మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము. పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి
మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము.
పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి
*ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీకే అన్నారంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ*
నల్గొండ జిల్లా :-
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారి ఆశయాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈ రోజు జీకే అన్నారం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) నల్గొండ ఆధ్వర్యంలో *సంకల్ప హాస్పిటల్ , ప్రభుత్వ PHC రాములబండ వారి సహకారంతో* ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పెట్టి చాకిరి విముక్తి కావాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యతిరేకంగా నిలబడి తుపాకీ బట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు. భూమి భుక్తి విముక్తి పోరాటాలు ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశముకుల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన పదకొండవ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని అన్నారు. నేటి పాలకులు మద్యం మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నాయని అన్నారు.
ప్రజలు విద్యా వైద్యం ఉపాధి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని గ్రామాలలో వృద్ధులు పిల్లలు సరియైన పౌషక ఆహారము లేక సరియైన వైద్యం చేయించుకోలేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అత్యధిక మంది ప్రజలు తమ ఆరోగ్యాలను పరీక్షించుకొని ఉచితంగా మందులు పొందారని అన్నారు. రాములబండ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రభుత్వం వారిచే డాక్టర్ తిరుమల్ డాక్టర్ భాస్కర్ పద్మ సూపర్వైజర్ మరియు నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లో గల సంకల్ప ఆసుపత్రి బృందం డాక్టర్ కరీముల్లా జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లీనా మాధురి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్వల చిన్న పిల్లల డాక్టర్లు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కమిటీ సభ్యురాలు కొండ అనురాధ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న మండల కమిటీ సభ్యులు బోల్లు రవీందర్ కుమార్ సంకల్ప ఆసుపత్రి సహాయకులు రాము శ్రీకాంత్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కొండ అనురాధ,
రాష్ట్ర కమిటీ సభ్యురాలు
ఐద్వా నల్లగొండ తదితరులు పాల్గొన్నారు.
Mar 22 2024, 18:05