వైసీపీ ఓటు వేస్తే.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.. టీడీపీ నేతలు రామలింగారెడ్డి, పశువుల హనుమంతురెడ్డి, పర్వతనేని శ్రీధర్ బాబు..
వైసీపీ ఓటు వేస్తే.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది.. టీడీపీ నేతలు రామలింగారెడ్డి, పశువుల హనుమంతురెడ్డి, పర్వతనేని శ్రీధర్ బాబు..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకు ఓటు వేస్తే... మళ్లీ రౌడీ రాజ్యం వస్తే... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డిలు జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు పసుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికారప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు అన్నారు. బుధవారం బుక్కరాయసముద్రంలోని గౌరయ్యా సెను కొట్టాలు, ఇందిరమ్మ కాలనీల లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణీశ్రీని గెలిపించాలని ఓటర్లును కోరారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అందకారం అయ్యిందన్నారు. ఒక ఛాన్స్ తో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంను సర్వనాశనం చేశారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు, దాడులుకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఏదీ ఏమైనా... వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీదే అంతిమ విజయమన్నారు. వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిని చేశారన్నారు. వచ్చిన నిధలున్ని వైసీపీ నేతలు రం గులు పిచ్చితో టీడీపీ హయంలో నిర్మించిన భవనాలుకు రంగులు వేశారన్నారు. తమ సొంత పేపరుకు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో.... చూపించాలని సవాల్ విసిరారు. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణీశ్రీని భారీ మోజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బుక్కరాయసముద్రంలో చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు
Mar 22 2024, 15:40