సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందం.. శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందం.. శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందంగా ఉన్నారని ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వీరభద్రకాలనీ, గిరిప్రసాద్, భాగ్యనగర్ లలో జిల్లా చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఆర్టీసీ జోనల్ పర్సన్ మాల్యవంతం మంజుల, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య తో కలిసి ఆయన పర్యటించారు.
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఐదేళ్ల జగనన్న పాలనపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి దగ్గరికి పింఛన్ అందిస్తున్న వైసిపి ప్రభుత్వానికి తమ ఓటు వేస్తామని అవ్వా తాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే వైయస్ జగనన్న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. టిడిపి పార్టీ పొత్తులతో మోసం చేయడానికి వస్తోందని ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్ నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Mar 22 2024, 09:00