రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు
ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మళ్లీ రౌడీ రాజ్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..
శిగనమ నియోజకవర్గం నార్పల మండలం నరసాపురం గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు గ్రామం లో ర్యాలీ నిర్వహించి మొదటగా పెద్దమ్మ స్వామి,శ్రీ సీత రాముల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైసీపీ అదికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అందకారం అయిందని ఒక ఛాన్స్ తో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంను సర్వనాశనం చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు, దాడులుకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఏదీ ఏమైనా ఎన్నికలలో టీడీపీదే విజయమన్నారు.వైసీపీ ని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చిత్తుగా ఓడించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిని చేసారని వచ్చిన నిధలున్ని వైసీపీ నేతలు రంగులు పిచ్చితో టీడీపీ హయంలో నిర్మించిన భవనాలుకు రంగులు వేశారన్నారు. తమ సొంత పేపరుకు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు.శిoగనమల నియోజకవర్గం లో ఎక్కడ చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది అని తెలియజేసారు.
తెలుగుదేశం పార్టీలోకి చేరిన పలువురు వైసిపి నాయకులు
ఇదే గ్రామం లో నుండి వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ లోకి చేరిన మాజీ వైస్ సర్పంచ్ సుశీలమ్మ,వైసిపి నాయకులు సీవీ గోపాల్ రెడ్డి,లింగారెడ్డి వీరి తరుపున వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరారు. వారికి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానిoచిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు..
ఈ కార్యక్రమం లో మండలo లోని సీనియర్ నాయకులు,మాజీ ఎంపీపీలు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Mar 23 2024, 07:12