రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుంది.. వీరాంజనేయులు ..
వైఎస్సార్సీపీతోనే పేదలందరికి మేలు.. శిగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందని వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రామిరెడ్డి, గాయత్రి, హమాలి కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.
ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా ఏర్పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని కోరారు. అమలు కాని వాగ్దానాలతో, ఉమ్మడి పొత్తులతో టీడీపీ ప్రజల్లోకి వస్తుందని వారిని నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో అడ్డుకోవడానికి వస్తున్నారని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నకు మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు.
పెద్దమ్మ గుడి గోడ నిర్మాణానికి రూ.2.00 లక్షలు విరాళం
మండల కేంద్రంలోని హమాలీ కాలనీలో ఉన్న శ్రీ పెద్దమ్మ గుడి చుట్టూ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డి సహకారంతో వైస్సార్సీపీ మండల నాయకులు ఆలూరు రమణారెడ్డి దాదాపు రూ.2.00 లక్షలు విరాళంగా అందజేశారు.
అడిగిన వెంటనే గుడి గోడ నిర్మాణానికి అందించిన ఎమ్మెల్యే దంపతులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mar 22 2024, 08:08