సింగనమల నియోజకవర్గం సేవకరాలుగా ఉంటా.. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ..
సింగనమల నియోజకవర్గం సేవకరాలుగా ఉంటా.. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ..
గ్రామ గ్రామాల్లో టీడీపీ అభ్యర్థికి ఘన స్వాగతాలు..
అందరి నోట.. శ్రావణమ్మ గెలుపు మాట..
గార్లదిన్నె మండలంలో ఇంటింటి ప్రచారంలో ఆపూర్వ స్వాగతం!..
గార్లదిన్నె ,మార్చి21: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మీ ఆడ బిడ్డ అయిన.. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడలని, శింగనమల నియోజకవర్గం ప్రజలకు రాజకీయ నేతగా కాకుండా ఓ సేవకరాలుగా పనిచేసి చూపిస్తానని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు. గురువారం గార్లదిన్నె మండలంలోని క్రిష్ణాపురం, ఇల్లూరు గ్రామాల్లో ఆమెతో పాటు ముఖ్య అతిథిలుగా ద్విసభ్యకమిటీ సభ్యలు ముంటిమడుగు కేశవరెడ్డి హజరై మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లినా.. టీడీపీ అభ్యర్థి శ్రావణిశ్రీ కు ప్రజలు నుంచి అపూర్వ స్పందన వస్తుంది. మహిళలు హరతిలు పట్టి, ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన... ఈ సారి శ్రావణమ్మ గెలుస్తుంది..... పైన సీఎంగా చంద్రబాబు నాయుడు అవుతారన్న మాట అందరి నోట వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని.... నియోజకవర్గ ప్రజలుకు రాజకీయ నేతగా కాకుండా సేవకరాలుగా ఉంటానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చింది. ప్రజలుకు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలుకు సేవ చేయాలని దృడ సంకల్పంతోనే రాజకీయలలోకి వచ్చానని ఓటర్లురు తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమిని భ య పడలేదని, ఏదీ ఏమైనా.. ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని నియోజక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను గెలిపిస్తే నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే.. తమ లక్ష్యమని అని తెలిపారు.
టిడిపి వస్తే మహిళలుకు ఆర్థికభివృద్ది- శ్రావణిశ్రీ, , ముంటి మడుగు కేశవరెడ్డి
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి లు అన్నారు. తెలుగుదేశం విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలలో మహిళల పెద్ద
పెద్ద పీఠ వేసిందన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు సవరత్నాలు పేరుతో కేవలం కొంత మంది వైసీపీ కార్యకర్తలకే పథకాలు వచ్చాయన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలుకు న్యాయం చేస్తామన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రైతాంగంను అదుకోవడంలో వైసీపీ తీవ్ర విఫలమైందన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెల్లినా... తాగు నీటి కోసం ప్రజలు అల్లాడి పోతున్నారన్నారు.
Mar 22 2024, 08:44