ఓటమి భయంతో పొత్తులు.. జగనన్న వెంట జనం..రానుంది వైసీపీ ప్రభుత్వం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజినేయులు.
ప్రజా సంక్షేమానికి వైఎస్సార్సీపీ పెద్ద పీట.. టీడీపీ పాలనలో ప్రజలకు చేసింది శూన్యం.. ఓటమి భయంతో పొత్తులు.. జగనన్న వెంట జనం..రానుంది వైసీపీ ప్రభుత్వం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజినేయులు.
ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గత టీడీపీ పరిపాలనలో ప్రజలకు చేసింది శూన్యం అని వీరాంజ నేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జనచైతన్య నగర్, ఎల్బీ కాలనీ, ఏబీ బర్ధన్ కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. టిడిపి పార్టీ పొత్తులతో ప్రజలను మోసం చేయడానికి వస్తుందని మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలిపి "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. గత టిడిపి పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేకపోవడంతో జగనన్న ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్, టిడిపి పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్సిపి అధికారం చేపట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. ఐదేళ్ల పాలనలో మీకు మంచి జరిగింటే ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో టిడిపిని ప్రజలు ఓడించి, వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Mar 23 2024, 06:53