిన కుటుంబ సభ్యులు 

గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది

ఓబులమ్మ (85)అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైనది

అదే గ్రామానికి చెందిన ఐదు మంది కుటుంబ సభ్యులు హత్య చేసినట్టు తెలిపిన పోలీసులు

వృద్ధురాలు వద్ద ఉన్న బంగారం తీసుకుని వెనక్కి అడిగినందుకే హత్య చేసిన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు

శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పక్కనే ఉన్న పెనకచర్ల డ్యాంలో పడేసిన హంతకులు

హత్య చేసిన హంతకులు పోలీసుల అధీనంలో ఉన్నట్టు సమాచారం

వైసీపీ ఓటు వేస్తే.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.. టీడీపీ నేతలు రామలింగారెడ్డి, పశువుల హనుమంతురెడ్డి, పర్వతనేని శ్రీధర్ బాబు..

వైసీపీ ఓటు వేస్తే.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.. టీడీపీ నేతలు రామలింగారెడ్డి, పశువుల హనుమంతురెడ్డి, పర్వతనేని శ్రీధర్ బాబు..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకు ఓటు వేస్తే... మళ్లీ రౌడీ రాజ్యం వస్తే... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డిలు జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు పసుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికారప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు అన్నారు. బుధవారం బుక్కరాయసముద్రంలోని గౌరయ్యా సెను కొట్టాలు, ఇందిరమ్మ కాలనీల లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణీశ్రీని గెలిపించాలని ఓటర్లును కోరారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అందకారం అయ్యిందన్నారు. ఒక ఛాన్స్ తో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంను సర్వనాశనం చేశారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు, దాడులుకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఏదీ ఏమైనా... వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీదే అంతిమ విజయమన్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిని చేశారన్నారు. వచ్చిన నిధలున్ని వైసీపీ నేతలు రం గులు పిచ్చితో టీడీపీ హయంలో నిర్మించిన భవనాలుకు రంగులు వేశారన్నారు. తమ సొంత పేపరుకు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో.... చూపించాలని సవాల్ విసిరారు. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణీశ్రీని భారీ మోజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బుక్కరాయసముద్రంలో చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు

సింగనమల నియోజకవర్గం సేవకరాలుగా ఉంటా.. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ..

సింగనమల నియోజకవర్గం సేవకరాలుగా ఉంటా.. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ.. 

గ్రామ గ్రామాల్లో టీడీపీ అభ్యర్థికి ఘన స్వాగతాలు..

అందరి నోట.. శ్రావణమ్మ గెలుపు మాట..

గార్లదిన్నె మండలంలో ఇంటింటి ప్రచారంలో ఆపూర్వ స్వాగతం!..

గార్లదిన్నె ,మార్చి21: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మీ ఆడ బిడ్డ అయిన.. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడలని, శింగనమల నియోజకవర్గం ప్రజలకు రాజకీయ నేతగా కాకుండా ఓ సేవకరాలుగా పనిచేసి చూపిస్తానని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు. గురువారం గార్లదిన్నె మండలంలోని క్రిష్ణాపురం, ఇల్లూరు గ్రామాల్లో ఆమెతో పాటు ముఖ్య అతిథిలుగా ద్విసభ్యకమిటీ సభ్యలు ముంటిమడుగు కేశవరెడ్డి హజరై మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లినా.. టీడీపీ అభ్యర్థి శ్రావణిశ్రీ కు ప్రజలు నుంచి అపూర్వ స్పందన వస్తుంది. మహిళలు హరతిలు పట్టి, ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన... ఈ సారి శ్రావణమ్మ గెలుస్తుంది..... పైన సీఎంగా చంద్రబాబు నాయుడు అవుతారన్న మాట అందరి నోట వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని.... నియోజకవర్గ ప్రజలుకు రాజకీయ నేతగా కాకుండా సేవకరాలుగా ఉంటానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజలుకు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలుకు సేవ చేయాలని దృడ సంకల్పంతోనే రాజకీయలలోకి వచ్చానని ఓటర్లురు తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమిని భ య పడలేదని, ఏదీ ఏమైనా.. ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని నియోజక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను గెలిపిస్తే నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే.. తమ లక్ష్యమని అని తెలిపారు.

 టిడిపి వస్తే మహిళలుకు ఆర్థికభివృద్ది- శ్రావణిశ్రీ, , ముంటి మడుగు కేశవరెడ్డి 

 రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి లు అన్నారు. తెలుగుదేశం విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలలో మహిళల పెద్ద

పెద్ద పీఠ వేసిందన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు సవరత్నాలు పేరుతో కేవలం కొంత మంది వైసీపీ కార్యకర్తలకే పథకాలు వచ్చాయన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలుకు న్యాయం చేస్తామన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రైతాంగంను అదుకోవడంలో వైసీపీ తీవ్ర విఫలమైందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెల్లినా... తాగు నీటి కోసం ప్రజలు అల్లాడి పోతున్నారన్నారు.

సైకిల్ గుర్తుకు ఓట్ వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఏమ్మెల్యేగా. చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం.. ఆలం నరస నాయుడు ..

సైకిల్ గుర్తుకు ఓట్ వేసి బండారు శ్రావణి శ్రీ గారిని ఏమ్మెల్యేగా గెలుపిoచుకొని చంద్రబాబు నాయుడు గారి ని ముఖ్యమంత్రి గా చేసుకుందాం.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం ముగేతిమ్మoపల్లి,జంగారెడ్డిపల్లి, రంగాపురం గ్రామాల లో శిoగనమల నియోజకవర్గ ;(టీడీపీ-జనసేన-బిజెపి) ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల YCP ప్రభుత్వం ఆరాచకాలను తెలియజేసారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. రంగాపురం గ్రామం లో గజమాలతో సత్కరించి మహిళలు భారీగా వచ్చి హారతులు ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది. 

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.. కార్యక్రమంలో మండలo లోని సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీ లు మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, క్లస్టర్, యూనిట్, బుత్ ఇంచార్జ్ లు గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.