మహిళలను బస్సులో నుండి దించిన కండక్టర్

రాత్రి వేళ బస్సెక్కిన ఓ పది మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్‌ ఓవర్‌ లోడ్‌ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్య లో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసు కున్నది.

జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి బయలుదేరింది.

బస్సు ఓవర్‌ లోడ్‌ అయిందని, టికెట్లు ఇచ్చే మెషీన్‌లో చార్జింగ్‌ లేదని, మెషీన్‌ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతూ రూరల్‌ మండలంలోని తిమ్మాపూర్‌ శివారులో గల నల్లగుట్ట వద్ద పదిమంది మహిళలను కండక్టర్‌ దింపేశాడు.

దీంతో మహిళా ప్రయాణి కులు ముందుకు, వెనక్కి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని గ్రామస్థులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని ఎక్కించారు.

ఆ బస్సులోనూ ఓవర్‌లోడ్‌ ఉన్నదని కండకర్టర్‌ చెప్పగా, గ్రామస్థులు బతిమిలాడి బస్సు ఎక్కించి మహిళలను గమ్య స్థానాలకు దించాలని వేడుకున్నారు. ఈ విషయ మై డీఎం సునీతను సంప్ర దించగా స్పందించలేదని తెలిసింది...

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలకు అస్వస్థత నెలకొంది.

దీంతో హుటాహుటిన జన గామ మాత శిశు ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఐదుగురు విద్యార్థినిలకు ఫుడ్‌‌ పాయిజన్ అయినట్లు వెల్లడించారు వైద్యులు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు… వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

3 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెబు తున్నారు. కాగా…ఈ సంఘ టనపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

టెట్... టఫ్.. మాకొద్దు

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌,కాకుండా, తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు.

దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయను న్నట్టు ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే.

ఈ డీఎస్సీ పరీక్షకు ముందే టెట్‌ నిర్వహించాలని నిర్ణ యించి, షెడ్యూల్‌ ప్రకటిం చింది. దాని ప్రకారం అభ్య ర్థులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు సమ ర్పించాలి. టెట్‌ను కంప్యూ టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ సీబీటీ, పద్ధతిలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించ నున్నారు.

ఫలితాలను 20లోపు ప్రక టించనున్నారు. ఈ టెట్‌ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 20న జారీ చేయా ల్సి ఉంది. కానీ కొన్ని సాంకే తిక కారణాల వల్ల నిలిచిపో యింది. ఒకటి రెండు రోజు ల్లో విడుదల చేస్తామని అధి కారులు చెబుతున్నారు.

అయితే ఈ టెట్‌పై ఉపాధ్యా యులు కొంత అసంతృప్తితో ఉన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపి కైన వారు కచ్చితంగా టెట్‌ పాసై ఉండాలనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టెట్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారు.

రాష్ట్రం లో చాలామంది ఉపాధ్యా యులకు టెట్‌ సర్టిఫికెట్‌ లేదు. దాంతో వారికి పదోన్నతులు నిలిపి వేశారు. ఇలాంటి ఉపాధ్యా యులు ప్రస్తుతం ప్రకటించిన టెట్‌ రాసి, ఉత్తీర్ణులు కావా లని ప్రభుత్వం సూచిస్తోంది.

అయితే ఈ టెట్‌లో తాము ఉత్తీర్ణత సాధించలేమని, తమ కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

దీనికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేన్‌,ఎన్‌సీటీఈ నిబంధనలు అంగీకరిం చవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది...

తమిళనాడు ఎన్నికల బరిలో: మాజీ గవర్నర్ తమిళ్ సై

తెలంగాణ గవర్నర్‌గా పని చేసి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన తమిళసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిసింది..

భారతీయ జనతా పార్టీ బీజేపీ గురువారం విడుదల చేసిన మూడవ జాబితాలో తమిళనాడులోని 9 స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఫైర్‌బ్రాండ్ నేత తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కే. అన్నామలై కోయంబత్తూరు నియోజ కవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు.

కేంద్ర మంత్రి డా. ఎల్. మురుగన్ నీలగిరీస్ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి పొన్ రాధా కృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీ చేస్తున్నారు.

వెల్లూరు నుంచి డా. ఏసీ షణ్ముగన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి సెల్వన్, కృష్ణగిరి నుంచి సి. నరసిం హన్, పెరంబలూరు నుంచి టీఆర్ పారివేంధర్, తిరునె ళ్వేలి నుంచి నైనార్ నాగేం ద్రన్ పేర్లను బీజేపీ అధిష్టా నం ప్రకటించింది.

తమిళనాడుతో ఎన్డీఏ మిత్రపక్షాలతో సీట్ల సర్దు బాటు అనంతరం బీజేపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపి కపై కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది.

కాంగ్రెస్ మూడో జాబితా :ఐదుగురికి చోటు

ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితాను విడు దల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగు రికి చోటు దక్కింది.

పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి – సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ – దానం నాగేందర్‌, చేవెళ్ల- రంజిత్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ – మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజ రాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిలోని కొన్ని స్థానా లకు అభ్యర్థులను ప్రకటిం చారు.

తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో నాలు గు స్థానాలకు జహీరాబాద్‌ – సురేశ్‌ కుమార్‌ షెట్కర్‌, నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌- చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇంకా.. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన మూడు జాబితాల్లో కాంగ్రెస్‌ 139 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తర లించారు.

ఈ సందర్భంగా ఆప్‌ కార్య కర్తలు అడ్డుకోబోగా.. పోలీ సులు వారిని చెదరగొట్టారు. గురువారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ నుంచి మినహాయింపు నిరాకరిం చిన కొద్ది సేపటికే సెర్చ్‌ వారెంట్‌తో ఢిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది.

విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత ల సమస్య తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్‌ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

ఆప్‌ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్‌ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ భద్రతా సిబ్బంది నిలువ రించింది. లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ వ్యవహా రంలో తొమ్మిది సార్లు విచారణకు రావాలని పిలిచినా హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు.

మరోవైపు తనపై బలవం తపు చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశా లివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపు చ్చింది. దీంతో ఈడీ అరెస్టు చేసింది..

పాలీసెట్ పరీక్ష తేదీలో మార్పు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పు లు చేర్పులు చేస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికలున్న క్రమంలో ఆ రోజు, ముందు రోజు, తర్వాతి రోజుల్లో ఉన్న పరీక్షల తేదీలను మారుస్తున్నారు.

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పాలిసెట్‌, తేదీని మే 17 నుంచి మే 24వ తేదీకి వాయిదా వేశారు. ఈమేరకు బుధవారం సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటన చేశారు.

ఇక ఎప్‌సెట్‌కు కూడా ఒకటి, రెండ్రోజుల ముందుగానే ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలను పంపించారు. సర్కారు అనుమతినివ్వ గానే... కొత్త తేదీలను ప్రకటించనున్నారు.

ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు.. మే 9, 10వ తేదీల్లో ఇంజనీరింగ్‌, 11, 12వ తేదీల్లో అగ్రికల్చ ర్‌, ఫార్మసీ పరీక్షలను నిర్వ హించాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో కొంత ముందు గానే.. మే 7 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఏప్రిల్‌,మూడో వారంలో ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలా ఖరు నాటికి స్పాట్‌ వాల్యు యేషన్‌ను పూర్తి చేయను న్నారు.

తర్వాత అన్నీ సక్రమంగానే ఉన్నయా లేదా అనేది పరిశీలించి ఫలితాలను ప్రకటించనున్నారు...

ఈడీ అరెస్ట్‌, కస్టడీని సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన కవిత

•రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీట్రయల్‌ కోర్టు కస్టడీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ రేపు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు విచారణకు రానుంది.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను చేర్చింది. తన అరెస్ట్‌ అక్రమమని, కస్టడీ రాజ్యాంగ విరుద్ధ మంటూ సోమవారం 537 పేజీలతో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

గతంలో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌, పిటిషన్‌ పై విచారణ, కోర్టు ఉత్తర్వుల కాపీలు, మీడియా పబ్లిష్‌ చేసిన కథనాలను కవిత జత చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిం దని, పొలిటికల్‌ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని తన పిటిష న్‌లో కవిత ఆరోపించారు.

చట్టవ్యతిరేకంగా, కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేశారని మెన్షన్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమ లులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి కేసు తనపై లేదన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఈ అంశాలను పరిగ ణన లోకి తీసుకొని తాజా పిటి షన్‌పై తుది తీర్పు వెలువ డేవరకు తక్షణమే తనను విడుదల చేసేలా ఆదేశాలి వ్వాలని కోరారు. అలాగే ప్రస్తుత అరెస్ట్‌ పై స్టే విధిస్తూ, ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగవ రోజు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడీ అధికారులు

లిక్కర్ స్కాం కేసు లో ఆరో పణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను నాలుగో రోజు బుధవా రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట రేట్ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారించను న్నారు.

ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యా లయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండ రింగ్ కేసులో కవిత పాత్ర.. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడి యా కేజ్రీవాల్‌తో ఒప్పందా లు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.

రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్‌ లో కవిత భోజనం చేస్తు న్నారు.

ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమ ణులు అఖిల సౌమ్య, విను త, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకు నేందుకు అను మతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.

కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించి నట్టు తెలిసింది. కవిత తల్లి శోభ బుధ, గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్టు సమాచా రం. కాగా, రోజురోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతోంది.

మంగళ వారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, భోజన విరామం తర్వాత మధ్యా హ్నం 2 నుంచి 4.15 వరకు ప్రశ్నించినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపు టీ విరామం ఇచ్చి, మళ్లీ విచారణను ప్రారంభించి నట్టు తెలిసింది.

అందుకే, ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలి సేందుకు అవకాశం ఇవ్వగా, మంగళవారం మాత్రం 7 తర్వాత అనుమతిం చారు....

నేడు టీడీపీ 3వ జాబితా విడుదల?

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ వీడనుం దని సమాచారం.

కాగా, మొత్తం 25 ఏంపీ సీట్లకు గాను.. పొత్తులో భాగంగా టీడీపీకి 17 సీట్లు వచ్చాయి...